రమవ్వ | Parle biscuit packet in Ramavva | Sakshi
Sakshi News home page

రమవ్వ

Published Sun, Sep 11 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

రమవ్వ

రమవ్వ

పార్లే బిస్కెట్ పాకెట్‌పై ఏళ్ల పాటు కనిపిస్తూ వస్తున్న ఆ పాపే ఈ యువతి అనుకునే అవకాశం లేకపోలేదు. అయితే 18 ఏళ్ల రమవ్వకు, పార్లే పాపాయికీ ఏవిధమైన సంబంధమూ లేదు. ఉన్నదొక్కటే. బిస్కెట్‌లతో రమవ్వ అనుబంధం. నిజానికి అది అనుబంధం కూడా కాదు. పార్లే బిస్కెట్లు ఆమె అనుదిన ఆహారం. ఈ కర్ణాటక అమ్మాయి పుట్టినప్పటి నుంచీ ఈ బ్రాండు బిస్కెట్లే తింటోంది. తల్లి దగ్గర పాలు లేకపోవడంతో బయటి పాలు, పార్లే బిస్కెట్లు అలవాటయ్యాయి రమవ్వకు, ఆమె కవల సోదరుడు రామప్పకు.

పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ రామప్ప బిస్కెట్‌లను మానెయ్యగలిగాడు కానీ, రమవ్వ వాటిని వదల్లేకపోయింది. ఇప్పటికీ ఆమెకు బిస్కెట్లు తప్ప అన్నం సహించదు. పేదరికం వల్ల తల్లిదండ్రులు ఈ అమ్మాయిని వైద్యులకు చూపించలేకపోతున్నారు. బహుశా పార్లే కంపెనీ ఏమైనా ముందుకొస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement