pcc presidents
-
కాంగ్రెస్‌లో రాజీనామాలు.. ఇంకా ఎందరు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలలు పక్కకు తప్పుకునే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ముఖ్యనాయకులకు-కార్యకర్తలకు మధ్యనున్న గోడలు కూల్చేయడంతోపాటు యువతకు పెద్దపీట దక్కాలన్న రాహుల్ గాంధీ సూచన మేరకు సీనియర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. నిన్న గోవా, గుజరాత్ పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. నేడు ఉత్తరప్రదేశ్ పార్టీ చీఫ్ రాజ్‌బబ్బర్ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడంలో భాగంగా మరిన్ని సంస్థాగత మార్పులు తప్పవని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికి రాజీనామాలు చేసిన ముగ్గురే కాకుండా ఇంకొందరు పీసీసీ చీఫ్‌లు కూడా స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని తెలిపాయి. ఏపీ, తెలంగాణలోనూ మార్పులు? : సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను మారుస్తారా, లేదా అనేది చర్చనీయాంశమైంది. రాజీనామాల విషయంలో ‘వయసు’ ప్రధానాంశం కాబట్టి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలకు ఎలాంటి ఢోకా ఉండబోదని సమాచారం. -
నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి భయం
పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి విమర్శ అనంతపురం సెంట్రల్: నంద్యాల ఉప ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఏనాడు నంద్యాలను పట్టించుకోని ఆయన ఉప ఎన్నికలు సమీపిస్తుండడంతో హామీల వర్షం కురిపిస్తున్నారన్నారు. జాషువ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం అనంతపురంలోని టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత గుర్రం జాషువాకే దక్కుతుందన్నారు. అయితే నేడు కేంద్ర, రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతుండడం బాధాకరమన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయని చంద్రబాబు నంద్యాలకు 13వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారన్నారు. 10వేల పింఛన్లు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. అంతేకాకుండా మంత్రులు, ఎంపీలు, ఇతర పారిశ్రామికవేత్తలను నంద్యాలలో మకాం వేయిస్తుండటం చూస్తే ఓటమి భయంతోనే అనే విషయం స్పష్టమవుతోందన్నారు. సీఎం స్థాయిలోని వ్యక్తి తాను వేయించిన రోడ్లపై నడుస్తున్నారు.. తానిచ్చిన పింఛన్లు తింటున్నారని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా çసత్యనారాయణ, పీసీసీ అధికారప్రతినిధి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీపై పోరుకు సిద్ధమౌతున్న కాంగ్రెస్
ఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దీనిపై దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించడానికి ఈ సమావేశంలో వ్యూహరచన చేస్తున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హాజరయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కీలకం ఉన్న ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు భరోసా సభ నిర్వహించిన విషయం తెలిసిందే. -
సీమాంద్రకు రఘువీరా,తెలంగాణకు పొన్నాల