‘మిషన్ మంగళ్’ నటుడు విక్రమ్ గోఖలే పరిస్థితి విషమించింది. ఆయన 15 రోజులుగా పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి వైద్యులు నిరాకరించారు. ప్రస్తుతం ఆయన పూణేలో భార్యతో కలిసి ఉంటున్నాడు.
సంజయ్ లీలా బన్సాలీ 'హమ్ దిల్ దే చుకే సనమ్ (1999)లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తండ్రిగా విక్రమ్ గోఖలే నటించారు. బాలీవుడ్‌లో 'భూల్ భులయ్యా', 'దిల్ సే','దే దానా దాన్', 'హిచ్కీ', 'నికమ్మ', 'మిషన్ మంగళ్' వంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment