patna hospital
-
పట్నా హాస్పిటల్ లో తేజస్వియాదవ్ ఆకస్మిక పర్యటన
-
ఆస్పత్రిలో మాజీ సీఎం హల్చల్
బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజి ఆస్పత్రికి ఉన్నట్టుండి ఓ అనుకోని అతిథి వచ్చారు. ఆయన్ను చూసి పేషెంట్లు ఆశ్చర్యపోగా.. డాక్టర్లు పరుగు పరుగున వచ్చారు. ఆయనే.. ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్. ఆయనకు తెలిసున్నవాళ్లు ఎవరో చికిత్స పొందుతుంటే చూసేందుకు వచ్చారేమోనని అందరూ అనుకున్నారు. కానీ.. తన కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యశాఖ మంత్రి కావడంతో.. అతడి తరఫున ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు లాలు వచ్చినట్లు కాసేపటికి అందరికీ అర్థమైంది. లాలు నేరుగా రోగుల వద్దకు వెళ్లి, ఆస్పత్రిలో సేవలు ఎలా ఉన్నాయని అడిగారు. పలు వార్డులను తనిఖీ చేశారు. నిజానికి 1997లో గడ్డి స్కాంలో లాలును జ్యుడీషియల్ కస్టడీకి పంపినప్పుడు ఆయన ఇదే ఆస్పత్రిలో చాలా నెలల పాటు ఓ వీఐపీ రూంలో 'పేషెంటు'గా గడిపారు. అయితే, తాను అక్కడకు దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఓ పేషెంటును కలిసేందుకు వెళ్లానని, దారిలో ఈ ఆస్పత్రి కనిపిస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని ఆగానని లాలు ఆ తర్వాత మీడియాతో అన్నారు. ఈ వ్యవహారం సీఎం నితీష్‌కుమార్‌కు తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. లాలు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు.. ప్రధానంగా బీజేపీ విరుచుకుపడే అవకాశం స్పష్టంగా ఉంది. -
ఆస్పత్రి దుస్థితి చూసి.. సీఎం షాక్!
బీహార్ రాష్ట్రంలో ఇంకా అరాచక వ్యవస్థ రాజ్యమేలుతూనే ఉంది. ఈ విషయం సాక్షాత్తు ముఖ్యమంత్రి పరిశీలనలోనే తేలడంతో ఆయన అవాక్కయ్యారు. పాట్నా నగరంలో విజయదశమి రోజున తీవ్ర తొక్కిసలాట జరిగి 33 మంది మరణించినా.. ఇంకా అనేకమంది గాయపడినా, అక్కడ మాత్రం నిర్లక్ష్యం ఇంకా ఏమాత్రం వీడలేదు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రికి వెళ్లారు. కానీ, అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం చూసి ఆయన షాకయ్యారు. కనీసం మందులు కూడా లేకపోవడం, ఆ వార్డు మొత్తం అపరిశుభ్రంగా, చిరాగ్గా ఉండటంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ''అక్కడ వైద్యులు లేరు. నేను తొక్కిసలాట బాధితులతోను, ఇతర రోగులతో కూడా మాట్లాడాను. అక్కడ వైద్యులు రాసిన మందుల్లో 82 శాతం అసలు అందుబాటులో లేవు. బయటనుంచి తెచ్చుకుంటున్నారు. కేవలం ఇంజెక్షన్లే ఇక్కడ ఇస్తున్నారు. వెంటనే సూపరింటెండెంట్‌ను పిలిచాను. కానీ ఆయన కూడా లేరు'' అని సీఎం మాంఝీ వాపోయారు. దుప్పట్లను నెలరోజులకోసారే మారుస్తున్నారని, అప్పుడప్పుడు మాత్రమే 15 రోజులకు మారుస్తున్నారని ఆయన చెప్పారు. నిబంధనలేవీ ఇక్కడ పాటించట్లేదని, బాత్రూంలు కూడా చాలా అసహ్యంగా ఉన్నాయని, అసలక్కడ నీళ్లు రావట్లేదని తెలిపారు. 45 రోజుల క్రితం అడ్మిట్ అయిన రోగులను కూడా డాక్టర్లు చూడట్లేదని, రెగ్యులర్ రౌండ్లకు కూడా రావట్లేదని అన్నారు. దీనిపై ఆలోచించి రేపే కఠిన చర్యలు తీసుకుంటానని మాంఝీ చెప్పారు.