health condition deteriorates
-
మెట్లపై నుంచి పడిపోయిన పుతిన్
మాస్కో: ప్రపంచంలోని శక్తిమంతమైన నేతల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయారని అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. 70 ఏళ్ల పుతిన్ మెట్లపై నుంచి పడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయన బాడీగార్డ్స్ సోఫాలో కూర్చోబెట్టగా వైద్యులు చికిత్స అందించినట్లు సమాచారం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్య సమస్యలతో సమతమతవుతున్నట్లు వెల్లడిస్తూ వస్తున్న జనరల్ ఎస్వీఆర్.. తాజా పరిణామాన్ని రష్యన్ టెలిగ్రామ్ ఛానల్‌కు తెలిపినట్లు మీడియా పేర్కొంది. అయితే, ఈ విషయంపై క్రెమ్లిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. మెట్లపై నుంచి పడిపోవడం వల్ల తుంటి ఎముక దెబ్బతినంటతో పాటు జీర్ణాశయాంతర క్యాన్సర్ బయటపడిందని మీడియా పేర్కొంది. ‘సమీపంలోని సోఫాలోకి తీసుకెళ్లేందుకు ముగ్గురు సెక్యూరిటీ అధికారులు పుతిన్‌కు సాయం చేశారు. అధికారిక నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను పిలిపించారు. పుతిన్ ఇప్పటికే జీర్ణాశయాంతర పేగు ఆంకాలజీతో బాధపడుతున్నారు. దాని ఫలితంగా ఆయన ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ కారణంగానే మెట్లపై నుంచి పడిపోయారు.’ అని స్థానిక మీడియా పేర్కొంది. పుతిన్ మెట్లపై నుంచి పడిపోయిన క్రమంలో ఆయన ఆరోగ్యంపై మరోమారు వార్తలు గుప్పుమన్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి, దగ్గు, మైకము, నిద్రలేమి, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారని పలు మీడియాలు కథనాలు వెల్లడించాయి. పుతిన్ తన చుట్టూ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్లు నిత్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నారని గతంలోనూ పలు మీడియాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: చైనాలో ‘జీరో కోవిడ్’ ఆంక్షలు ఎత్తివేస్తే 20 లక్షల మరణాలు? -
క్షీణించిన ఆరోగ్యం.. సీనియర్ నటుడి పరిస్థితి విషమం
‘మిషన్ మంగళ్’ నటుడు విక్రమ్ గోఖలే పరిస్థితి విషమించింది. ఆయన 15 రోజులుగా పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి వైద్యులు నిరాకరించారు. ప్రస్తుతం ఆయన పూణేలో భార్యతో కలిసి ఉంటున్నాడు. సంజయ్ లీలా బన్సాలీ 'హమ్ దిల్ దే చుకే సనమ్ (1999)లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తండ్రిగా విక్రమ్ గోఖలే నటించారు. బాలీవుడ్లో 'భూల్ భులయ్యా', 'దిల్ సే','దే దానా దాన్', 'హిచ్కీ', 'నికమ్మ', 'మిషన్ మంగళ్' వంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో కనిపించారు. -
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అస్వస్థత
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించటంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పవార్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేసింది ఎన్సీపీ. కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్ నవంబర్ 2న డిఛార్జి కానున్నారని పార్టీ తెలిపింది. నవంబర్ 4 నుంచి 5 వరకు రెండు రోజుల పాటు శిరిడిలో నిర్వహించ తలపెట్టిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. राष्ट्रवादी काँग्रेस पक्षाचे राष्ट्रीय अध्यक्ष आदरणीय शरद पवार साहेब यांची प्रकृती ठीक नसल्यामुळे पुढील तीन दिवस पवार साहेबांना मुंबईतील ब्रीज कॅन्डी रुग्णालयात उपचारासाठी दाखल करण्यात येणार आहे. #NCP pic.twitter.com/YpjqjcFw1E — NCP (@NCPspeaks) October 31, 2022 -
దిలీప్ సాబ్ నా శ్వాస
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన చాలా నీరసంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి సైరా బాను ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం గురించి సైరా బాను మాట్లాడుతూ– ‘‘దిలీప్ సాబ్ ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నారు. ఆయన రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంది. ఇంట్లో తన గదిలో నుంచి హాలు వరకూ నడవగలుగుతున్నారు. గడుస్తున్న ప్రతీ రోజునీ ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అందుకే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆయన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. ఏదో అభినందనల కోసమో, అంకితభావం ఉన్న భార్య అనిపించుకోవాలనో ఆయన్ను చూడటంలేదు. ఆయన్ను తాకడం, హత్తుకోవడం నా జీవితంలో జరుగుతున్న గొప్ప విషయాలుగా భావిస్తాను. దిలీప్ సాబ్ అంటే నాకంత ఆరాధన. ఆయనే నా శ్వాస. ఆయన ఆరోగ్యం కోసం అభిమానులందరూ ప్రార్థించండి’’ అని అన్నారు. డిసెంబర్ 11తో దిలీప్ కుమార్‌కి 98 ఏళ్లు వస్తాయి. 1966 అక్టోబర్ 11న దిలీప్ కుమార్, సైరా బాను వివాహం జరిగింది. -
కునాల్ ఆరోగ్య పరిస్థితి విషమం
కోల్‌కతా: శారద చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ కునాల్ ఘోష్ ఆరోగ్యం విషమించింది. కుంభకోణంపై సమగ్ర రదర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్న ఆయన.. గడిచిన 28 రోజులుగా జైలులోనే నిరాహార దీక్ష చేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతోపాటు శరీరంలో కీటోన్స్ స్థాయి పెగిందని, కునాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని జైలు వైద్యులు.. సిబ్బందికి సూచించినట్లు సమాచారం. చిట్ ఫండ్ స్కామ్‌లో అరెస్టయిన కునాల్ రెండేళ్లుగా కోల్‌కతా సెంట్రల్ జైలులో విచారణా ఖైదీగా ఉన్నారు. గతేడాది నవంబర్‌లో కునాల్ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. సకాలంలో జైలు సిబ్బంది స్పందించడంతో ఆయన ప్రాణాలతో బయటపడగలిగారు. శారదా గ్రూప్‌నకు చెందిన శారదా మీడియా ద్వారా అత్యధిక లబ్ధి పొందింది బెంగాల్ సీఎం మమత బెనర్జీయేనని ఆరోపించడమే కాక, కోర్టులోనూ వాగ్మూలం ఇచ్చిన కునాల్.. 2013లో ఈ స్కాం బయటపడే నాటికి ఆ మీడియాకు సీఈవోగా ఉన్నారు. అప్పటికి పలు పత్రికలు, టీవీ చానళ్లు శారదా మీడియా చేతిలో ఉన్నాయి. ఈ కేసులో తనను బలి పశువును చేశారని తృణమూల్ నేతలపై కునాల్ ధ్వజమెత్తారు. ప్రజల నుంచి వేలకోట్ల రూపాయల డిపాజిట్ వసూలు చేసి మోసానికి పాల్పడిందన్న అభియోగంపై శారద చిట్ ఫండ్ సంస్థపై కోల్ కతా, ఒడిశాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణంలో పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు ఇప్పటికే రుజువులు లభించాయి.