Parupally Kasyap
-
పారుపల్లి కశ్యప్ అవుట్.. క్వార్టర్స్‌లో ప్రణయ్
Taipei Open 2023- తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్‌వన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తాన్యా హేమంత్ (భారత్) 11–21, 6–21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. పోరాడి ఓడిన శ్రీజ న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్ యిహువా (చైనీస్ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్ వాంగ్ (చైనా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సత్యన్–మనిక బత్రా (భారత్) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్ బాసిత్ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించిం -
సాయిప్రణీత్, శ్రీకాంత్ ఇంటిముఖం
కౌలాలంపూర్: టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ కొత్త సీజన్‌ను పరాజయంతో ప్రారంభించారు. మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో సాయిప్రణీత్, శ్రీకాంత్‌లతోపాటు మరో తెలుగు షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 11–21, 15–21తో ప్రపంచ 19వ ర్యాంకర్ రస్ముస్ జెమ్కె (డెన్మార్క్) చేతిలో... ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 17–21, 5–21తో రెండో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రపంచ 23వ ర్యాంకర్ కశ్యప్ 17–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. రస్‌ముస్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. గతేడాది ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచిన ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండు గేముల్లోనూ ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయి ఆ తర్వాత కోలుకోలేకపోయాడు. మరోవైపు చౌ తియెన్ చెన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ కేవలం 30 నిమిషాల్లో చేతులెత్తేశాడు. తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రెండో గేమ్‌లో మాత్రం కేవలం ఐదు పాయింట్లు సాధించాడు. అయితే భారత్‌కే చెందిన సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ 21–16, 21–15తో వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)పై... ప్రణయ్ 21–9, 21–17తో కాంటా సునెయామ (జపాన్)పై గెలిచారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెంటో మొమోటాతో ప్రణయ్; లీ జి జియా (మలేసియా)తో సమీర్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహా్వల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–15, 21–13తో ఎవ్‌గెనియా కొసెత్‌స్కాయ (రష్యా)పై... సైనా 21–15, 21–17తో లియాన్ తాన్ (బెల్జియం)పై విజయం సాధించారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు; ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సైనా పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 10–21తో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
అత్యుత్తమ దశలో ఉన్నాను: కశ్యప్
న్యూఢిల్లీ : తన కెరీర్లోనే ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నానని... ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి పతకంతో తిరిగి వస్తానని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నెల రోజులపాటు తీవ్రంగా శ్రమించాను. నా కష్టానికి తగ్గ ఫలితం ఈసారి వస్తుందని భావిస్తున్నాను. నా ఆటతీరుతో కోచ్ గోపీచంద్ సంతృప్తిగా ఉన్నారు. నా కెరీర్లోనే ఇపుడు నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నాను’ అని ఈ హైదరాబాద్ ప్లేయర్ వ్యాఖ్యానించాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లాంటి మెగా ఈవెంట్లో అందరూ గట్టి ప్రత్యర్థులే ఉంటారు. మూడో రౌండ్లో నాకు కెంటో మొమోటా ఎదురయ్యే అవకాశముంది. సింగపూర్, ఇండోనేసియా ఓపెన్ టైటిల్స్ సాధించిన అతను ప్రస్తుతం గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. నావరకైతే కఠినమైన ‘డ్రా’నే ఎదురైంది’ అని కశ్యప్ అన్నాడు.