peoples lives
-
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. అది సరైంది కాదని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి హితవు పలికారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైద్యం కోసం పేదలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న వైఎస్సార్ 2007లో మూడు జిల్లాల్లో ఆరోగ్యశ్రీని ప్రారంభించి తొమ్మిది నెలలు తిరగక ముందే మిగతా 20 జిల్లాలకు వర్తింపజేశారన్నారు. 500 రోగాలను అందులో చేర్చడంతో పథకం ద్వారా వేలాది మంది లబ్ధి పొందారన్నారు. వైఎస్సార్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చే శారన్నారు. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీని మూసివేయడానికి కంక ణం కట్టుకున్నట్లు కన్పిస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 450 కోట్లు బకాయి చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. తక్షణమే బకాయిలు చెల్లించి... ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్య శ్రీపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రులు స్పందించాలి... హైకోర్టు రూపొందించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలని, తమకు న్యాయం కావాలని తెలంగాణ న్యాయాధికారులు చేస్తున్న డిమాండ్ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇద్దరు సీఎంలు, గవర్నర్, చీఫ్ జస్టిస్ కూర్చొని తక్షణమే చట్టపరంగా దీనికి పరిష్కార మార్గం వెతకాలన్నారు. -
కరెంట్ వచ్చింది... కట్నం పెంచింది!
ఆ ఊరిలో అడుగుపెట్టిన ప్రతి కోడలు పిల్ల ఒక టీవీని వరకట్నంగా వెంట పెట్టుకుని వస్తోంది. అతి త్వరలో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలున్న ‘భారతదేశం’లో ఇప్పుడిప్పుడే విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్న గ్రామాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచి, మరో ఆరేళ్లు గడిచాక చిబావుఖేరా గ్రామానికి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విద్యుత్సరఫరా ప్రారంభమైంది. అలాగని ఇది ఏ మారుమూల గ్రామమో అనుకుంటే పొరపాటు. లక్నోకు 20 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం ఇది. ఈ ఊరికే విద్యుత్ సరఫరా ‘కాస్తంత’ ఆలస్యంగా మొదలైంది. ఈ సౌకర్యం ఇక్కడి ప్రజల జీవితాలను ఏ విధంగా మార్చింది? కరెంట్ సరఫరా మొదలైన ఐదు నెలలకు ఇక్కడి ప్రజలను జీవితాలు ఏ విధంగా ప్రభావితమయ్యాయి? ఈ విషయం గురించి ఒక వార్తా సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన పరిణామాలెన్నో ఆవిష్కృతమయ్యాయి. 150 ఇళ్లు ఉండే ఈ ఊరికి విద్యుత్ సరఫరా మొదలవ్వడం పెళ్లి సంబంధాలను ప్రభావితం చేస్తోంది. ఊరికి కరెంట్ వచ్చింది కాబట్టి.. ఇంట్లో టీవీ ఉంటే బావుంటుందన్న ఆశ మొదలైంది ఇక్కడి ప్రజల్లో. టీవీలను సొంతంగా కొనుక్కోవడం కాకుండా, పెళ్లిళ్లలో కట్నంగా ఇవ్వాలని అడిగి తెప్పించుకునే పనిలో పడ్డారు వీరు. ఈ మధ్యకాలంలో ఈ ఊరిలో అడుగుపెట్టిన ప్రతి కోడలు పిల్ల ఒక టీవీని వెంటపెట్టుకుని వస్తోంది. మరికొందరు తమ తాహతును బట్టి.. టీవీతో పాటు డీవీడీ ప్లేయర్, టీవీ స్థాయి కట్నం ఇవ్వలేని వాళ్లు టేప్రికార్డర్లను కట్నంగా తెస్తున్నారు. అయితే టీవీల వల్ల అమాంతం కట్నం పెరిగిపోయిందని అమ్మాయిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవేం కరెంటు కష్టాలో!