Patangrao Kadam
-
రాజ్యాంగ హక్కులే మూలాధారం
పట్నా: ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత సమాజానికి రాజ్యాంగం రక్షణ కల్పించిన హక్కులే మూలాధారమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉన్నప్పుడు చనిపోయే హక్కు కూడా ఉంటుందని వెల్లడించారు. పట్నాలోని భారతి విశ్వవిద్యాలయంలో జరిగిన డా.పతంగ్‌రావు కదమ్ స్మారకోపన్యాసంలో జస్టిస్ మిశ్రా ప్రసంగించారు. పాక్షిక యూథనేషియా(స్వచ్ఛంద మరణం)కు గతంలో సుప్రీం అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ..‘ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ బతికే హక్కున్న ప్రతి పౌరుడికి చనిపోయే హక్కు కూడా ఉంటుంది. దీని ఆధారంగానే తీర్పు ఇచ్చాం’ అని వెల్లడించారు. -
కదమ్ వ్యాఖ్యలపై ఎన్సీపీ మండిపాటు
ముంబై: ఎన్సీపీని తమ పార్టీలో విలీనం చేయాలంటూ సీనియర్ కాంగ్రెస్ మంత్రి పతంగ్‌రావు కదమ్ చేసిన ప్రతిపాదనపై ఈ పార్టీ మండిపడింది. ‘మా పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు సలహా ఇచ్చే స్థాయి కదమ్‌కు లేదు. ఆయన ముందుగా వాళ్ల పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలి. మహారాష్ట్ర ’ అని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే అన్నారు. ‘కదమ్‌కు మంచి హాస్యచతురత ఉంది.ఆ విషయాన్ని ఇంత వరకు ఎవరూ గుర్తించలేదు’ అని ట్విటర్లో రాశారు. 15 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఎన్సీపీని శరద్ పవార్ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఇదే మంచి సమయమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కదమ్ బుధ వారం అన్నారు. ‘గత చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఎన్సీపీ తిరుగుబాటు అభ్యర్థులు కాంగ్రెస్‌కు సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్లు ఎన్నికల్లో గెలిస్తే ఎన్సీపీ నెత్తిన పెట్టుకుంటోంది. ఏవో పదవులు ఇస్తోంది’ అని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
నీటి కోసం కర్ణాటకతో సంప్రదింపులు
పుణే: సాంగ్లి జిల్లా జాట్ తహసీల్‌కు నీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పతంగ్‌రావ్ కదమ్ వెల్లడించారు. మంగళవారం ఇక్కడ జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం నెలన్నరలోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 42 గ్రామాలు తీవ్ర నీటికొరత సమస్యను ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ప్రభుత్వం కర్ణాటకతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. జిల్లాలోని వివిధ రిజర్వాయర్లలో నీటి లభ్యతకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. జిల్లాలో కాలువల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కాగా జాట్ తహసీల్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో కర్ణాటక సరిహద్దులో ఉంది. దీంతో ఆ రాష్ట్రంలోని హైర్-పడ్సల్గి లేదా బబలేశ్వర్ జలాశయాలనుంచి నీటిని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.