సిరిసిల్లతో అనుబంధం మధురానుభూతి
సిరిసిల్ల: సిరిసిల్లతో అనుబంధం మధురానుభూతిని కలిగించిందని పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ఎనిమిది రోజులుగా వంశీ విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో సినారె సాహితీ ప్రాభవం పేరుతో సినారె సాహిత్యపై ప్రసంగాలు జరిగాయి. గురువారం రాత్రి జరిగిన వేడుకల్లో నారాయణరెడ్డి మాట్లాడుతూ సిరిసిల్లలో సాహితీ మిత్రులు, చిన్ననాటి చదువుకున్న సంగతులను గుర్తుచేశారు. సిరిసిల్లకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగం సంపాదకులు పత్తిపాక మోహన్ మాట్లాడుతూ సినారె సాహిత్య సృజన కావ్యంగా సాగిందన్నారు. అనుసృజనను కూడా అంతే విలక్షణంగా చేశారని వివరించారు. ఈ సందర్భంగా సినారె మోహన్‌కు జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు కళా వెంకటదీక్షితులు, వంశీ రామరాజు, రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధాదేవి, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.