స్మార్ట్ ..స్మార్ట్గా స్మార్ట్ వాచ్ లు | Pebble launches smartwatches in India starting at Rs.5,999 | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ..స్మార్ట్గా స్మార్ట్ వాచ్ లు

Published Thu, May 12 2016 2:04 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

స్మార్ట్ ..స్మార్ట్గా  స్మార్ట్ వాచ్ లు

స్మార్ట్ ..స్మార్ట్గా స్మార్ట్ వాచ్ లు

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన  ప్రముఖ స్మార్ట్‌వాచ్‌  తయారీ సంస్థ పెబెల్  టెక్నాలజీస్   గురువారం  నాలుగుస్మార్ట్‌వాచ్‌  లను మార్కెట్ లో లాంచ్ చేసింది.   ఇప్పటికే  ఇలాంటి పలు ఉత్పత్తులతో యువతరాన్ని స్మార్ట్‌ గా  ఆకట్టుకుంటున్న సంస్థ మరోసారి తన  హవాను  చాటుకుంది.   పెబెల్, క్లాసిక్, టైమ్,  టైమ్ రౌండ్, టైమ్ స్టీల్ అంటూ నాలుగు  స్మార్ట్‌ వాచ్  లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లతో పాటు తాజాగా స్మార్ట్‌వాచ్‌లకు భారీగా ఆదరణ పెరుగుతున్న  నేపథ్యంలో  యాపిల్‌, సామ్‌సంగ్‌ లకు   దీటుగా ఈ  సరికొత్త స్మార్ట్‌వాచ్‌లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది పెబెల్.

అయితే పెబెల్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ అనే సంస్థ నుంచి ఇప్పటికే పలు స్మార్ట్‌వాచ్‌లు విడుదలయ్యాయి.  భారతదేశంలో సరసమై న ధరలతో వినియోగదారులకు ఆకట్టుకోవడమే తమ లక్ష్యమని  పెబుల్ స్థాపకుడు, సీఈవో ఎరిక్ మిజికోవస్కీ చెప్పారు.  ఎఫర్డబుల్ ధరలలో వినియోగారులకు తమ ఉత్పత్తులు అద్భుతమైన అనుభవాన్ని మిగులుస్తాయని పేర్కొన్నారు.
వాటర్ ప్రూఫ్  గా మొత్తం నాలుగు మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది . ఈ స్మార్ట్ వాచ్ లు, గులాబీ,  చెర్రీ ఎరుపు, జెట్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్  వేరియంట్లలో  అమెజాన్ లో  అందుబాటులో  ఉంచింది.  వీటి ధర రూ.5,999 నుంచి మొదలుకుని రూ. 15,999 వరకు ఉంది.  ఈ-ఇంక్‌ డిస్‌ప్లే కలిగిన ఈ వాచ్‌లో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌పోన్‌, ఐఫోన్‌ కంపాటబిలిటీ కూడా ఉంది. క్లాసిక్‌ వాచ్‌లో నలుపు, తెలుపు డిస్‌ప్లే ఉండగా.. మిగతా మూడు కలర్‌ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ బ్యాక్‌లైట్‌ సదుపాయం ఉంది. వాచ్‌ మోడల్స్‌, వాటి ధరలు ఇలా ఉన్నాయి.

పెబెల్‌ క్లాసిక్‌ - రూ. 5,999 ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే ఏడు రోజులు నిర్విరామంగా నడుస్తుంది.
పెబెల్‌ టైమ్‌ - రూ. 9,999, డే లైట్ రీడబులిటీ,  ఏడు రోజుల బ్యాటరీ లైఫ్
పెబెల్‌ టైమ్‌ రౌండ్‌ - రూ. 13,599  28 గ్రాముల బరువుతో, 7.5ఎంఎ తో  ప్రపంచంలో అతి సన్నని  తేలికైన స్మార్ట్ వాచ్.
పెబెల్‌ టైమ్‌ స్టీల్‌ - రూ. 15,999  ఒకసారి దీని బ్యాటరీని చార్జ్ చేస్తే  పదిరోజులు నిర్విరామంగా నడుస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement