parthasaradhireddi
-
పెనుబల్లి మండలంలో సండ్ర, ఎంపీ పార్థసారథిరెడ్డీ ప్రచారం
-
ప్రజాసేవ చేసేందుకే రాజ్యసభకు : బండి
ఖమ్మంఅర్బన్: ఎంత డబ్బు ఉన్నా వెంట రాదనే విషయాన్ని గుర్తించి నలుగురికి సాయపడే ననులు చేయాలని తద్వారా మంచి పేరు లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి పేర్కొన్నారు. అలాగే, పిల్లలను చదివిస్తూనే సమాజసేవ వైపు పయనించేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఖమ్మంలో ఆదివారం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మానసభలో ఎంపీ మాట్లాడారు. పిల్లలకు ఆస్తులు కంటే విజ్ఞానం అందించి స్వతహాగా జీవించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పార్లమెంట్ సభ్యుల వ్యక్తిగత ఖర్చుల కోసం కేంద్రప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తుండగా, ఆర్థిక స్తోమత ఉన్న సభ్యులు తిరస్కరించే అవకాశమున్నా శ్రీమంతులు సైతం స్వీకరిస్తున్నారని తెలిపారు. కానీ తాను మాత్రం ప్రభుత్వ సొమ్ము పైసా తీసుకోకుండా ప్రజాసేవ చేసేందుకే రాజ్యసభ సభ్యత్వం స్వీకరించినట్లు చెప్పారు. ఈమేరకు సదుపాయాలు, రవాణా చార్జీలు, వసతి సౌకర్యం కోసం కేంద్రం ఇచ్చే నిధులను పీఎం సహాయనిధికి, రాష్ట్రం నుండి వచ్చే వాటిని సీఎం సహాయనిధికి ఇచ్చేలా నిర్ణయించినట్లు తెలిపారు. కులమేదైనా మంచిని స్వీకరించి, నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. రెడ్డి సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు ఖమ్మంలో రెడ్డి సంక్షేమ భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఎంపీ పార్థసారధిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మొగిలి శ్రీనివాసరెడ్డితో పాటు శీలం వెంకట్‌రెడ్డి, ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, నూకల నరేష్‌రెడ్డి, వంగ సాంబశివారెడ్డి, మంజునాథరెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
రాజ్యసభ సభ్యులుగా దామోదర్‌రావు, పార్థసారథి రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. రెండు స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులైన దామోదర్‌రావు, పార్థసారథి రెడ్డి మాత్రమే బరిలో మిగలడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దామోదర్‌రావు, పార్థసారథి రెడ్డిలకు రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పాల్గొన్నారు. యూపీ నుంచి కె.లక్ష్మణ్ ఎన్నిక బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉత్తరప్ర దేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయ నను బీజేపీ నాయకత్వం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దించింది. పోటీ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు ‘నాకు రాజ్యసభ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు మరింత సేవ చేస్తాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ – పార్థసారథి రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తా ‘నన్ను విశ్వసించి రాజ్యసభ బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తా. సీఎం మార్గదర్శకత్వంలో, తెలంగాణ ప్రాంత, ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తా. రాజ్యసభలో తెలంగాణ వాణిని వినిపిస్తా.’ – దామోదర్‌రావు -
మెటర్నిటీ ఆస్పత్రి వైద్యుల ర్యాలీ
పీజీలు, హౌస్ సర్జన్లు విధులకు దూరం ఆస్పత్రి వద్ద గర్భిణీల ధర్నా తిరుపతి అర్బన్ : స్థానిక మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల గర్భిణీల భవనాన్ని స్విమ్స్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్ ర్లు, భవన నిర్మాణ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలు సోమవారం 6వ రోజుకు చేరా యి. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్లు డాక్టర్ పార్థసారధిరెడ్డి, డాక్టర్ కిరీటి ఆధ్వర్యంలో రుయా, మెటర్నిటీ వైద్యులతో పాటు పీజీ డాక్టర్లు, హౌస్ సర్జన్లు పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ చేపట్టారు. మెటర్నిటీ హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ర్యాలీని డాక్టర్ భారతి ప్రారంభించగా బస్టాండు సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద ముగిసింది. రుయా, మెటర్నిటీల్లో పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులను బహిష్కరించడంతో వేలాది మంది రోగులు, గర్భిణీలు అవస్థలు పడ్డారు. ఇందుకు నిరసనగా మెటర్నిటీ హాస్పిటల్ ఎదుట పలువురు గర్భిణీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్లు మాట్లాడుతూ సుమారు రూ.100 కోట్ల కేంద్ర నిధులతో నిర్మించుకున్న భవనాలను పేదలకు కాకుండా ప్రైవేటు చేతుల్లో నిర్వహిస్తున్న స్విమ్స్‌కు అప్పగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు చంద్రశేఖర్, సురేష్‌బాబు, గోపీకృష్ణ, విష్ణుభరద్వాజ్, భానుప్రకాష్, ప్రమోద్, మెటర్నిటీ, రుయా వైద్యులు పాల్గొన్నారు.