path
-
మహాత్ముని మార్గంలో " ర్యాగట్లపల్లి "
-
బతుకు బాటలో మృత్యుగూటికి
- ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం - నందివర్గం సమీపంలో ఘటన బనగానపల్లె రూరల్ : కుటుంబ జీవనం కోసం కూలీ పనులకు వెళ్లిన ఓ యువకున్ని మృత్యువు ట్రాక్టర్ ప్రమాదం రూపంలో పొట్టనపెట్టుకుంది. బాధిత కుటుంబీకులకు తీరని రోదన మిగిల్చింది. నందివర్గం సమీపంలో గురువారం జరిగిన ఈ ఘటనలో ఎస్.సురేష్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఏఎస్ఐ చంద్రశేఖర్, కుటుంబ సభ్యుల వివరాల మేరకు బీరవోలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బాలహుస్సేనమ్మ దంపతులకు సురేష్, సంతోష్ కుమారులు. సురేష్‌తో పాటు అదే గ్రామానికి చెందిన బాషా ట్రాక్టర్‌కు నాపరాయి లోడింగ్ పనులకు వెళ్లారు. పలుకూరు గనిలో నాపరాయి గద్దెలను లోడ్ చేసుకుని బండి ఆత్మకూరు గ్రామానికి బయలుదేరారు. నందివర్గం సమీపానికి రాగానే ట్రాక్టర్ డ్రైవర్ సడన్‌బ్రేకులు వేయడంతో ట్రాలీ బోల్తా పడింది. ఘటనలో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న సురేష్‌పై రాళ్లు పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. బాషాకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు.. మృతి చెందిన సురేష్ నేత్రాలను ఆయన తల్లిదండ్ల్రులు దానం చేశారు. నంద్యాల శాంతిరామ్ వైద్యశాల కంటివైద్యులు బాధిత కుటుంబీకుల నుంచి మృతుడి నేత్రాలను స్వీకరించారు. -
దిశ మార్చుకున్న 'వార్దా'
-
దిశ మార్చుకున్న 'వార్దా'
విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర పెను తుపాను వార్దా ఆదివారం దిశ మార్చుకుంది. తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం వార్దా అధిక ప్రభావం చెన్నైపై ఉండనుంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఆదివారం ఉదయం వరకూ కోస్తాంధ్ర వైపు దూసుకువచ్చిన తుపాను.. ఒక్కసారిగా చెన్నై దిశగా పయనించడం ఆరంభించినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 520, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 490, చెన్నైకి తూర్పున 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావం కారణంగా పుదుచ్చేరి, తమిళనాడు ఉత్తర సముద్రతీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
క్రీస్తు మార్గం అనుసరణీయం
కథోలిక సంఘ పీఠాధిపతి గాలి బాలి గుంటూరు ఈస్ట్: ఏసీ కళాశాల సమీపంలోని పునీత ఆగ్నేశమ్మ దేవాలయంలో బుధవారం కృతజ్ఞతా దివ్య పూజా బలి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కథోలిక సంఘ పీఠాధిపతిగా రెవరెండ్ డాక్టర్ గాలి బాలి 32 ఏళ్లపాటు సేవలందించినందుకుగాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత అరండల్‌పేట ఎనిమిదో లైను నుంచి గాలి బాలిని ఊరేగింపుగా దేవాలయం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు అడుగు జాడల్లో నడిచినందునే కథోలిక సంఘం ఆశీర్వాదం పొందిందన్నారు. సేవా కార్యక్రమాలే సంఘానికి ఊపిరి అని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సంఘ సభ్యులంతా ముందుకు కదలాలని సందేశమిచ్చారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పాస్టర్ పిల్లి ఆంథోని పాల్గొన్నారు.