
'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది'
హైదరాబాద్: ముస్లింలను ఓటుబ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు చూడలేదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ వ్యవహరించిందని చెప్పారు. పీసీసీ మైనార్టీ సమ్మేళంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ముస్లింలకు రిజర్వేషన్ల అంశంలో దేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.