Pebble
-
రూ. 2999కే కొత్త స్మార్ట్‌వాచ్ - మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్..
Pebble Cosmos Vault Smartwatch: దేశీయ మార్కెట్లో మెటాలిక్ స్ట్రాప్‌ను ఇష్టపడే వారి కోసం 'పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్' విడుదలైంది. క్లాసిక్ సిల్వర్, రోజ్ గోల్డ్, క్లాసిస్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,999గా ఉంది. ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి వెబ్సైట్లతో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో కూడా అమ్మకానికి ఉంది. దేశీయ మార్కెట్లో విడుదలైన పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్ 1.43 ఇంచెస్ అమోలెడ్ రౌండ్ డిస్ప్లే పొందుతుంది. ఇది ఇందులో చెప్పుకోదగ్గ హైలెట్. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన హెల్త్ ఫీచర్స్, విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్లు ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) కొత్త పెబల్ కాస్మోస్ వాల్ట్ వాచ్‌లో 240 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా ఏడు రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ వాచ్ మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్న సమయంలో నోటిఫికేషన్స్ కూడా వాచ్లోనే పొందవచ్చు. మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను కంట్రోల్ చేయవచ్చు. వాయిస్ అసిస్టెంట్లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ వాచ్ ఆధునిక కాలంలో వినియోగదారులకు తప్పకుండా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. -
మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ - ధర చాలా తక్కువ!
దేశీయ మార్కెట్లో పెబల్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ విడుదలైంది. పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో (Pebble Cosmos Bold Pro) పేరుతో విడుదలైన ఈ వాచ్ ధర రూ. 2,799. ఇది ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, పెబల్ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి ఉంది. ఈ లేటెస్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో విడుదలైన కొత్త 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' వాచ్ నాలుగు కలర్ ఆప్షన్లలో ఉంటుంది. అవి బ్లాక్, గోల్డ్, మెటల్ బ్లాక్, సిల్వర్ కలర్స్. మెటల్ బాడీ కలిగిన ఈ వాచ్ 1.39 ఇంచెస్ TFT డిస్ప్లేతో లభిస్తుంది. ఇందులో హార్ట్ మానిటర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కొలిచే ఎస్పీఓ2 సెన్సార్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ.. లాంచ్ ఎప్పుడంటే?) బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల ఇది కాలింగ్ ఫీచర్ కూడా పొందుతుంది. బ్లూటూత్ ద్వారా మొబైల్ కి కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ స్వీకరించవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్ ద్వారానే తీసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా వంటి వాటిని కూడా వాచ్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్ ద్వారా సాధారణంగా వారం (7 రోజులు) రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఎక్కువ ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ స్మార్ట్ వాచ్ ఆధునిక కాలంలో వినియోగించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. -
పెబల్ కంపెనీ నాలుగు కొత్త స్మార్ట్ వాచీలు
-
స్మార్ట్ ..స్మార్ట్‌గా స్మార్ట్ వాచ్ లు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ పెబెల్ టెక్నాలజీస్ గురువారం నాలుగుస్మార్ట్వాచ్ లను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పటికే ఇలాంటి పలు ఉత్పత్తులతో యువతరాన్ని స్మార్ట్ గా ఆకట్టుకుంటున్న సంస్థ మరోసారి తన హవాను చాటుకుంది. పెబెల్, క్లాసిక్, టైమ్, టైమ్ రౌండ్, టైమ్ స్టీల్ అంటూ నాలుగు స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లతో పాటు తాజాగా స్మార్ట్‌వాచ్‌లకు భారీగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో యాపిల్, సామ్సంగ్ లకు దీటుగా ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్‌లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది పెబెల్. అయితే పెబెల్ టెక్నాలజీ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి ఇప్పటికే పలు స్మార్ట్‌వాచ్‌లు విడుదలయ్యాయి. భారతదేశంలో సరసమై న ధరలతో వినియోగదారులకు ఆకట్టుకోవడమే తమ లక్ష్యమని పెబుల్ స్థాపకుడు, సీఈవో ఎరిక్ మిజికోవస్కీ చెప్పారు. ఎఫర్డబుల్ ధరలలో వినియోగారులకు తమ ఉత్పత్తులు అద్భుతమైన అనుభవాన్ని మిగులుస్తాయని పేర్కొన్నారు. వాటర్ ప్రూఫ్ గా మొత్తం నాలుగు మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది . ఈ స్మార్ట్ వాచ్ లు, గులాబీ, చెర్రీ ఎరుపు, జెట్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్ వేరియంట్లలో అమెజాన్ లో అందుబాటులో ఉంచింది. వీటి ధర రూ.5,999 నుంచి మొదలుకుని రూ. 15,999 వరకు ఉంది. ఈ-ఇంక్ డిస్ప్లే కలిగిన ఈ వాచ్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌పోన్, ఐఫోన్ కంపాటబిలిటీ కూడా ఉంది. క్లాసిక్ వాచ్‌లో నలుపు, తెలుపు డిస్ప్లే ఉండగా.. మిగతా మూడు కలర్ డిస్ప్లే, ఎల్ఈడీ బ్యాక్‌లైట్ సదుపాయం ఉంది. వాచ్ మోడల్స్, వాటి ధరలు ఇలా ఉన్నాయి. పెబెల్ క్లాసిక్ - రూ. 5,999 ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే ఏడు రోజులు నిర్విరామంగా నడుస్తుంది. పెబెల్ టైమ్ - రూ. 9,999, డే లైట్ రీడబులిటీ, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ పెబెల్ టైమ్ రౌండ్ - రూ. 13,599 28 గ్రాముల బరువుతో, 7.5ఎంఎ తో ప్రపంచంలో అతి సన్నని తేలికైన స్మార్ట్ వాచ్. పెబెల్ టైమ్ స్టీల్ - రూ. 15,999 ఒకసారి దీని బ్యాటరీని చార్జ్ చేస్తే పదిరోజులు నిర్విరామంగా నడుస్తుంది.