Patnambajaru
-
మ్యాచింగ్ సెంటర్ ముసుగులో.. యువతులను మభ్యపెట్టి!
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): చీరల వ్యాపారం ముసుగులో చీకటి వ్యాపారం చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వ్యభిచార నిర్వాహకురాలితో పాటు, ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.సుప్రజ వివరాలు వెల్లడించారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో (0) లైనులో నివాసం ఉండే షేక్ లాల్‌బీ అలియాస్ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ పేరుతో చిన్నపాటి వస్త్ర దుకాణం నడుపుతోంది. పదేళ్ల కిందట ప్రైవేట్ ట్రావెల్స్‌లో పనిచేసే శ్రీనివాసరావును వివాహం చేసుకుంది. అప్పటికే విలాసాలకు అలవాటు పడిన శ్రీలక్ష్మి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాచలోనతో మ్యాచింగ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో షాపునకు వచ్చే చిన్న కుటుంబాలకు చెందిన మహిళలు, భర్తను కోల్పోయినవారు, కుటుంబ పరిస్థితులు సరిగా లేనివారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న యువతులను మభ్యపెట్టి వారిని చీకటి కూపంలోకి దింపి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో నగరంపాలెం పోలీసులు ఈ నెల 17వ తేదీ రాత్రి ఏటీ అగ్రహారంలోని ఆమె నివాసంలో దాడి చేసి నిర్వాహకురాలు శ్రీలక్షి్మ, ముగ్గురు యువతులు, ముగ్గులు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మరెక్కడైనా ఇటువంటి వ్యభిచార గృహాలు ఉంటే డయల్ 100, లేక వెస్ట్ డీఎస్పీ ఫోన్ నంబర్ 86888 31330కు సమాచారాన్ని అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో నగరంపాలెం పీఎస్ ఎస్‌హెచ్‌వో ఎ.మల్లిఖార్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా ఎల్బీనగర్ వ్యభిచారం గుట్టురట్టు -
సమస్య పరిష్కరించుకుందామని పిలిచి టీడీపీ నేతల దాడి..!
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): తెలుగుదేశం పార్టీ నేతల దాష్టీకానికి ఓ నిండు ప్రాణం బలైంది. మృతుడి సోదరుడు సాకి హనుమంతరావు, పోలీసుల కథనం మేరకు..గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి పమిడిపాడు గ్రామానికి చెందిన సాకి ఆంజనేయులు(28) కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 5వ తేదీన మంచినీరు పట్టుకునేందుకు పంచాయతీకి చెందిన నీటి ట్యాంకర్ వద్దకు వెళ్లాడు. అయితే కేవలం టీడీపీకి చెందినవారు మాత్రమే నీరు పట్టుకోవాలని.. మిగతావారు అక్కడినుంచి వెళ్లిపోవాలని అధికారపార్టీ నేతలు హుకుం జారీ చేశారు. దీంతో గ్రామంలోని ప్రజలకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్‌ను తీసుకుని ఆంజనేయులు గ్రామానికి వచ్చారు. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన ట్యాంకర్ ఎందుకు తీసుకొచ్చావంటూ అతడిపై టీడీపీ నేతలు రాతం ఏడుకొండలు, రాతం వెంకటేశ్వర్లు, రాతం శ్రీనివాస్, రాతం బుజ్జాయి, రాతం పెదశ్రీను, రాతం చినవెంకటేశ్వర్లు, రాతం నర్సమ్మతో పాటు మరికొంత మంది ఘర్షణకు దిగారు. ఈ వివాదంపై గ్రామంలోని ఇరువర్గాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై 7వ తేదీన పోలీసుస్టేషన్‌కు వెళుతున్న ఆంజనేయులు, అతని సోదరుడు హనుమంతరావును గ్రామ పెద్దలు బ్రహ్మయ్య, చినయోహన్, కుర్రా పెదసాంబయ్య, గంటా వెంకటేశ్వర్లు వివాదం పరిష్కరించుకుందామని చెప్పి తిరిగి గ్రామానికి పిలిపించారు. అప్పటికే కర్రలు, రాడ్లు, కత్తులతో కాచుకుని కూర్చున్న టీడీపీ నేతలు ఆంజనేయులు, హనుమంతరావుతో పాటు వారి బంధువులపై కళ్లల్లో కారం కొట్టి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆంజనేయులు తీవ్రంగా గాయపడగా.. హనుమంతరావు మిగిలిన కుటుంబ సభ్యులు సైతం గాయపడటంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు అత్యవసర చికిత్స పొందిన ఆంజనేయులు శుక్రవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు తమకు గ్రామంలో రక్షణ కల్పించాలని..టీడీపీ నేతల అరాచకాల నుంచి కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
సచివాలయానికి 20 మెట్రో బస్సులు
గుంటూరు (పట్నంబజారు) : రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయానికి గుంటూరు రీజియన్ నుంచి 20 మెట్రో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కార్మిక పరిషత్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ నగరంలోని ప్రధాన కూడళ్లు, నాగార్జున యూనివర్సిటీ, రెయిన్‌ట్రీ పార్కు వద్ద నుంచి సచివాలయానికి మెట్రో సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు. సచివాలయం వద్ద ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లేందుకు సచివాలయం నుంచి బస్సులు నడపనున్నట్లు, తిరిగి సచివాలయానికి రావడానికి ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయాన్ని ఆర్జించడానికి సమష్టిగా కృషి చేయాలని సిబ్బందికి తెలియజేశారు. పోటీ వాతావరణంలో మరింత పోటీతత్వాన్ని పెంచుకొని, సమయపాలన పాటిస్తూ, నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. గుంటూరు రీజియన్‌లో ఉన్న 13 డిపోల్లో ఒక్క మాచర్ల డిపో మాత్రమే గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఆదాయాన్ని సాధిస్తోందని తెలిపారు. డిపోల్లోని అధికారులు బస్సులను పంపించడమే కాకుండా బస్సుల పరిశుభ్రత, కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన, స్టేజిల్లో బస్సులు ఆపకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి ఉండడం, మహిళలతో అసభ్య ప్రవర్తన మొదలైన అంశాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో కార్మిక పరిషత్ రీజనల్ సెక్రటరీ రాజేష్, నరసరావుపేట, గుంటూరు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వెంకటేశ్వరరావు, వాణిశ్రీ, అకౌంట్స్ ఆఫీసర్ పవన్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ దొంగల బీభత్సం
పట్నంబజారు : చుట్టుగుంట సమీపంలోని కోదండరామ్‌నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం దోపిడీదొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని కట్టిపడేసి, బీరువాలోని 80 సవర్ల బంగారం, నగదు దోచుకుపోయిన సంఘటన సంచలనం రేకెత్తించింది. నగరంపాలెం పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కోదండరామ్‌నగర్ 4వలైనుకు చెందిన షేక్ బాషా ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కుమారుడి ఉద్యోగ పరీక్షల నిమిత్తం కృష్ణాజిల్లాలోని కంచికచర్లకు ఈ నెల 20వ తేదీన వెళ్లారు. ఇంట్లో కుమార్తె నిగర్‌సుల్తానా(నీలు) మాత్రమే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఒక యువతి బుర్ఖా వేసుకుని వచ్చి నీలూ అంటూ మద్దు పేరుతో పిలిచింది. బుర్ఖాలో ఉన్న యువతి స్నేహితురాలు అయి ఉంటుందని భావించిన నీలు తలుపులు తీయగానే, వచ్చిన యువతి హడావుడిగా ఇప్పుడే వస్తా.. ఉండమంటూ కిందకు వెళ్లిపోయింది. కొద్దిసేపు వేచిచూసిన నీలు తిరిగి ఇంట్లోకి వెళ్లిపోతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక యువతి, ఇద్దరు యువకులు ఆమెను కిందపడేసి కొట్టారు. ప్లాస్టర్లతో నీలుని కట్టిపడేసి, గొంతు కు చున్నీని బిగించి బీరువా తాళాలు ఎక్కడ ఉన్నాయో... చెప్పాలని బెదిరించారు. ఇవ్వకపోతే చంపుతామని, నీలుని అక్కడ నుండి తీసుకుని వెళ్లి బాత్రూమ్ వద్ద పడేశారు. గుడ్డతో గొంతు నులిమి పిడిగుద్దులు కురిపించడంతో నీలు భయకంపితురాలై వారికి బీరువా తాళాలు ఇచ్చేసింది. నీలును స్పృహ కోల్పోయేలా గాయపరిచిన దుండగులు బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు దోచుకుపోయారు. కొద్దిసేపటికి పక్కింట్లో ఉన్న వారు నీలుని గమనించి కట్లు విప్పదీసి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. నిందితులు చోరీల్లో ఆరితేరిన వారిలా బీరువా, ఇతర వారు పట్టుకున్న వస్తువులపై కారం చల్లారు. ముగ్గురూ హిందీభాషలో మాట్లాడుతున్నారని బాధితురాలు తెలిపింది. తెలిసిన వారి పనేనా...? బాషా కుటుంబ సభ్యులు ఇంట్లోలేరని, కేవలం కుమార్తె నీలు మాత్రమే ఉందని తెలిసిన వారు మాత్రమే ఇందుకు పాల్పడి ఉంటారని పోలీసు లు భావిస్తున్నారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. నివాసం ఎదురుగా ఉన్న సీసీ ఫుటేజీలో వచ్చిన దుండగుల వివరాలను పోలీసులు కనుగొన్నట్లు తెలిసింది. సంఘటన స్ధలాన్ని ఏఎస్పీ వెంకటప్పలనాయుడు, సీసీఎస్ అడిషనల్ ఎస్పీ బీపీ తిరుపాల్, డీఎస్పీ పి. శ్రీని వాసరావు, సీఐలు ధర్మేంద్రబాబు,ఇ.వేమారెడ్డి తదితరులు పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.