డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ
పెదపాడు: పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో కె.కోటేశ్వరి బుధవారం ఆకస్మికంగా తనికీ చేశారు. జ్వరాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో లార్వా ఎక్కడ ఉందో సర్వే చేయాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. పీహెచ్సీలో మరో వైద్యుడిని నియమిస్తామని చెప్పారు.
అనంతరం ఆమె వార్డులను పరిశీలించి వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధినిరోధక టీకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. పంచాయతీ విస్తరణాధికారి కె.మహాలక్ష్మి, తహసీల్దార్ జీజేఎస్ కుమార్, ఎంపీపీ మోరు శ్రావణితో సమీక్షించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎస్తేరమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ కృష్ణమోహన్, డాక్టర్ వి.రాంబాబు ఆమెతో ఉన్నారు.