peddmma
-
పెద్దమ్మతల్లిని దర్శించుకున్న తలసాని
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సోమవారం భద్రాచలం సీతారాముల కళ్యాణానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈఓ, «సంకటాల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడిబాలశౌరి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసిన అనంతరం మంత్రి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధర్మకర్తులు కొత్తవెంకట్రెడ్డి, పోతురాజు వెంకటేశ్వర్లు, జామ్లా, తిమ్మిరి నరేంద్రబాబు, అరుద్ర సత్యనారాయణలతో కలిసి ఈఓ, ఆలయకమిటీ చైర్మన్ మంత్రికి శేషవస్త్రప్రసాదాలను అందజేశారు. -
శాకాంబరిగా ‘పెద్దమ్మ’
పాల్వంచ సమీపంలోని జగన్నాథపురం– కేశ్వాపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి (శ్రీకనకదుర్గ మాత) ఆదివారం శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పునీతులయ్యారు. భారీగా వచ్చిన భక్తులను ఆలయ సిబ్బంది క్యూలైన్లో దర్శనం కోసం పంపించారు. ఈఓ జగన్మోహన్రావు, సూపరింటెండెంట్ సత్యనారాయణ పర్యవేక్షణలో పురాణ పురుషోత్తమశర్మ, శేషాద్రిశర్మ, వేదపండితులు పద్మనాభశర్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని..మొక్కులు చెల్లించారు. – పాల్వంచ రూరల్