Pay Revision Committee
-
AP: పీఆర్సీ ఐదేళ్లకే.. జీవో జారీ..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని పదేళ్లకు బదులు ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా పీఆర్సీ అమలు ఉత్తర్వుల్లో పలు సవరణలకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐదేళ్లకోసారి పీఆర్సీ ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: సచివాలయ ఉద్యోగులకు జూన్‌కల్లా ప్రొబేషన్ డిక్లేర్ పీఆర్సీ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇచ్చేందుకు ఒక జీవో జారీ చేసింది. పెండింగ్‌లోని ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను ఇచ్చేలా జీవో ఇచ్చింది. ఐఆర్ రికవరీ చేయకుండా మరో ఉత్తర్వును జారీ చేసింది. ఉద్యోగుల ట్రావెలింగ్ అలవెన్స్ పెంపు, అంత్యక్రియలకు రూ. 25 వేలు ఇచ్చేలా వేర్వేరు జీవోలు జారీ చేసింది. ఇలా మొత్తం ఆరు అంశాలపై 8 జీవోలను ఇచ్చింది. ఉద్యోగుల ప్రతినిధులకు జీవో ప్రతులు బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో జీవోల ప్రతులను వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అధికారులు అందజేశారు. పీఆర్సీ అమలుకు సంబంధించిన ఈ సమావేశం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్) హెచ్.అరుణ్‌కుమార్‌ల సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ పీఆర్సీ పెండింగ్ అంశాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.పెండింగ్ బిల్లులను కూడా ప్రాధాన్యత క్రమంలో చెల్లించనున్నట్లు తెలిపారు. శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పీఆర్సీ అమలుకు సంబంధించి మరో రెండు జీవోలను కూడా బుధవారం రాత్రి లేదా గురువారం విడుదల చేయనున్నట్లు చెప్పారు. మరికొన్ని జీవోలు త్వరలో విడుదలవుతాయన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సకాలంలో పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమ్మె యోచన విరమణ!
ఉద్యోగుల డిమాండ్లకు ఇంధనశాఖ అంగీకారం ఒకే వేతన సవరణ కమిటీ.. మార్చి 31 నాటికి నివేదిక సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు సమ్మె యోచన విరమించుకున్నారు. తమ డిమాండ్లపై యాజమాన్యంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటుకు అంగీకరించడంతో పాటు మార్చి 31 నాటికి నివేదిక సమర్పించేందుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో చైర్మన్ మోహన్‌రెడ్డి, విద్యుత్ సౌధ జేఏసీ కన్వీనర్ కళ్లెం శ్రీనివాసరెడ్డి, వెంకన్నగౌడ్, గణే శ్‌రావు, భానుప్రకాశ్, వేదవ్యాసరావు ప్రకటించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలకు వేర్వేరుగా మూడు వేతన సవరణ కమిటీల ఏర్పాటు, కమిటీల్లో బయటి వ్యక్తుల నియామకం, ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ అంశాలపై ఇంధనశాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 నుంచి నిరవధిక సమ్మె చేయూలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణరుుంచుకున్నారు. అరుుతే గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీతో పాటు నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణకు అంగీకరిస్తూ ఇంధనశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. అంతేగాక కమిటీ విధివిధానాలపై ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్కో ఎండీ విజయానంద్ తదితరులు జేఏసీ నేతలతో విద్యుత్ సౌధలో గురువారం నాలుగు గంటలకుపైగా సమావేశమయ్యారు. మార్చి 31 నాటికి నివేదిక ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేసింది. అదేవిధంగా తమ వేతన సవరణను అవసరమైతే కొంత తగ్గించైనా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలను సవరించాలని జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు సమావేశంలో పట్టుబట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులకూ ప్రత్యేకంగా వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది. -
14 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఒకటే వేతన సవరణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ 14వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు. ఈ నెల 12, 13 తేదీల్లో వర్క్ టు రూల్ పాటించడంతో పాటు నిరాహార దీక్షలు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మంగళవారం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యదర్శి అజయ్ కల్లాంతో పాటు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్కో ఎండీ విజయానంద్‌లకు సమ్మె నోటీసును అందజేసినట్టు జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు చెప్పారు. ఇప్పటికే విద్యుత్ ప్లాంట్లల్లో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటం, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె యోచనపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల డిమాండ్లు.. ్హ జెన్కో, ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వేర్వేరుగా మూడు వేతన సవరణ కమిటీలు వేయాలన్న ఇంధనశాఖ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి. ్హ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) ను మూడు ముక్కలు చేసినప్పటి నుంచి ఒకే వేతన సవరణ కమిటీ ద్వారా సవరణ జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా చేయూలి. మూడు కమిటీలను అంగీకరించేది లేదు. ్హ వేతన సవరణ కమిటీలో బయటి వ్యక్తులు సభ్యులుగా ఉండకూడదు. ్హ ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల వేతనాలతో పోల్చిచూడాలన్న ఇంధనశాఖ ఆదేశాల్ని రద్దు చేయాలి. -
18 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె!
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయకపోతే వచ్చే నెల 18 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వర్తించాల్సిన వేతన సవరణ కోసం ఇప్పటికీ కమిటీ వేయకుండా ప్రభుత్వం, యాజమాన్యం జాప్యం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) మండిపడింది. వెంటనే వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో మంగళవారం వందలాదిమంది ఉద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. అనంతరం ఉన్నతాధికారులకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జె. సీతారామిరెడ్డి, కన్వీనర్ సుధాకర్‌రావు, కో చైర్మన్ జి.మోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ.. వాస్తవానికి విద్యుత్ సంస్థల్లో వేతన సవరణకు ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పారు. వేతన సవరణను ఆలస్యం చేసేందుకే అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని యాజమాన్యం అంటోందని ఆరోపించారు. వేతన సవరణకు గత నవంబర్లోనే కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.కిరణ్, సంయుక్త కార్యదర్శి ఎంఏ వజీర్, నేతలు చంద్రుడు, భానుప్రకాశ్ తదితరులు తెలిపారు. కాగా, ధర్నా సందర్భంగా తెలుగుతల్లి బొమ్మ ఉన్న సమైక్యాంధ్ర ఫ్లెక్సీని చించేశారని ఇది తెలుగు జాతిని అవమానించడమేనని, ఇందుకు జేఏసీ నాయకత్వం క్షమాపణలు చెప్పాలని జాక్ వైస్ చైర్మన్ గణేష్ డిమాండ్ చేశారు. జేఏసీలో తెలంగాణ ప్రాంతంవారు మాత్రమే ఉన్నారని ఆయన విమర్శించారు.