
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు...
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించటంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పవార్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేసింది ఎన్‌సీపీ. కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది.
ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్ నవంబర్ 2న డిఛార్జి కానున్నారని పార్టీ తెలిపింది. నవంబర్ 4 నుంచి 5 వరకు రెండు రోజుల పాటు శిరిడిలో నిర్వహించ తలపెట్టిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది.
राष्ट्रवादी काँग्रेस पक्षाचे राष्ट्रीय अध्यक्ष आदरणीय शरद पवार साहेब यांची प्रकृती ठीक नसल्यामुळे पुढील तीन दिवस पवार साहेबांना मुंबईतील ब्रीज कॅन्डी रुग्णालयात उपचारासाठी दाखल करण्यात येणार आहे. #NCP pic.twitter.com/YpjqjcFw1E
— NCP (@NCPspeaks) October 31, 2022