Pebble Cosmos Vault Smartwatch: దేశీయ మార్కెట్లో మెటాలిక్ స్ట్రాప్‍ను ఇష్టపడే వారి కోసం 'పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్' విడుదలైంది. క్లాసిక్ సిల్వర్, రోజ్ గోల్డ్, క్లాసిస్ సిల్వర్ కలర్ ఆప్షన్‍లలో లభించే ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,999గా ఉంది. ఈ వాచ్ ఫ్లిప్‍కార్ట్, మింత్రా వంటి వెబ్‍సైట్‍లతో పాటు కంపెనీ అధికారిక వెబ్‍సైట్‍లో కూడా అమ్మకానికి ఉంది.
దేశీయ మార్కెట్లో విడుదలైన పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్ 1.43 ఇంచెస్ అమోలెడ్ రౌండ్ డిస్‍ప్లే పొందుతుంది. ఇది ఇందులో చెప్పుకోదగ్గ హైలెట్. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన హెల్త్ ఫీచర్స్, విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్‍లు ఇందులో లభిస్తాయి.
(ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ)
కొత్త పెబల్ కాస్మోస్ వాల్ట్ వాచ్‍లో 240 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా ఏడు రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ వాచ్ మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్న సమయంలో నోటిఫికేషన్స్ కూడా వాచ్‍లోనే పొందవచ్చు. మ్యూజిక్ ప్లే బ్యాక్‍ను కంట్రోల్ చేయవచ్చు. వాయిస్ అసిస్టెంట్లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ వాచ్ ఆధునిక కాలంలో వినియోగదారులకు తప్పకుండా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment