Pationt died
-
మహారాష్ట్రలో మరో ఘోరం..
సాక్షి ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. ముంబైకి సమీపంలోని విరార్‌లోని ఓ ఆసుపత్రిలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. పాల్ఘర్ జిల్లా విరార్‌లోని విజయ్ వల్లబ్ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో ముగ్గురు రోగులు బయటికి వెళ్లగలిగారు. కానీ మిగతా 14 మంది కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల వారందరు సజీవదహనమయ్యారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 90 మంది రోగులున్నారు. నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ లీకేజీ కారణంగా ప్రాణవాయువు అందక 24 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఢిల్లీ ఆసుపత్రిలో 25 మంది మృతి దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత సర్ గంగారాం హాస్పిటల్లో సరిపడా ప్రాణవాయువు లేక 24 గంటల్లో 25 మంది కరోనా బాధితులు చనిపోయారు. తక్కువ పీడనంతో ఆక్సిజన్ సరఫరా కావడమే ఈ మరణాలకు కారణమని అధికారులు తెలిపారు. వారికి అవసరమైన ఆక్సిజన్ అందక చనిపోయినట్లు భావిస్తున్నారు. మరో 60 మంది బాధితుల పరిస్థితి ఆదోళనకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో 500 మందికిపైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 150 మంది హై ఫ్లో ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారు. వీరికి అధిక పీడనంతో ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. అయితే, గంగారాం ఆసుపత్రిలో సరిపడా ఆక్సిజన్ నిల్వ లున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. -
వైద్యుల నిర్లక్ష్యం?
శ్రీకాకుళం అర్బన్ : నగరంలోని డే అండ్ నైట్ కూడలి సమీపంలో బ్రిడ్జి పక్కన గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బుడ్డయ్యగారిపేటకు చెందిన మైలపల్లి రామారావు(45) మృతి చెందాడని ఆయన బంధువులు శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే... గార మండలం శ్రీకూర్మాం పంచాయతీ బుడ్డయ్యగారిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు మైలపల్లి రామారావు మూడు రోజుల క్రితం కడుపునొప్పితో ఈ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స చేశారని, తర్వాత ఆ చికిత్స విషమించడంతో అప్పటికప్పుడు మృతుని బంధువుల అనుమతి లేకుండా ఆస్పత్రి వాహనంలోనే రాగోలులోని ఓ ఆస్పత్రికి తరలించారని బాధితులు పేర్కొన్నారు. అయితే శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతిచెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే శస్త్ర చికిత్స పేరిట రూ. 50 వేలకు పైగా వసూలు చేశారని తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో దారుణం
-
కర్నూలు పెద్దాస్పత్రిలో దారుణం
కర్నూలు(హాస్పిటల్): వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతి చెందిన సంఘటన కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటు చేసుకుంది. రోగుల కేస్‌షీట్లు తారుమారు కావడంతో ఒకరికి ఇవ్వాల్సిన వైద్యం మరొకరికి అందించారు. దీంతో రోగి కోలుకోలేక మృతి చెందాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజపురానికి చెందిన భీమన్న గత నెల 24న కర్నూలు సర్వజన వైద్యశాలలోని న్యూరో సర్జరీ వార్డులో చేరి చికిత్స పొందాడు. అదే రోజున అనంతపురం జిల్లాకు చెందిన భీమప్ప రోడ్డు ప్రమాదానికి గురై అదే వార్డులో చేరాడు. పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతోపాటు వైద్యుల నిర్లక్ష్యంతో కేస్‌షీట్లు తారుమారయ్యాయి. భీమప్పకు అందించాల్సిన వైద్యాన్ని భీమన్నకు అందించారు. దీంతో భీమన్న కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని వైద్యులు చెప్పడంతో అతని కుటుంబీకులకు అనుమానం వచ్చింది. అనారోగ్యంతో చనిపోతే పోస్టుమార్టం చేస్తారా అని ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సోమవారం ఆస్పత్రిలోని క్యాజువాలిటీ వద్ద భీమన్న కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. తన భర్త మరణానికి కారణం వైద్యులేనని భార్య తెలుగు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ వివరణ ఇస్తూ.. భీమప్ప ఆస్పత్రిలో చేరిన మాట వాస్తవమేనని, కానీ ఆయన వార్డులో చేరి చికిత్స తీసుకోలేదని చెప్పారు. భీమన్న పేరును పొరపాటున భీమప్పగా నమోదు చేశారన్నారు. భీమన్నకు ఇచ్చిన వైద్యంలో ఎలాంటి లోపమూ లేదన్నారు. కర్నూలు పెద్దాస్పత్రిలో దారుణం -
ఆస్పత్రి 3వ అంతస్తు నుంచి జారిపడి రోగి మృతి
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని మూడో అంతస్తు నుంచి ఓ రోగి జారిపడి మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వెంకటసుబ్బయ్యగా గుర్తించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై అధికారులు విచారిస్తున్నారు.