Pathivada Narayana Swamy
-
ఏడు సార్లు గెలిచినా టికెట్ ఇవ్వరా..!
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల పంచాయతీ ఆ పార్టీ సీనియర్ నేతల్లో తీవ్ర అసహనానికి కారణమైంది. విజయనగరం జిల్లా టీడీపీలో టికెట్ల రగడ కొనసాగుతోంది. ప్రధానంగా బీసీ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించే అంశాన్ని చంద్రబాబు కావాలనే పెండింగ్‌లో పెడుతున్నారని టీడీపీ సీనియర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీటు ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల వయస్సులో 5 రోజులుగా సీఎం ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నానని వాపోయారు. కనీసం తన వయస్సుని గౌరవించకుండా తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. నెల్లిమర్ల అసెంబ్లీ సీటును నారాయణస్వామికి ఇచ్చే అవకాశం ఉన్నా.. భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఆనంద్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కడగల ఆనంద్‌కుమార్ అడ్డుపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. పతివాడ తన కుమారుడు అప్పలనాయుడికి టికెట్టు ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇక మరో బీసీ మహిళ ఎమ్మెల్యే మీసాల గీత టికెట్ కూడా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలిసింది. తొలి జాబితాలో అవినీతి ఆరోపణలు ఉన్న నేతలకు, రాజులకే అగ్రస్థానం ఇచ్చారని ఆమె ఆరోపించారు. కాగా, తన కుమార్తె అదితికి టికెట్ ఇప్పించుకునేందుకు గీతను ఎంపీ అశోక్ గజపతి రాజు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గీత ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం శాసనసభా స్థానాన్నితన కుమార్తెకు ఇవ్వాలని అశోక్ పట్టుబడుతున్నట్టు సమాచారం. బీసీ మహిళకు ఒక్క సీటు కూడా ఇవ్వరా అని టీడీపీ తీరుపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే కొడుకు భూమిపై రైతులు దాడి
-
రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు
-
రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన సభ తొలి సమావేశాలు గురువారం ప్రారంభంకానున్నాయి. ఐదు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి వ్యవహరిస్తారు. గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం 9.15 గంటలకు ఆయనతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత 11.52 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభకు ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారు. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, అనంతరం మంత్రులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా సభ్యులందరితో వరుసగా ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారాల అనంతరం ఇటీవల మరణించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావుకు సభ సంతాపం తెలుపుతుంది. ఆతర్వాత సభ మరునాటికి వాయిదాపడుతుంది. 20వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21వ తేదీన ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 22వ తేదీ సెలవు. 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. తొలి సమావేశాలకు సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల కోసం పాత శాసనసభ భవనాన్ని తీర్చిదిద్దారు. పాత టీడీఎల్పీ భవనాన్ని ముఖ్యమంత్రి చాంబర్‌గా మార్చారు. ఏపీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లేందుకు రెండో నంబర్ గేట్‌ను కేటాయించారు. పురాతన భవనం అయినందున మీడియా, సందర్శకుల గ్యాలరీల్లో ఎక్కువమందిని అనుమతించే అవకాశం లేదు. సందర్శకులకు అనుమతి లేదు. -
విధేయతకే అందలం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆదివారం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు క్యాబినెట్ మంత్రులు ప్రమాణం స్వీకారం చేస్తారు. అందులో జిల్లా నుంచి ఒకే ఒక్కరికి అవకాశం లభించింది. ఆ అదృష్టం జిల్లాలో సీనియర్ నేత, పార్టీ విధేయునిగా పేరుపొందిన పతివాడ నారాయణ స్వామి తలుపుతట్టింది. ఈ మేరకు అధినేత నుంచి శనివారం రాత్రి సమాచారం అందినట్టు తెలిసింది. వాస్తవానికైతే జిల్లా నుంచి ప్రధానంగా ఇద్దరు నేతలు మంత్రి పదవులను ఆశించారు. అందులో ఒకరు పతివాడ నారాయణస్వామినాయుడు, మరొకరు కోళ్ల లలితకుమారి. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీ సీనియర్ నేతగా, గతంలో చక్కెర, ఉద్యానవన శాఖామంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దృష్ట్యా పతివాడకే మంత్రి పదవి దక్కింది. పార్టీ ఆవి ర్భావం నుంచి ఆయన విధేయుడిగా ఉండడం కూడా రెండోసారి మంత్రి కావడానికి దోహదపడింది.మరో నేత కోళ్ల లలితకుమారి రెండుసార్లు ఎన్నికవడమే కాకుండా ఆ పార్టీ సీనియర్ నే త కోళ్ల అప్పలనాయుడి రాజకీయ వా రసురాలు కావడంతో రేసులోకి వచ్చా రు. అయితే ఆమెకు మంత్రి వర్గ విస్తర ణలో పదవిదక్కొచ్చని భావిస్తున్నారు.