pattas
-
పోడు ‘పట్టం’ కట్టేదెవరికో
ఏళ్ల తరబడి అడవిని నమ్ముకొని పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసిన బీఆర్ఎస్ ఎన్నికల్లో లబి్ధదారుల మద్దతు తమకే ఉంటుందని భావిస్తోంది. తమకే గంపగుత్తగా ఓట్లు పడుతాయని లెక్కలు వేసుకుంటోంది. అయితే తాము 2006లోనే పోడు భూములకు పట్టాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఆ తర్వాత పట్టాలు ఇచ్చే ప్రక్రియలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పోడు పట్టాలు పొందిన గిరిజనులు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 1,50,012 మంది రైతులు.. 4,05,601 ఎకరాలకు పట్టాల పంపిణీ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 4,14,353 మంది రైతులు తాము సాగు చేసుకుంటున్న 13.18లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 56.6శాతం మంది గిరిజనులు 8.15లక్షల ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించి అటవీ హక్కుల చట్టం, మంత్రివర్గ ఉపసంఘం సూచనలతో అర్హులైన గిరిజన రైతుల జాబితాను రూపొందించారు. మొత్తంగా 26 జిల్లాల్లోని 1,50,012 మంది రైతులకు 4,05,601 ఎకరాలకు గానూ పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595మంది రైతులకు 1,51,195ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 24,972 మంది రైతులకు 70,434 ఎకరాలు కాగా.. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు రైతులకు ఎకరం భూమికి పట్టాలు అందించారు. అయితే పట్టాలు పొందిన గిరిజన కుటుంబాలన్నీ తమకే ఓటు వేస్తాయని, ఆ ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ హయాంలోనే 3,31,070 ఎకరాలను ఇచ్చామంటున్న కాంగ్రెస్ ఇక కాంగెస్ పార్టీ గతంలో తాము కూడా పట్టాలు పంపిణీ చేశామని, ముందుగా తమకే ఆ ఆలోచన వచ్చిందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణలోని హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన 99,486 మంది రైతులు సాగుచేసుకునే 3,31,070 ఎకరాలకు అటవీహక్కుల చట్టం ద్వారా భూ హక్కు పత్రాలు అందజేశారని గుర్తు చేస్తున్నారు. మిగిలిన రైతులకు కూడా పట్టాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని, ఈలోపు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కావడం, బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో జాప్యం జరిగిందని అంటున్నారు. పోడు పట్టాల పంపిణీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టిందని, కాంగ్రెస్ హయాంలో మాత్రం నిజమైన రైతులకు పట్టాలు ఇచ్చిందని, ఎవరు ఎన్ని చెప్పినా.. గిరిజనుల మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని, మా పార్టీ అభ్యర్థులే గెలుస్తారని నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. గిరిజనేతరులు ఎటువైపో.. ఇక ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనేది ప్రధాన చర్చగా మారింది. ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో సమానంగా గిరిజనేతరులు పోడు భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే దశాబ్దాల తరబడి వారు సాగుచేసుకుంటున్నా.. నేటి వరకు హక్కు పత్రాలు అందలేదు. గిరిజన చట్టాలను సవరించి పట్టాలు ఇస్తారని వారు భావించగా.. అది సాధ్యపడలేదు. పట్టాలు ఏమో కానీ కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు, రైతుబంధు, రైతుబీమా వచ్చి, తమ పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తే చాలని గిరిజనేతర రైతులు కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు దీనిపై ఏ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గిరిజనేతరుల మద్దతు ఎటువైవో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -ఈరగాని భిక్షం -
34 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై పేదలకు సర్వ హక్కులు కల్పింస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలు, రైతుల గుండె చప్పుడు విన్నది కాబట్టే మనందరి ప్రభుత్వం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వారికి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ మనస్ఫూర్తిగా మంచి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,44,866 ఎకరాలకు సంబంధించి 20,24,709 మంది పేదలకు హక్కులు కల్పించి ఆ భూములను మీ బిడ్డ ప్రభుత్వం వారి చేతుల్లో పెడుతోందన్నారు. మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయమన్నది ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పేద వర్గాలను అక్కున చేర్చుకుని సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలిగామన్నారు. ప్రతి పేదవాడు కాలర్ ఎగరవేసి అదిగో మా అన్న ప్రభుత్వం.. మా ప్రభుత్వం.. మా కోసం ఆలోచన చేసేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పుకునే విధంగా పాలన సాగిందని చెప్పేందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాల భూమిని 42,307 మందికి కొత్తగా డీకేటీ పట్టాలు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దశాబ్దాలుగా అనుభవదారులుగా ఉన్న పేద రైతులకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడంతోపాటు చుక్కల భూముల సమస్యకు సైతం పరిష్కారాన్ని చూపామన్నారు. దళితుల శ్మశాన వాటికల కోసం 1,563 గ్రామాల్లో 951 ఎకరాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2003 నాటి అసైన్డ్ భూములపై హక్కులు, కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తూ పేదలకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే పెత్తందారులకు నచ్చడం లేదని మండిపడ్డారు. పేద వర్గాల పట్ల బాధ్యతగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే ప్రతిపక్షం కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ, అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు, లంక భూములకు పట్టాలు, చుక్కల భూములు, షరతు గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములు 22 (ఏ) నుంచి తొలగింపు, భూమి కొనుగోలు పథకం ద్వారా అందించిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. భూములకు సంబంధించి కేవలం 53 నెలల వ్యవధిలో తీసుకున్న తొమ్మిది రకాల విప్లవాత్మక నిర్ణయాలతో పేదలు, రైతన్నలకు చేకూర్చిన మేలును వివరిస్తూ ఆయా అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. నిర్ణయం1 దేశంలో వందేళ్ల తరువాత మన ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రెండు దశల్లో నాలుగు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే విజయవంతంగా పూర్తి చేశాం. మొత్తంగా 42.60 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తై యజమానులకు భూ హక్కు పత్రాలను కూడా అందజేశాం. దాదాపు 45 వేల సరిహద్దు వివాదాలను పరిష్కరించి రికార్డులను అప్డేట్ చేశాం. 15 వేల మంది సర్వేయర్లు రైతులకు మంచి చేసే విషయంలో నిమగ్నమయ్యారు. రీసర్వే పూర్తి అయిన చోటగ్రామ సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లు జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే. మూడో విడత కూడా మొదలు పెడుతున్నాం. నిర్ణయం2 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు గడిచిన భూములపై లబ్ధిదారులకు సర్వహక్కులు కలి్పంచే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. దీనివల్ల 27.42 లక్షల ఎకరాలపై సంపూర్ణ హక్కులను కల్పించగా 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి జరుగుతోంది. పేద సామాజిక వర్గాలకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం ఇది. పెత్తందారీ పోకడలపై పేదల ప్రభుత్వం, మీ బిడ్డ సాధించిన గొప్ప విజయంగా ఇది చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. భూములను గుంజుకునే పరిస్థితుల నుంచి అసైన్డ్ భూములపై పూర్తి హక్కులను ఆ పేదవాడికి కలి్పంచే గొప్ప మార్పులకు ముందడుగు పడింది. చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములను తన అత్తగారి సొత్తు అన్నట్లుగా ఆక్రమించుకున్నారు. నిర్ణయం3 అప్పుడెప్పుడో బ్రిటిష్ పాలనలో రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్ట్రార్ నమోదు చేసే సమయంలో వివరాలు అందుబాటులో లేని భూములను చుక్కల భూములుగా చూపించారని చంద్రబాబు ప్రభుత్వం 2016లో వీటిని నిషేధిత జాబితాలో 22 (ఏ)లో చేర్చడంతో రైతన్నలు అల్లాడిపోయారు. రైతులు, భూములున్నాయి కానీ హక్కు పత్రాలు మాత్రం లేవు. దీనికి కారణం చంద్రబాబు ఆ భూములను నిషేధిత భూముల్లో చేర్చడమే. దీన్ని సరిదిద్దుతూ 2.6 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి 1.2 లక్షల మంది రైతులకు మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది. నిర్ణయం4 పేదవాడికి భూ హక్కులు కల్పించేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ఎంత గొప్పగా అడుగులు వేసిందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. 1934లో రీసర్వే రిజిస్టర్ రిమార్క్స్ కాలంలో షరతులు గల పట్టాగా నమోదు చేయడంతో ఆ భూమిపై రైతులకు హక్కులు లేని పరిస్థితి నెలకొనగా ఇప్పుడు ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాం. 33,394 ఎకరాలు సాగు చేసుకుంటున్న 22,045 మంది రైతులకు మంచి చేస్తూ సర్వహక్కులు పేదవాడి చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమేనని చెప్పేందుకు గర్వపడుతున్నా. నిర్ణయం5 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములు రుణంలో ఉండటంతో హక్కులు కోల్పోయిన ఎస్సీ రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారికి సర్వహక్కులు కలి్పంచింది కూడా మన అందరి ప్రభుత్వమే. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలైన 22,346 మంది దళితులకు పంపిణీ చేసిన 22,387 ఎకరాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తాకట్టు పెట్టిన ఆ భూములన్నింటినీ 21( ఏ) జాబితా నుంచి తొలగించి రుణాలు మాఫీ చేసి రైతులకు పూర్తి హక్కులు కలి్పంచాం. నిర్ణయం6 ప్రతి పేదవాడికి సాధికారత కలి్పస్తూ చెయ్యి పట్టుకుని తోడుగా నిలిచి నా గిరిజన రైతులకు మంచి జరగాలని అడుగులు వేశాం. ఈ దిశగా పట్టాల పంపిణీ మరో ప్రధానమైన నిర్ణయం. తరతరాలుగా కొండల్లో, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మన గిరిజన సోదరులకు, గిరిజన అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని తపిస్తూ సాగు హక్కులు కలి్పంచాం. 1,56,655 గిరిజన కుటుంబాలకు మంచి చేస్తూ 3,26,982 ఎకరాలను పంపిణీ చేసింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. నిర్ణయం7 తరతరాలుగా లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు లేకపోవడం వల్ల లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. వారంతా ఏ సహాయం అందని దుస్థితిలో ఉన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న అలాంటి రైతన్నలను గుర్తించి వారికి డీకేటీ పట్టాలు, లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. లంక భూముల్లో సాగు చేసుకుంటున్న వారిని ఎంజాయిమెంట్ సర్వే ద్వారా నిర్ధారించి ఏ, బీ కేటగిరీలకు డీకేటీ పట్టాలు, సీ కేటగిరికి చెందిన వాటికి లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 17,768 మంది పేద రైతులకు మంచి జరిగేలా అడుగులు ముందుకు వేసే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టాం. నిర్ణయం8 గతంలో అన్ని గ్రామాల్లో సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా కింద 22 (ఏ) కింద చేర్చారు. ఒక్క దేవాలయాలు, ఇతర సంస్థలకు సంబంధించిన ఈనాం భూములు మినహా మిగిలిన అన్ని సరీ్వస్ ఈనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశాం. ఆ భూములకు సంబంధించి 1,61,584 మంది రైతులకు మరీ ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితర వృత్తుల వారికి మంచి జరిగేలా, వారి సమస్య పరిష్కారమయ్యేలా నిషేధిత జాబితా నుంచి తొలగించి పూర్తి హక్కులు కలి్పస్తున్నాం. నిర్ణయం9 రాష్ట్రవ్యాప్తంగా మరో 42,307 మంది నిరుపేదలకు 46,463 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుడుతున్నాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలకు మంచి జరిగేలా అడుగులు ఇక్కడ నుంచి పడుతున్నాయి. ఇవన్నీ కేవలం 53 నెలల్లోనే భూములకు సంబంధించి చేసిన మంచి పనులు. ప్రతి పేదవాడిని చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం ఎలా చేశామో చెప్పడానికే ఈ తొమ్మిది అంశాలను ప్రస్తావించా. అంతిమ సంస్కారాల్లోనూ అంటరానితనమా? ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేస్తూ ఇవాళ ఇంకో గొప్ప అడుగు పడింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో ఎస్సీ వర్గాల వారి అంతిమ సంస్కారాల కోసం అనువైన భూమి లేని పరిస్థితి. తరతరాలుగా అవమానాలు ఎదుర్కొన్న వీరికి చివరికి అంతిమ సంస్కారాల విషయంలోనూ అంటరానితనం పాటించే దుస్థితి ఉంటే మనుషులుగా మనం ఏం ఎదిగినట్లు? అనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలోనూ రావాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,854 గ్రామ సచివాలయాల పరిధిలో శ్మశాన వాటికల కోసం 1,250 ఎకరాలు అవసరమని నివేదికలిచ్చారు. వీటిలో 1,563 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 951 ఎకరాలను సేకరించి గ్రామ పంచాయతీలకు అప్పగించాం. ఇంత చిన్న విషయాన్ని కూడా నేను పరిశీలించి పర్యవేక్షిస్తున్నా. -
మావల కమాన్ వద్ద ఆందోళనకు దిగిన ఆదివాసీలు
-
ఆ రైత్వారీ పట్టాలు చెల్లుతాయి
సాక్షి, అమరావతి : గ్రామ సర్వీసు ఈనాం భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భూములపై ఉన్న ఆంక్షలను తొలగించేందుకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకనుగుణంగా గ్రామ సర్విసు ఈనాం భూములకు జారీ చేసిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటవుతాయని రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జీఓ నంబర్ 310 జారీ చేశారు. ఈ భూములకు గతంలో జారీ చేసిన రైత్వారీ పట్టాదారుల పేర్లను అన్ని రికార్డుల్లోకి ఎక్కించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. పట్టాదారులు లేని పక్షంలో వారి వారసులు (లీగల్ హైర్స్), లేకపోతే వారి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రీ సర్వే రికార్డుల్లోనూ వారి పేర్లను చేర్చాలని స్పష్టం చేశారు. దీంతో 1.13 లక్షల మందికి చెందిన 1.68 లక్షల ఎకరాలు గ్రామ సర్విసు ఈనాం భూములు 22 (ఎ) జాబితా నుంచి తొలగి, ఆ కుటుంబాలకు మేలు కలుగుతుంది. ఈనాం భూముల చట్ట సవరణతో 22 (ఎ)లోకి సర్విసు ఈనాం భూములు దశాబ్దాల క్రితం గ్రామానికి సేవ చేసే కుల వృత్తుల వారి జీవన భృతి కోసం ఈనాంగా భూములిచ్చారు. 1956 ఈనాం (రద్దు, రైత్వారీ పట్టాలుగా మార్పు) చట్టం ప్రకారం కొన్ని ఈనాం భూములు రద్దవగా, కొన్ని రైత్వారీ భూములుగా మారాయి. రైత్వారీ భూములకు అప్పట్లోనే రైత్వారీ పట్టాలు జారీ చేశారు. ఈనాందారులు తమ భూములను ఎవరికైనా అమ్ముకునే హక్కు కూడా ఈనాం చట్టం కల్పించింది. దీంతో ఆ భూములను కొన్న వారికి రక్షణ ఏర్పడింది. అయితే గ్రామ సర్వీసు చేసిన వారికే కాకుండా ధా ర్మిక సంస్థలు, దేవాలయాల మనుగడ కోసం వాటికి ఈనాంగా భూములిచ్చారు. ఆ దేవాలయాల భూములు చాలావరకు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆ దేవాలయాల్లో ఏ సేవల కోసం భూమి ఇచ్చారో ఆ సేవలు కూడా ప్రస్తుతం లేవు. దీంతో వాటి రక్షణ కోసం 2013లో ఈనాం చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం ఈనాం భూములన్నింటిపైనా ఆంక్షలు విధించి వాటిని నిషేధిత జాబితా 22 (ఎ)లో చేర్చారు. దీంతో దేవాలయాల ఈనాం భూములతోపాటు గ్రామ సర్విసు ఈనాం కింద పొందిన రైత్వారీ పట్టా భూములు కూడా 22 (ఎ) జాబితాలో చేరిపోయాయి. రాష్ట్రంలో భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో గ్రామ సర్విసు ఈనాం భూములపై రైతుల నుంచి పెద్దఎత్తున వినతులు వచ్చాయి. రైత్వారీ పట్టాలు పొందిన వారి నుంచి తాము కొన్నామని, తమ పేర్లను రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడంలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. ధార్మిక సంస్థల ఈనాం, సర్విసు ఈనాం భూముల మధ్య తేడా ఇదే ఈ వినతులను పరిశీలించిన ప్రభుత్వం దేవాలయ, ధార్మిక సంస్థల ఈనాం, గ్రామ సర్వీసు ఈనాం భూముల మధ్య ఉన్న తేడాపై స్పష్టత ఇచ్చింది. ధా ర్మిక సంస్థల ఈనాం భూములను కేవలం ఆ దేవాలయాలు, అందులోని దేవుడి సేవల కోసం మాత్రమే ఇచ్చారు. అవి ఎప్పటికీ దేవాలయాలవే తప్ప వేరే వ్యక్తులు పొందే అవకాశం ఉండదు. గ్రామ సర్విసు ఈనాం భూములను అందరి మేలు కోసం పనిచేసిన కుల వృత్తుల వారికి (క్షురకులు, చాకలి, మంగలి వంటి వృత్తులు) ఇచ్చారు. ఆ భూములు ఆ వ్యక్తులు, వారి వారసులకు వస్తాయి. ఇలా సర్వీసు చేసిన కుల వృత్తుల వారి సంఖ్య గ్రామాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్లే వారికి రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలు గ్రామ సర్వీసు ఈనాం భూములకు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ భూములన్నింటినీ 22(ఎ) నుంచి తొలగించాలని, వారి పేర్లను రికార్డుల్లోకి ఎక్కించాలని జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. -
లంక భూములకు పట్టాలు
-
పోడు భూముల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు
-
త్వరలోనే పోడు పట్టాల పంపిణీ
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో త్వరలోనే పోడు పట్టాలు పంపిణీ చేస్తామని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కేస్లాపూర్ నుంచే అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద ఎక్కువ మందికి న్యాయం చేసేలా చూస్తామని, రైతుబంధు వర్తింపజేస్తామన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆమె విచ్చేశారు. నాగోబాను దర్శించుకున్న అనంతరం గిరిజన దర్బార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 3.8 లక్షల ఎకరాల పోడు భూములకు రైతుబంధు ఇచ్చి గిరిజనుల కోసం అనేక గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అగ్రికల్చర్ బీఎస్సీ ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. కొందరు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని నాగోబా జాతరకు వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను ఆమోదించి పంపితే కేంద్రం పక్కనబెట్టిందంటూ దుయ్యబట్టారు. మెస్రం పెద్దలు సూచించినట్లుగా అభివృద్ధి పనులు: ఇంద్రకరణ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో 10 శాతం రిజర్వేషన్ల ప్రకారం 9 వేలకుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కుతాయన్నారు. నాగోబా సన్నిధిలో అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 12.5 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేశారని తెలిపారు. మెస్రం పెద్దలు సూచించిన ప్రతిపాదనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు ఏమైనా నిధులు ఇచ్చిందా? అంటూ విమర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా రాష్ట్రంలోని ఆలయాలకు మంజూరు చేశారా అంటూ ధ్వజమెత్తారు. గిరిజన దర్బార్‌లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖాశ్యామ్ నాయక్, రాథోడ్ బాపురావు తదితరులు పాల్గొన్నారు. -
భూపంపిణీ
-
దుమ్ములేపుతున్న ‘పటాస్’ సాంగ్స్
‘పటాస్’ పేరుతో ఇప్పడు ఒక భారీ చిత్రం రూపొందుతోంది. అయితే పేరుకు తగ్గట్టుగానే ప్రచారం మారుమోగుతోంది. ఎందుకంటే పటాస్‌లో హీరో ధనుష్ కావడం ఒక కారణం అయితే, ఇందులో ఆయన ద్విపాత్రాభియనం చేయడం మరో హైలైట్. నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ ఈ చిత్రానికి డబుల్ ప్లస్ కానుంది. దురైసెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెహ్రీన్, స్నేహ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెంథిల్ ఇంతకు ముందు ధనుష్ హీరోగా కొడి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చిత్ర షూటింగ్ చూర్తిచేసుకుని ప్రస్తుతం మ్యూజికల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి వివేక్–మెర్విన్ల ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్రంలోని జిల్ బ్రో సింగిల్ సాంగ్‌ను ఆ తరువాత మొరట్టు తమిళండా సాంగ్‌ను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు జికిడి కిల్లాడి అనే పల్లవితో సాగే మూడో పాటను కూడా విడుదల చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే యువ సంగీతదర్శకుడు అనిరుద్ పాడడం. ఈ పాట ఇప్పుడు మార్కెట్లో దుమ్మురేపుతోంది. దీంతో చిత్ర సంగీత దర్శకులు యమఖుషీలో ఉన్నారు. ఆ ఆనందాన్ని ఆ ద్వయంలో ఒకరైన వివేక్ వ్యక్తం చేస్తూ తమ సంగీతంలో అనిరుద్ పాడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన తమకు స్నేహితుడికంటే ఎక్కువ అని, సహోదరుడు మాదిరి అని పేర్కొన్నారు. అనిరుద్‌ను తమ సంగీతంలో పాడించాలన్న చిరకాల కోరిక ఈ చిత్రం ద్వారా తీరడం ఆనందంగా ఉందన్నారు. ఆయన పాడిన జకిడి కిల్లాడి పాట తమ మనసుకు చాలా దగ్గరైన పాట అని అన్నారు. ధనుష్, అనిరుద్‌ల కాంబినేషన్ ఎప్పుడూ హిట్టేనని అన్నారు. దాన్ని ఈ పాట సక్సెస్ మరోసారి నిరూపించిందని అన్నారు. పటాస్ చిత్రం కోసం తాము 8, 9 నెలలుగా పని చేస్తున్నామని, ప్రతి నిమిషం ఆ సంతోషాన్ని అనుభవిస్తూ పనిచేస్తున్నట్లు తెలిపారు. పటాస్ చిత్రం పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేయడం సినీ జీవితంలోనే తమకు పెద్ద అవకాశంగా పేర్కొన్నారు. కాగా ఇందులో నవీన్‌చంద్ర విలన్‌గా నటిస్తున్నారు. చిత్ర ట్రైలర్‌ను, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని 2020 జనవరి 16వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. -
పోడు భూములకు పట్టాలివ్వాలి
మంచిర్యాల సిటీ : జిల్లాలో గిరిజనులు, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి టీ. శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలివ్వకుండా, ఆక్రమించుకోవడం సరికాదన్నారు. సాగుచేసుకుంటున్న రైతులపై సంబంధిత శాఖ అధికారులు అక్రమ కేసులను పెట్టి వేధిస్తోందని ఆయన ఆరోపించారు. హరితహారం పేరిట సాగుభూముల్లో మొక్కలు నాటుతూ, వారి పంటలను ధ్వంసం చేస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లాల్‌కుమార్, చాంద్‌పాషా, బ్రహ్మానందం, దేవరాజు, ఎం జ్యోతి, శ్రీకాంత్ ఉన్నారు.