'టికెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్కు రాజీనామా'
హైదరాబాద్: త్వరలో జరగనున్న ఎన్నికల్లో మైనార్టీ సెల్ నేతలకు ఒక లోక్సభ, 12 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ మైనార్టీ సెల్ ఛైర్మన్ సిరాజుద్దీన్ విజ్ఞప్తి చేశారు. తమకు ఎన్నిసీట్లు ఇస్తున్నారో ఈ నెల 5వ తేదీలోగా చెప్పాలంటూ అల్టిమేటం జారీచేశారు.
తామిచ్చిన గడువులోగా స్పందించకుంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు దూరంగా ఉంటామన్నారు. టికెట్లు ఇవ్వకుంటే మైనార్టీ నేతలమంతా కాంగ్రెస్కు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. గెలుపు, సామాజిక కోణంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.