ఆప్షన్ల తరువాతే శాశ్వత కేటాయింపులు
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు తాత్కిలికమేనని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందిన తరువాత ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటారని ఆయన తెలిపారు.
ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్న తరువాత శాశ్వత కేటాయింపులు చేస్తారని ఆయన చెప్పారు. రెచ్చగొట్టేలా తెలంగాణ ఉద్యోగులు మాట్లాడటం సరికాదని మురళీకృష్ణ అన్నారు.