percentages
-
బ్యాంకులకు ‘వీడియోకాన్’ లో 8 శాతం వాటాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కుదేలైన వీడియోకాన్ గ్రూప్‌లోని 11 అనుబంధ కంపెనీల విలీనంతో ఏర్పడే సంస్థలో ఆర్థిక రుణదాతలకు 8 శాతం వాటా లభించనుంది. వీడియోకాన్ కొనుగోలు కోసం ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళిక ప్రకారం.. లిస్టెడ్ కంపెనీలైన వీడియోకాన్ ఇండస్ట్రీస్ (వీఐఎల్), వేల్యూస్ ఇండస్ట్రీస్ (వీఏఐఎల్)ను డీలిస్ట్ చేస్తారు. ఆ తర్వాత వీఏఐఎల్ సహా గ్రూప్‌లోని 11 సంస్థలను వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేస్తారు. అయితే, వీడియోకాన్ టెలికం మాత్రం అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. వీఐఎల్ మొత్తం షేర్లలో 8 శాతాన్ని రుణదాతలకు నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. వీఐఎల్, వీఏఐఎల్ డీలిస్టింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, వీడియోకాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో డీలిస్టింగ్‌కు సంబంధించి ఈ రెండు సంస్థల షేర్హోల్డర్లకు దక్కేదేమీ లేదు. వీడియోకాన్ టేకోవర్‌కు మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కి చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సమర్పించిన రూ. 2,962 కోట్ల ప్రణాళికకు జూన్ 9న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. చదవండి: తల్లిదండ్రులారా జాగ్రత్త, మీ పిల్లల ఫోన్లపై కన్నేయండి -
పర్సంటేజీల పితలాటకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అక్రమాలకు.. అవినీతి వ్యవహారాలకు ఆలవాలంగా మారిన నెల్లూరు నగరపాలక సంస్థలో పర్సంటేజీల పితలాటకం తాజాగా రచ్చకెక్కింది. వివిధ అభివృద్ధి పనులను దక్కించుకున్న అధి కార పార్టీకి చెందిన ప్రధాన కాంట్రాక్టర్.. ఆ పనులను విభజించి అదే పార్టీకి చెందిన వారికి సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. కమీషన్లు ఎరచూపి పైపై మెరుగులతో పనులు కానిచ్చేసిన సదరు వ్యక్తులు బిల్లుల కోసం నగరపాలక ఇంజినీరింగ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం పర్సంటేజీ సొమ్ములు ఇవ్వకపోవడం.. అధికారంలో ఉన్నాం కాబట్టి బిల్లులు ఇవ్వాలని కోరటం.. అందుకు ఇంజినీరింగ్ విభాగం ససేమిరా అనటంతో ఈ వ్యవహారం కాస్తా రసకందాయంలో పడింది. రెండేళ్ల క్రితం పనులవి డ్రెయిన్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణంతో పాటు ఎస్సీ కాలనీలు, శివారు ప్రాం తాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రూ.42 కోట్ల విలువైన పనులకు 2015 మే నెలలో ప్రతిపాదించారు. వాటిని 8 ప్యాకేజీలుగా విభజించి 2016 అక్టోబర్ 13న టెండర్లు పిలిచారు. వీటిలో 7 పనులు మాత్రమే ఖరారు కాగా.. అధికారపార్టీ నేతలు రంగంలోకి దిగారు. టీడీపీ నగర, రూరల్ నియోజకవర్గాల ఇన్చార్జిలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆ పనులను తమ అనుచరులకే దక్కేలా చక్రం తిప్పి ముందుగానే పంచుకున్నారు. ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 టెండర్లను ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి సమీప బంధువు శ్రీహరి దక్కించుకున్నారు. ఆయన వాటిని 30 మంది సబ్ కాంట్రాక్టర్లకు పర్సంటేజీ ప్రాతిపదికన అప్పగించారు. వాటిలో దాదాపు 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు అంచనా వేశారు. ఇదిలావుంటే.. ఆ పనులకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగానికి చెల్లించాల్సిన పర్సంటేజీ వ్యవహారం తేలకపోవడంతో బిల్లుల చెల్లింపు వ్యవహారం నెల రోజులుగా పెండింగ్‌లో పడింది. ఈ విషయాన్ని టీడీపీ నేతలు కమిషనర్ ఢిల్లీరావు దృష్టికి తీసుకెళ్లడంతో సొమ్ము చెల్లింపునకు ఫైల్ వెంటనే పెట్టాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగంలో దీనిపై తర్జన భర్జనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. రూ.60 లక్షలు ఇస్తేనే.. సాధారణంగా నగరపాలక ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతి పనికి దాని విలువలో 6 శాతం సొమ్మును పర్సం టేజీగా కాంట్రాక్టర్ నుంచి వసూలు చేస్తారు. కొందరైతే ముందుగానే ఆ మొత్తం తీసుకుని పనులు మొదలు పెట్టిస్తారు. కొన్ని పనుల్లో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటే బిల్లు చెల్లింపు సమయంలో వసూలు చేసుకుంటారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగం ఏఈకి 3 శాతం, డీఈకి 2 శాతం, ఎస్ఈకి 1 శాతం వాటాలు ఉం టాయి. తాజాగా పూర్తి చేసిన రూ.10 కోట్ల విలువైన పనులకు సంబంధించి సుమారు రూ.60 లక్షల వరకు అధికారులకు మామూళ్ల రూపంలో ఇవ్వాల్సి ఉంది. ప్రధాన కాంట్రాక్టర్‌తోపాటు సబ్ కాంట్రాక్టర్లు ఆ వ్యవహారాన్ని తేల్చకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదని సమాచారం. -
తలా పిడికెడు!
చేతులు మారుతున్న నామినేటెడ్ పనులు నాయకులు... ఇంజినీరింగ్ అధికారులకూ పర్సంటేజీలు లాభాలకోసం నాసిరకం పనులు చంద్రన్నబాట, నీరుచెట్టులో నాణ్యత డొల్ల సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రభుత్వ పనులు ఎంతోమందికి కాసులు కురిపిస్తున్నాయి. పనులు మంజూరు చేయించిన నాయకులకు ముడుపుల రూపంలో మిగులుతున్నాయి. ఇంజినీరింగ్ అధికారులకు పర్సంటేజీలు వస్తున్నాయి. పనులు చేసే కాంట్రాక్టర్లకు లాభాలొస్తున్నాయి. ఇక పనులు నాసిరకంగా మిగులుతున్నాయి. నాణ్యతలేకుండా... మమ అనిపించేస్తున్న పనులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. గతుకుల మయమైన చంద్రన్నబాటలు... నీటి ప్రవాహం లేకుండానే గట్లుతెగుతున్న కాలువ పనులు... ఈ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. చంద్రన్నబాట కింద వేసిన రోడ్లు: 320 కిలోమీటర్లు ఖర్చు చేసిన నిధులు: సుమారు రూ. 106కోట్లు నీరు చెట్టు కింద మంజూరైన పూడిక తీత, చెరువు గట్టు పనులు : 2703 మంజూరు చేసిన నిధులు : రూ. 180.75 కోట్లు నీరు చెట్టు కింద మంజూరైన మదుములు, స్లూయిజ్ పనులు : 2,047 వాటి కోసం కేటాయించిన నిధులు : రూ. 144.94కోట్లు జిల్లాలో ఇటీవల జరుగుతున్న పనులు నాసిరకానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. చంద్రన్నబాట పేరుతో నిర్మించిన సీసీరోడ్లు, నీరుచెట్టు పథకం ద్వారా చేపట్టిన కాలువ మరమ్మతు పనులు పూర్తిగా అక్రమాలకు అడ్డాగా మారాయి. చంద్రన్నబాటలు ఎంతలా పక్కదారి పట్టాయో నిగ్గుతేల్చాలంటూ లోకాయుక్త, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్‌కు విస్తృతంగా ఫిర్యాదులు అందాయి. అంతేనా... నీరు చెట్టు పేరుతో కాలువల పూడికతీత పనులు, చెరువు గట్టు పటిష్ట పనులు పూర్తి చేయకుండానే చెల్లింపులు జరిగిపోయిన సంఘటనలూ.... తవ్వినమట్టిని లేఅవుట్లకు తరలించి అటు ప్రభుత్వం నుంచి, ఇటు రియల్టర్ల నుంచి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్న వైనాలూ... ముదుములు, తూములు, స్లూయిజ్ పనుల్లో జరిగిన అక్రమాలూ బహిరంగ రహస్యాలుగా మారాయి. అంతా అడ్డగోలే... పనులు మంజూరైన దగ్గరి నుంచి చేపట్టిన వరకు అడ్డుగోలు కార్యక్రమమే నడిచింది. నామినేటెడ్ పద్ధతిలో మంజూరైన పనులను సంబంధిత సర్పంచ్‌లు, నీటి సంఘాల అధ్యక్షులు చేపట్టాల్సి ఉంది. కానీ, కొందరు అధికార పార్టీ నేతలు కష్టపడకుండానే సొమ్ము చేసుకోవాలన్న అత్యాశతో పనులను కాంట్రాక్టర్లకు అమ్మేశారు. ఉదాహరణకు రూ. లక్ష పని విలువైతే అందులో రూ. 10వేల నుంచి రూ. 15వేలు తీసుకుని కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. కొందరు ఆ పనులు చేపట్టకుండానే బిల్లులు చేసేసుకోవడంలో అధికారులు ఇతోథికంగా సాయపడ్డారు. ఇంజనీర్లకు పర్సంటేజీలు పనుల నాణ్యతను ప్రశ్నించకుండా ఉండేందుకు ఇంజినీరింగ్ అధికారులు పెద్ద మొత్తలో పనివిలువలో పర్సంటేజీలు లాగేస్తున్నారు. చంద్రన్న బాటలో వేసిన సిమెంట్ రోడ్ల కోసం 10నుంచి 12శాతం తీసుకుంటున్నారు. కొన్నిచోట్లైతే ఆ పర్సంటేజీల శాతం 15వరకు వెళ్లింది. అంటే రూ. లక్ష పని విలువలో రూ. 10వేల నుంచి రూ. 15వేల వరకు తీసుకుంటున్నారు. ఇక, ఇరిగేషన్ అధికారులైతే 15నుంచి 20శాతం వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన పని విలువ రూ .లక్ష అయితే అందులో రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నారు. లాభాలకోసం... తూతూ మంత్రం పనులు పనులు అమ్మినోళ్లకు 10నుంచి 15శాతం పర్సంటేజీ వెళ్లిపోతోంది. ఇంజినీరింగ్ అధికారులకు 10నుంచి 20శాతం పర్సంటేజీల కింద పోతోంది. ఇక పనులు చేసే కాంట్రాక్టర్ లబ్ధికోసం ఇష్టానుసారం పనులు చేస్తున్నారు. అడుగడుగునా ముడుపులు వారి పనుల్ని ప్రశ్నించనీయకుండా చేసింది. అలా అంచెలంచెలుగా జరిగిన అక్రమాలవల్ల కాలువలకు గండ్లు పడటం... రోడ్ల రాళ్లు తేలడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. వాటిపై వెళ్తున్న ఫిర్యాదులపై లోకాయుక్త, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ ఏమేరకు స్పందిస్తుందన్నది వేచి చూడాలి.