ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై ఫిర్యాదుకు యత్నం
విజయవాడ: అధికార పార్టీని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆగడాలు సృష్టిస్తున్నారంటూ ముస్లింలు శనివారమిక్కడ ఆందోళనకు దిగారు. మతతత్వ పార్టీలకు దూరంగా ఉండాలన్న ఫత్వాను జలీల్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదే విషయాన్ని శనివారం విజయవాడలో పర్యటిస్తున్న ముస్లిం మతగురువు పీర్ షబ్బీర్ అహ్మద్ కు ఫిర్యాదు చేసేందుకు ముస్లింలు యత్నించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి మత పెద్దలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.