Pedavagu bridge
-
పెదవాగు ప్రాజెక్టు రీడిజైన్ చేస్తాం
అశ్వారావుపేట రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టును రీడిజైన్ చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన గుమ్మడవల్లి, కొత్తూరు, నారాయణపురంలో పర్యటించి వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధిక వర్షాలు, వరద పోటుతో పెదవాగు ప్రాజెక్టుకు పడిన గండ్లను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ, పెదవాగు ప్రాజెక్ట్‌కు గండ్లు పడి భారీగా ఆస్తి, పంట నష్టపోవడం బాధాకరమని, ఇందులో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పెదవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసినా ప్రయోజనం ఉండదని, తిరిగి నిర్మించడమే మంచిదని అన్నారు.గోదావరి నదీ యాజమాన్య బోర్డు, ఏపీ రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా, అదనంగా మరో మూడు గేట్లు ఏర్పాటుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వానాకాలం సీజన్ నాటికే ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల వెంట భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజ్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.దెబ్బతిన్న పార్వతీ బరాజ్ కరకట్టమరమ్మతు చేపట్టిన నీటిపారుదల శాఖ అధికారులుమంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపు రం గ్రామ సమీపంలోని పా ర్వతీ బరాజ్ కరకట్ట కోతకు గురైంది. అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికా రులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టారు. ఏడాదిన్నర క్రితం బరాజ్ డెలివరీ సిస్టం వైపు ఉన్న కరకట్ట దెబ్బతినగా మట్టి పోశారు. కానీ, భారీ వర్షాలకు మరోసారి కరకట్ట కోతకు గురైంది. అప్పటినుంచి మరమ్మతు చేపట్టలేదు. జాతీయ భద్రత ప్రాధికార సంస్థ ఆదేశాలకనుగుణంగా ప్రస్తుతం బరాజ్ మరమ్మతు కొనసాగుతోంది. ఈ క్రమంలో దిగువ గేట్లవైపు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 74 గేట్లను ఎత్తడంతో బరాజ్‌లోని నీరు పూర్తిగా ఖాళీ అయింది. పనిలోపనిగా గతంలో దెబ్బతిన్న కరకట్ట మరమ్మతు కూడా చేస్తున్నారు. కరకట్ట కోతకు గురికాకుండా పకడ్బందీగా పనులు..నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోనే కరకట్ట కోతకు గురైనట్లు పలువురు భావించారు. కానీ, బరాజ్‌లోకి పూర్తిస్థాయి నీరు చేరినా...కరకట్ట కోతకు గురికాకుండా పనులు పకడ్బందీగా చేస్తున్నామని డీఈఈ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. కోతకు గురైన ప్రాంతంలో మట్టి తొలగించి కంకర, సిమెంట్, కాంక్రీట్తోపాటు దిగువకు జారకుండా సిమెంట్ బిళ్లలు అమర్చుతామని ఆయన వివరించారు.ఏవైనా అనూహ్య పరిస్థితులేర్పడి కరకట్ట ప్రమాదానికి గురైనా దిగువన 130 మీటర్ల లోతు ఉంటుందని, సమీప గ్రామాలకు వరద చేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. కాగా బరాజ్‌లోకి 5,429 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతేమొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నామని ఆయన వివరించారు. -
కుంగిన పెదవాగు బ్రిడ్జి
చండ్రుగొండ/కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: చండ్రుగొండ-కొత్తగూడెం మండలాల మధ్య రాఘవాపురం సమీపంలో గల పెదవాగు బ్రిడ్జి కూలేందుకు సిద్ధంగా ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి మధ్య భాగంలో సపోర్టుగా ఉన్న రెండు పిల్లర్లు శిథిలావస్థకు చేరి కుంగిపోయాయి. దీంతో మధ్యభాగంలో బ్రిడ్జి కూలిపోయే దశకు చేరుకుంది. సమాచారం తెలుసుకున్న చండ్రుగొండ ఎస్ఐ దేవేందర్‌రావు సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ బ్రిడ్జిపైనుంచి రాకపోకలు సాగించవద్దని తహసీల్దార్ ప్రసాద్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెదవాగులో పాఠశాల బస్సుపడి ఎనిమిదిమంది చిన్నారులు మృతి చెందిన విషయాన్ని ఈప్రాంతం ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అలాంటి ఈవాగుపై ఉన్న బ్రిడ్జిపరిస్థితిని వివరిస్తూ... ‘సార్లూ... పెద్దవాగు గుర్తుందా.. పొంచి ఉన్న మరోప్రమాదం’ అనే శీర్షికన ఈనెల 18వ తేదిన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. బ్రిడ్జిపై ప్రమాదం పొంచి ఉండటంతో ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోగా, శుక్రవారం నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో చండ్రుగొండ-కొత్తగూడెం మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం తరపున ఈ ప్రాంతంలో పర్యటించిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. బ్రిడ్జి పునర్నిర్మాణంతోపాటు సుజాతనగర్ - తిప్పనపల్లి మధ్య డబుల్‌రోడ్డు నిర్మాణం చేయిస్తామని మంత్రి చేసిన ప్రకటన నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ బ్రిడ్జిపై ప్రమాదం పొంచి ఉన్నప్పటకీ రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇటు వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని ఈప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు బ్రిడ్జిపై ప్రయాణాలు నిలిచిపోవడంతో చండ్రుగొండ - సుజాతనగర్, కొత్తగూడెం మధ్య నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు, వ్యాపారులు, విద్యార్థులు ఈ మార్గం గుండా రాకపోకలు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో సుమారు 20 గ్రామాల మధ్య పెదవాగు బ్రిడ్జి ప్రధాన వారధిగా ఉంది. ఇప్పటికైనా అధికారులు సత్వర చర్యలు తీసుకుని మరమ్మతులు నిర్వహించాలని తుంగారం సర్పంచ్ బాణోత్ పార్వతి, నాగా సీతారాములు, రాఘవాపురం సర్పంచ్ వెంకట సాంబయ్య, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట వైఎస్సార్సీపీ నేతలు పొంగులేటి, తాటి చండ్రుగొండ, న్యూస్‌లైన్ : పెదవాగుపై బ్రిడ్జి కుంగి ప్రమాదభరితంగా మారిన ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తాటి వెంకటేశ్వర్లు స్పందించారు. సుజాతనగర్-చండ్రుగొండ మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయిన సమాచారం తెలుసుకున్న వారు శుక్రవారం రాత్రి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి ఇది నిదర్శనమన్నారు. పాఠశాల బస్సుప్రమాదం జరిగి, ఎనిమిది మంది పిల్లలు చనిపోయినా ఈవాగు పరిస్థితిపై ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. చండ్రుగొండ - కొత్తగూడెం రెండు మండలాల మధ్య 20 గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు చేసే ప్రధాన మార్గమైన ఈ రోడ్డులోని బ్రిడ్జి శిధిలమై ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం పాలకపక్షం అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.