నడక దారిలో భద్రత కట్టుదిట్టం
తిరుపతి: తిరుమల కాలిబాటలో భక్తులపై ఉన్మాది దాడి నేపథ్యంలో తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. నడక దారిలో భద్రతను మరింత పెంచాలని నిర్ణయించింది. ముఖ్యంగా రాత్రి వేళలో గస్తీ ముమ్మరం చేయాలని భావిస్తోంది. అలిపిరి చెక్ పోస్టు వద్ద విస్తృత తనిఖీల అనంతరమే నడకదారిలోకి భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
కాగా ఉన్మాది దాడిలో గాయపడిన గోవిందరాజస్వామి దంపతులు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల తరపు బంధువులు తంజావూర్ నుంచి తిరుపతి చేరుకున్నారు. అయితే దాడి చేసింది ఉన్మాది కాదని చైన్ స్నాచర్గా అనుమానిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారి హన్మంతు వెల్లడించారు. బంగారం, నగదు కోసమే ఆ దాడి చేసి ఉంటాడని తాము భావిస్తున్నామని తెలిపారు.