ఎన్సీపీని తమ పార్టీలో విలీనం చేయాలంటూ సీనియర్ కాంగ్రెస్ మంత్రి పతంగ్‌రావు కదమ్ చేసిన ప్రతిపాదనపై ఈ పార్టీ మండిపడింది.
ముంబై: ఎన్సీపీని తమ పార్టీలో విలీనం చేయాలంటూ సీనియర్ కాంగ్రెస్ మంత్రి పతంగ్‌రావు కదమ్ చేసిన ప్రతిపాదనపై ఈ పార్టీ మండిపడింది. ‘మా పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు సలహా ఇచ్చే స్థాయి కదమ్‌కు లేదు. ఆయన ముందుగా వాళ్ల పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలి. మహారాష్ట్ర ’ అని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే అన్నారు. ‘కదమ్‌కు మంచి హాస్యచతురత ఉంది.ఆ విషయాన్ని ఇంత వరకు ఎవరూ గుర్తించలేదు’
అని ట్విటర్‌లో రాశారు.
15 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఎన్సీపీని శరద్ పవార్ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఇదే మంచి సమయమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కదమ్ బుధ వారం అన్నారు. ‘గత చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఎన్సీపీ తిరుగుబాటు అభ్యర్థులు కాంగ్రెస్‌కు సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్లు ఎన్నికల్లో గెలిస్తే ఎన్సీపీ నెత్తిన పెట్టుకుంటోంది. ఏవో పదవులు ఇస్తోంది’ అని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.