Patna aims
-
నీట్ పేపర్ లీక్ కేసు.. పాట్నా ఎయిమ్స్ వైద్యుల అరెస్ట్
నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నీట్ వ్యవహారాన్ని విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా బిహార్‌లోని ఎయిమ్స్ పాట్నాకు చెందిన ముగ్గురు వైద్యులను అరెస్ట్ చేసింది.ఈ ముగ్గురిపైనా పేపర్ లీక్, ప్రవేశ పరీక్షలో అవకతవకలు తదితర ఆరోపణలు ఉన్నాయి. నిందితుల గదులకు సీల్ వేసిన సీబీఐ.. ల్యాప్‌టాప్, మొబైల్‌ను సీజ్ చేసింది. ముగ్గురూ 2021 బ్యాచ్‌కు చెందిన వైద్యులుగా గుర్తించారు. నేడు వీరిని అధికారులు విచారించనున్నారు.కాగా రెండు రోజుల క్రితమే నీట్ పేపర్ దొంగతనం ఆరోపణలపై సీబీఐ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. బిహార్‌లో పంకజ్ కుమార్, జార్ఖండ్‌లో రాజు సింగ్‌ను అరెస్ట్ చేసింది. పాట్నా ప్రత్యేక కోర్టు వీరిద్దరికీ 14, 10 రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. ఈ కేసులో కింగ్‌పిన్ రాకేష్ రంజన్ అలియాస్ రాకీ కూడా కస్టడీలో ఉన్నాడు.ఇదిలా ఉండగా నేడు(గురువారం) నీట్ పేపర్ లీక్ సహా అక్రమాలకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జూలై 11న జరిగిన విచారణలో కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి స్పందన లేకపోవడంతో.. పరీక్షను రద్దు చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని, అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు జూలై 18కి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేదే నీట్-యూజీ పరీక్ష. ఈ ఏడాది మే 5న జరిగిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. బిహార్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించినది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో నమోదైనవి అభ్యర్థులను మోసగించిన వాటికి సంబంధించినవి -
భుజంపై కూతురి శవంతో 4 కి.మీ!
-
భుజంపై కూతురి శవంతో 4 కి.మీ!
పట్నా: బిహార్‌లో మరో దారుణం. పట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఓపీ కార్డు కావాలంటే క్యూలైన్లోనే రావాలని అధికారులు చెప్పడంతో ఆ కార్డు తెచ్చేలోగా ఓ చిన్నారి(9) ప్రాణాలు కోల్పోయింది. చివరికి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ అంబులెన్స్ ఇవ్వడానికి కూడా ఆస్పత్రి సిబ్బందికి మనసొప్పలేదు. దీంతో వేరే గతిలేక ఆ తండ్రి తన కుమార్తె శవాన్ని 4 కిలోమీటర్ల పాటు భుజాన మోసుకుంటూ వెళ్లాడు. బిహార్‌లోని లక్షిసరై జిల్లా కజ్రా గ్రామానికి చెందిన రామ్ బాలక్ దంపతుల కుమార్తె రౌషణ్ కుమారి ఆరు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఎయిమ్స్ ఆస్పత్రికి తెచ్చారు. అక్కడి సిబ్బంది తొలుత ఔట్ పేషంట్(ఓపీ)కార్డు తేవాలని చెప్పారు. నిరుపేద కూలి అయిన రామ్ బాలక్ ఓపీ కార్డు కోసం యత్నిస్తుండగా.. కుమార్తె పరిస్థితి తీవ్రంగా ఉందని అతని భార్య తెలిపింది. దీంతో వెంటనే తనకు ఓపీ కార్డు మంజూరు చేయాలనీ, తన చిన్నారి పరిస్థితి తీవ్రంగా ఉందని కౌంటర్లో ఉన్న అధికారిని అభ్యర్థించారు. తనను ముందుకు వెళ్లనివ్వాలని లైన్లో ఉన్నవారిని వేడుకున్నారు. అయితే ఓపీ కార్డులిచ్చే ఆయన ససేమిరా అన్నారు.చివరికి ఓపీ కార్డు తీసుకుని వచ్చేసరికి రోషణ్ కుమారి ప్రాణాలు కోల్పోయింది. దీనికి తోడు చనిపోయిన కుమార్తె శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కనీసం అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరిన రామ్‌బాలక్ విన్నపాన్నీ ఎయిమ్స్ అధికారులు తిరస్కరించారు. ప్రైవేటు వాహనం ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడంతో, రామ్ బాలక్ కూతురి శవాన్ని భుజాన వేసుకుని 4 కి.మీ. నడిచివెళ్లారు. -
ఉద్యోగ సమాచారం
ఎన్ఐఎన్లో 8 పోస్టులు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.చివరి తేది మార్చి 15. వివరాలకు www.ninindia.org చూడొచ్చు. మిధానిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ (మిధాని).. వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6. చివరి తేది ఫిబ్రవరి 24. వివరాలకు www.midhani.gov.in చూడొచ్చు. పట్నా ఎయిమ్స్‌లో 59 పోస్టులు పట్నాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్, జూనియర్ రెసిడెంట్స్/ట్యూటర్/ డిమాన్స్ట్రేటర్స పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించ నుంది. మొత్తం ఖాళీలు 59. వివరాలకు www.aiimspatna.org చూడొచ్చు. ఈఎస్ఐసీలో వివిధ పోస్టులు హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీలు ఫిబ్రవరి 19, 23. వివరాలకు www.esic.nic.in చూడొచ్చు. నిమ్హాన్సలో వివిధ పోస్టులు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్ (నిమ్హాన్స) వివిధ విభాగాల్లో సీనియర్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ అసిస్టెంట్, స్టాటిస్టీసియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. చివరి తేది ఫిబ్రవరి 20. వివరాలకు www.nimhans.ac.in చూడొచ్చు. హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్‌లో వివిధ పోస్టులు హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.lifecarehll.ఛిౌఝ చూడొచ్చు.