Payment of Fees
-
‘టౌన్’లో ప్రక్షాళన
సాక్షి, అమరావతి: మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని పత్రాలున్నా ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించక విసిగెత్తిపోయే పరిస్థితులకు తెరదించి దరఖాస్తు ఏ దశలో ఉందో కిందిస్థాయి సిబ్బంది నుంచి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఉన్నతస్థాయి అధికారుల వరకు తెలుసుకునేలా మార్పులు చేశారు. ఐదేళ్ల క్రితమే ఆన్లైన్ విధానం వచ్చినా సాఫ్ట్ వేర్ లోపాలతో కొందరు సిబ్బంది దరఖాస్తు దారు లకు చుక్కలు చూపిస్తున్నారు. మున్సిపల్ ఉన్నతా ధికారుల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ డెవలప్మెంట్ పర్మిషన్ మెనేజ్మెంట్ సిస్టం(డీపీఎంఎస్) లో సమూల మార్పులు చేశారు. మాన్యువల్ విధా నానికి స్వస్తి పలికారు. ఆన్లైన్ వల్ల దరఖాస్తు ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఏ విభాగం అధికారి వద్ద ఎన్నిరోజులు ఉందో కూడా వెల్లడి కానుంది. ఒకవేళ ఏదైనా ఫైల్‌ను నిలిపివేస్తే దరఖాస్తుదారుడికి నిర్ణీత గడువులోగా కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పరిశీలన.. ఫీజుల చెల్లింపు సాధారణంగా ఇంటి నిర్మాణం లేదా లే అవుట్ పనులకు టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతి పొందిన తర్వాత స్థానిక అధికారులు సదరు ప్రాంతాన్ని పరిశీలించాలి. ఈ దశలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ‘పోస్ట్ వెరిఫికేషన్’ విధానాన్ని రద్దు చేశారు. ఆన్లైన్లోనే దరఖాస్తు పత్రాల పరిశీలన అనంతరం మాస్టర్ ప్లాన్ నిబంధనలకు లోబడి ఉంటే వెంటనే నిర్దేశించిన ఫీజు చెల్లించేందుకు అనుమతి లభిస్తుంది. ఆన్లైన్లో ఫీజు చెల్లించగానే ఆటోమెటిక్‌గా సంబంధిత ప్లాన్‌తోపాటు నిర్మాణ ఉత్తర్వులను సైతం దరఖా స్తుదారులు డౌన్లోడ్ చేసుకునేలా మార్పులు చేశా రు. ఈ విధానం రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సం స్థలు, 18 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అమ ల్లోకి వచ్చింది. నిర్మాణ ప్లాన్‌ను సైతం ఆటోక్యాడ్ సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ మార్పులతో అనవసర జోక్యానికి, ఆలస్యానికి తావులేకుండా చేశారు. ఇప్పటివరకు ఉన్న పోస్ట్ వె రిఫికేషన్ విధానం, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కమిటీలను రద్దుచేసి క్షేత్రస్థాయిలో అక్రమాలు జరగకుండా వా ర్డు ప్లానింగ్ సెక్రటరీల సేవలను వినియోగిం చుకుంటున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే ఆన్లైన్ విధానంలోనే నోటీసులు జారీ చేస్తున్నారు. 15 రోజుల్లోనే అనుమతులు టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పులు తెచ్చి అనుమతులు వేగంగా ఇస్తుండడంతో నిర్మాణ రంగానికి మేలు జరుగుతోంది,. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పత్రాలు సరిగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయి. అక్రమ నిర్మాణాలతో సమస్యలను కొని తెచ్చుకోవద్దు. అవసరమైతే అధికారులను సంప్రదించవచ్చు. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా, అనుమతులు తీసుకున్నవారు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా వార్డు ప్లానింగ్ సెక్రటరీలు పర్యవేక్షిస్తున్నారు. – వీపనగండ్ల రాముడు, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ -
దేశంలోనే తొలిసారి ఆన్లైన్లో కోర్టు ఫీజు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా కోర్టు ఫీజులు చెల్లింపునకు వీలుగా తెలంగాణ హైకోర్టు–స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ల మధ్య ఒప్పందం కుదిరింది. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని తెలంగాణ హైకోర్టులో అమలు చేయనున్నారు. డిజిటల్ సేవల్ని వినియోగంలోకి తెచ్చే క్రమంలో ఎస్బీఐతో కుదిరిన ఒప్పందం మేరకు బుధవారం సాయంత్రం హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూ కుదిరింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రాల సమక్షంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ గీతా ఎస్.పిళ్లైలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ షమీమ్‌అక్తర్ పాల్గొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ) డి.హేమంత్‌కుమార్, ఎస్బీఐ జీఎం వి. రమేశ్‌లు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. -
చదువులు సాగేనా?
►ఫలితాలు వెలువడి నెలలు గడుస్తున్నా.. ►ఊసేలేని వృత్తివిద్యా కోర్సుల కౌన్సెలింగ్ ►కోర్టుకు చేరిన ‘స్థానిక’ వివాదం ► ఫీజుల చెల్లింపుపై వీడని అయోమయం ►విద్యాసంవత్సరం నష్టపోయే ప్రమాదం ►విద్యార్థుల భవిత అగమ్యగోచరం కరీంనగర్ ఎడ్యుకేషన్: ఫీజులు, స్థానికత అంశాలపై నేటికీ స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు విద్యా సంస్థల నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందా, కాలేజీలో ఎప్పుడు చేరుతామా.. అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఈసెట్, ఎల్ఎల్బీ, డీఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు జరిగి, ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నాయి. కానీ.. ఇంతవరకు కౌన్సెలింగ్ తేదీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశాలు కొంత ఆలస్యమవుతాయనుకున్నా ఇప్పటికీ ఎటూ తేలకపోవడంతో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. కౌన్సెలింగ్‌లు పూర్తయి ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. అసలు ఆ ఊసే కనిపించడం లేదు. ఎప్పుడు నిర్వహిస్తారనే విషయమై కనీసం ప్రభుత్వానికి కూడా స్పష్టత రావడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో కొత్తగా ‘ఫాస్ట్’ పథకానికి రూపకల్పన చేసింది. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడినవారి పిల్లలకు మాత్రమే ఫీజు చెల్లిస్తామని ప్రకటించింది. ఇంతకుమించి పథకంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మార్గదర్శకాలు రాకపోవడంతో అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో చాలాచోట్ల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద చాలామేర పాతబకాయిలున్నాయి. వాటిని మంజూరు చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రకియ కోసం అక్టోబర్ వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును కోరడంతో ప్రవేశాలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇవన్నీ పరిష్కారమయ్యేదెన్నడో? కౌన్సెలింగ్ జరిగి తాము కళాశాలలకు వెళ్లి చదువుకునేదెప్పుడో? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గందరగోళం విద్యాసంవత్సరం వెనకబడుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ కోర్సు ఆలస్యమైతే తరువాత ఉన్నత విద్యకోసం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. తరగతులు ఆలస్యమై విద్యాసంవత్సరం పొడిగిస్తే ఓ విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదముంది. పాలిటెక్నిక్‌లో సీటు రాకపోతే ఇంటర్మీడియెట్‌లో చేరుదామని పదో తరగతి పూర్తయిన విద్యార్థులు, మెడిసిన్, ఇంజినీరింగ్‌లో సీటు రాకపోతే డిగ్రీలో చేరదామని అనుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది. పాలిసెట్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల తనిఖీ పూర్తయింది. సీట్ల కేటాయింపు చేయాల్సి ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసుకుని నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈసెట్ పరీక్ష రాసిన వారి పరిస్థితి వింతగా తయారైంది. వీరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాగా సీట్ల కేటాయింపు నిలిచిపోయింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ రెండో తరగతి పాఠ్యాంశాలు జూలై 1నే ప్రారంభం కాగా, ఈసెట్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల విషయంలో స్పష్టతనిచ్చి, త్వరగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి, విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. భయంగా ఉంది పాలిటెక్నిక్ పూర్తయి ఈసెట్ ఎంట్రెన్స్ రాసిన. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సీటు కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నా. ఇంజినీరింగ్ కాలేజీల్లో సెకండియర్ తరగతులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రభుత్వం త్వరగా సీట్లు కేటాయిస్తే మేం తరగతులు నష్టపోకుండా ఉంటాం. మాకు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలి. - సాయిశ్రీ, పాల్టెక్నిక్ విద్యార్థి కౌన్సెలింగ్ నిర్వహించాలి ప్రభుత్వం లేట్ చేయకుండా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఎంసెట్ ఫలితాలు వెలువడి చాలా రోజులైంది. ఏటా ఆగస్టులో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయి తరగతులు మొదలయ్యేవి. ఈ సారి కౌన్సెలింగ్ ప్రస్తావనే రావడం లేదు. ఇక తరగతులు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలవడం లేదు. ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలి. - కాల్వ సుష్మితారెడ్డి, ఇంటర్ విద్యార్థిని -
‘స్థానికత’ నిబంధనలు మార్చలేరు
తెలంగాణ సర్కారుపై ఏపీ విద్యా మంత్రి గంటా ఆగ్రహం దీనిపై అవసరమైతే కోర్టుకు వెళతాం మా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వారిష్టం ఒకవేళ ఇవ్వకుంటే ఆ బాధ్యత మాదే హైదరాబాద్: ఫీజుల చెల్లింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పలు రకాల ఆలోచనలు చేస్తున్నట్లు వస్తున్న కథనాలపై ఏపీ సర్కారు తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని, భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలోనూ ఇదే వాదన చేసే ప్రమాదముందని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇంతవరకు దీనిపై తమకు అధికారికంగా సమాచారం రాలేదని, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మంత్రి చెప్పారు. శుక్రవారం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. త ండ్రి స్థానికత అంటూ, 1956కు ముందు స్థిరపడిన వారికేనంటూ కథనాలు వస్తున్నాయని... అయితే స్థానికత నిర్ధారణ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు, ముల్కీ నిబంధనలు, ప్రత్యేక విధానాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. వాటిని మార్చే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. ఇలాంటి నిబంధనల వల్ల రెండు, మూడు దశాబ్దాలుగా తెలంగాణలో స్థిరపడిన వారు అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులు కాకుండా పోతారన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు చెల్లింపు విషయం తెలంగాణ సర్కారు ఇష్టమని చెబుతూనే... వారు ఇవ్వడమే సరైందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోతే తమ విద్యార్థుల బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. ఈ ఏడాదే ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం 11 జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాదే ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు చేపడతామన్నారు. ఏయూలో వీటి తరగతులు నిర్వహిస్తామని, వచ్చే ఏడాదికి భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా అంగీకారం తెలిపారని వెల్లడించారు. రెండేళ్ల మార్కులతోనే జేఈఈ ర్యాంకులు! ఇంటర్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల మార్కులను పరిగణనలోకి తీసుకుని జేఈఈ మెయిన్ ర్యాంకులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు రెండేళ్ల మార్కులను పంపించాలంటూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి లేఖ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో పలువురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించగా.. కేంద్రం తన వైఖరి చెప్పాలంటూ హైకోర్టు గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ ర్యాంకుల నిర్ధారణలో 12వ తరగతి/తత్సమాన కోర్సుల మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని గత డిసెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్లో సీబీఎస్ఈ స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం రెండూ బోర్డు పరీక్షలే అయినందున రెండేళ్ల మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఫస్టియర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సెకండియర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు అంగీకరించడంలేదు. పైగా ఇందులో రాష్ట్రం నుంచి పరీక్షకు హాజరైన వారి మధ్య పోటీ ఉండనుంది. రాష్ట్రం నుంచి పరీక్ష రాసిన వారి 12వ తరగతిలోని మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తూ నార్మలైజేషన్ చేసి తుది ర్యాంకులను సీబీఎస్ఈ ఖరారు చేస్తుంది. ఫలితంగా ఇంటర్ ఫస్టియర్‌లో ఎక్కువ మార్కులు పొంది, జేఈఈపైనే దృష్టిపెట్టి సెకండియర్‌లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు వెనకబడిపోయే పరిస్థితి ఉంది.