Permanent buildings
-
పల్లె సేవకు వేగంగా సిద్ధమవుతున్న భవనాలు
సాక్షి, అమరావతి: పల్లెటూళ్లలోని ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా.. సొంత ఊరిలోనే సేవలన్నీ అందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన భవనాల నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. రూ. 40 లక్షలతో గ్రామ సచివాలయం, రైతులకు వ్యవసాయ సంబంధిత సహాయం, సలహాల కోసం రూ. 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, గ్రామంలోనే వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా రూ. 17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 12 వేల కోట్ల ఖర్చుతో 36,708 శాశ్వత భవన నిర్మాణాలను ఈ ప్రభుత్వం వచ్చాక మొదలుపెట్టగా.. ఇప్పటి వరకూ 9,628 భవనాలు పూర్తయ్యాయి. మరో 4,757 భవన నిర్మాణ పనులు పైకప్పు కూడా అయిపోయి దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అన్ని భవనాల నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను ఏమాత్రం ఆలస్యం లేకుండా చెల్లిస్తోంది. వేగంగా పనులు.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు మండల కేంద్రంలో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామ సచివాలయం భవన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం రంగులు వేసే పనులు కొనసాగుతున్నాయి. మంత్రాలయం మండలం చిట్నహళ్లి గ్రామంలో హెల్త్ క్లినిక్ భవనం ప్రస్తుతం బేస్మెంట్, ఫిల్లర్ల నిర్మాణం పూర్తయి గోడల నిర్మాణం దశలో ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భవనాల నిర్మాణం పనులు వేగంగా సాగుతూ వివిధ దశల్లో ఉన్నాయి. సత్వరం బిల్లులు చెల్లింపు.. ఇప్పటిదాకా పూర్తయిన, పురోగతిలో ఉన్న భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా చెల్లించిందని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లోనూ నిర్మాణ పనులను అనుసరించి ఒక్కో దశ పూర్తయిన వెంటనే ఆ దశకు సంబంధించి బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం ముందస్తు కార్యచరణ సిద్ధం చేసినట్టు అధికారులు వెల్లడించారు. బిల్లులు పెండింగ్ లేకుండా చూడటంతో పాటు నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలు పూర్తికి వీలుగా గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ ప్రతి వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. సిమెంట్ ధరల వల్ల పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు సిమెంట్‌ను కూడా సరఫరా చేయిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి సైతం వారం వారం ఉన్నతాధికారులతోనూ, జిల్లాల కలెక్టర్లతోనూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా పైనుంచి కింది స్థాయి సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ వరకూ నిరంతరం శ్రమిస్తు.. పనుల్లో రాజీ పడకుండా నిర్మాణ పనులు కొనసాగేలా చూస్తున్నారు. -
గ్రామ సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. తద్వారా గ్రామాల్లో ఆస్తిని సమకూర్చనుంది. ఇందుకోసం రూ.3,825.15 కోట్లను వెచ్చిస్తోంది. గ్రామాల్లో శాశ్వత మౌలిక వసతులకు ఒక్క గ్రామ సచివాలయాలపైనే ఇంత మొత్తంలో వ్యయం చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు భవన నిర్మాణాలతో గ్రామాలకు కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. ముమ్మరంగా పనులు గ్రామ సచివాలయాల భవన నిర్మాణాల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి వీటి నిర్మాణం పూర్తి చేస్తాం. బిల్లులు చెల్లించక ఎక్కడా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు ఆగిపోలేదు. ప్రతి వారం వీటి పురోగతిని సమీక్షిస్తున్నాం. – గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ -
రాజధాని శాశ్వత భవనాల వ్యయం రెట్టింపు
సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయం తరహాలోనే రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణ వ్యయం కూడా భారీ స్థాయికి చేరుకుంది. తాత్కాలిక సచివాలయం పేరుతో ఇప్పటికే భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆడిట్ నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేయడం తెలిసిందే. ఈ పనులను టెండర్ నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎక్సెస్‌తో కాంట్రాక్టర్లకు అప్పగించారని ఆడిట్ నివేదికలో పేర్కొంది. చిన్నపాటి వాన కురిస్తేనే తాత్కాలిక సచివాలయంలోని కార్యాలయాల్లోకి వర్షం నీరు వచ్చేలా నిర్మించిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకే శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలభవనాల నిర్మాణ టెండర్లను సర్కారు అప్పగించడం గమనార్హం. శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ఐదు టవర్లలో 30 లక్షల చదరపు అడుగుల్లో రూ.1,200 కోట్లతో నిర్మించాలని తొలుత నిర్ణయించారు. అయితే టెండర్ల దగ్గరకు వచ్చే సరికి ఇది 69 లక్షల చదరపు అడుగులకు పెరిగిపోయింది. ఐదు టవర్లలో నిర్మాణం చేపట్టేందుకు మూడు ప్యాకేజీలుగా విభజిస్తూ టెండర్లను ఆహ్వానించారు. తొలి ప్యాకేజీ కింద ఐదో టవర్‌లో సాధారణ పరిపాలనశాఖ భవనాల కోసం టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్‌ను రూ.592.41 కోట్లతో ఎన్సీసీ సంస్థకు అప్పగించారు. రెండో ప్యాకేజీలో మూడు, నాలుగు టవర్ల పనులను రూ.749.90 కోట్లతో ఎల్ అండ్ టీకి అప్పగించారు. ఒకటి, రెండో టవర్లకు మూడో ప్యాకేజీ కింద టెండర్లను ఆహ్వానించి రూ.932.46 కోట్లకు షాపూర్జీ పల్లోంజీకి అప్పగించారు. మొత్తం ఐదు టవర్లలో శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల నిర్మాణ వ్యయాన్ని రూ.2,274.77 కోట్లుగా పేర్కొన్నారు. తొలుత 30 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలను చేపట్టాలని భావించి తరువాత 69 లక్షల చదరపు అడుగులకు ఎందుకు పెంచారో అర్థం కావడం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. విభిన్న సదుపాయాల పేరుతో ఇంటిగ్రేటెడ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారని, ఇందులోనే అన్ని రకాల వసతుల కల్పనకు ఆస్కారం ఉన్నప్పటికీ కొత్తగా ఐదు టవర్లలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,060 కోట్ల అంచనాతో మరో టెండర్‌ను ఆహ్వానించారని ఆ ఉన్నతాధికారి తెలిపారు. పేరుకు మాత్రమే టెండర్లను ఆహ్వానించి ఎవరూ ముందుకు రాలేదంటూ రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన ఆ పనులను కూడా ఐదు టవర్లు నిర్మించే సంస్థలకే పందేరం చేయనున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. రెట్టింపు దాటిన కన్సల్టెంట్ ఫీజు ఐదు టవర్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కోసం తొలుత 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.1,200 కోట్ల అంచనాతో టెండర్‌ను ఆహ్వానించగా ప్రాజెక్టు వ్యయంలో 0.89 శాతం ఇచ్చేందుకు సీఆర్డీఏ ‘ఈజీఐఎస్’ను ఎంపిక చేసింది. తొలుత అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం ప్రకారం ఈజీఎస్ కన్సల్టెంట్‌కు రూ.10.68 కోట్లు ఫీజు రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.2,274.77 కోట్లకు పెరిగిపోవడంతో ఫీజుతో పాటు జీఎస్టీ కలిపి కన్సల్టెంట్‌కు రూ.23.90 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. -
అద్దె గోడు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పక్కా భవనాలు లేకపోవడం తో పంచాయతీ సిబ్బంది రిజిస్ట్రార్ మెయింటెనెన్స్, కీ బుక్, చెక్ పవర్ వంటి పనులు ఇంటివద్దనే చేస్తున్నారు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. ఇందులో 529 జీపీలకు పక్కా భవనాలు ఉండగా.. 337 జీపీలకు పక్కా భవనాలు లేవు. కాగా, 2010లో ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కింద 256 జీపీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. మిగతా 81 జీపీల భవన నిర్మాణాలు మంజూరు లభించకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మూడేళ్లు గడుస్తున్నా మంజూరైన భవన నిర్మాణాలు కొన్ని పూర్తి కాలేదు. మరికొన్ని పునాది స్థాయిలోనే ఉన్నాయి. కొన్ని పూర్తికాగా ఇప్పటివరకు ప్రారంభించలేదు. నిర్మాణాలకు సంబంధించిన పూర్తిబాధ్యత పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులదే. ఇదిలా ఉండగా, జిల్లాలో 529 జీపీలకు భవనాలు ఉన్నాయి. ఇందులో 122 జీపీ భవనాలకు మరమ్మతు చేయాల్సి ఉంది. 12 జీపీల మరమ్మతుకు మాత్రమే 2013-14గాను ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇంకా 110 జీపీల మరమ్మతుకు నిధులు విడుదల చేయాలి. మరమ్మతుకు రూ.36 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే రాాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తి కరణ్ అభియాన్(ఆర్‌జీపీఎస్‌కేఏ) పథకం కింద జిల్లాలోని 12 గ్రామ పంచాయతీ భవనాల మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో గ్రామ పంచాయతీ భవనం మరమ్మతుకు రూ.3 లక్షల చొప్పున 12 జీపీలకు రూ.36 లక్షలు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 25 నిధులు భరిస్తుంది. అయితే మిగతా జీపీలకు కూడా విడతలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 110 జీపీ భవనాల మరమ్మతుకు మోక్షమెప్పుడు లభిస్తుందోనని ఆయా సర్పంచ్‌లు ఎదురుచూస్తున్నారు. కొత్త భవనాలకు రూ.2.77 కోట్లు జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుగా ఉండగా, ప్రస్తుతం 81 గ్రామ పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్తగా 23 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఆర్‌జీపీఎస్‌కేఏ పథకం కింద నిధులు మంజూరు చేసింది. 22 జీపీలకు ఒక్కొక్క జీపీకి రూ.12 లక్షల చొప్పున మంజూరు కాగా, బోథ్ గ్రామ పంచాయతీ భవనానికి జనాభా ప్రతిపాదికన రూ. 13.5 లక్షలు మంజూరయ్యాయి. మొత్తం 23 కొత్త భవన నిర్మాణాలకు రూ.2.77 కోట్లు మంజూరయ్యాయి. కాగా, బేల, ఇచ్చోడలోని తలమద్రి, ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్, జైనూర్లోని దబోలి, నార్నూర్‌లోని గాదిగూడ, సిర్పూర్(యు), ఉట్నూర్‌లోని బీర్సాయిపేట, హస్నాపూర్, ఆసిఫాబాద్‌లోని బురుగుగూడ, భీమిని, కన్నెపల్లి, దహేగాం, కెరమెరిలోని కరంజివాడ, తిర్యాణిలోని మంగి, వాంకిడిలోని బంబార, భైంసాలోని మహాగాం, దండేపల్లిలోని మామిడిపల్లి, కడెంలోని మున్యాల్, ఖానాపూర్లోని పెంబి, లోకేశ్వరం, సారంగపూర్‌లోని కౌట్ల(బి), తానూర్, బోథ్ గ్రామ పంచాయతీల నూతన భవనాలు మంజూరయ్యాయి. -
టంగుటూరులో టెన్షన్.. టెన్షన్
‘టంగుటూరులోని నాగేశ్వర స్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను ఈ నెల 24వ తేదీలోగా తొలగించండి’ ్చ ఓ మహిళ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై దేవాదాయశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం టంగుటూరులోని పోతుల వెస్ట్ కాలనీలో 1,250 మంది ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పొందారు. వీరిలో 600 మంది అనర్హులని అధికారులు ఆలస్యంగానైనా గుర్తించారు. 600 మందికి నోటీసులిచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. టంగుటూరులో మెయిన్ రోడ్‌పై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆర్ఓబీ నిర్మాణం వల్ల పంచాయతీ కాంప్లెక్స్‌లతో పాటు పలువురి ఇళ్లు, ప్రైవేట్ వ్యాపార సముదాయాలు తొలగించనున్నారు. టంగుటూరులో తమకు చెందిన 10 ఎకరాల ఈనాం భూములను ఆక్రమించుకున్నారని కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన కొందరు హైకోర్టులో పోరాడుతున్నారు. ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద భవనాలు, పొగాకు కంపెనీలు, సినిమా హాల్ ఈ భూమిలోనే ఉన్నాయి. దీనిపై ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు. ఈ నాలుగు అంశాలు టంగుటూరులో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఏ ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినా వీటి గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతుందడగా.. సంఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కుటుంబాలు భయంతో వణికిపోతున్నాయి. - న్యూస్‌లైన్, టంగుటూరు రాజీవ్‌నగర్ వాసుల్లో కలవరం టంగుటూరులో 1977లో ఓ ప్రదేశంలో పేదల గుడిసెలు వెలిశాయి. కాలక్రమంలో గుడిసెల స్థానంలో పక్కా భవనాలు నిర్మించారు. కొందరు వ్యక్తులు అక్కడ స్థలాలను విక్రయించి వెళ్లిపోయారు. కొనుగోలు చేసిన వారు భవనాలు నిర్మించుకున్నారు. కాలనీకి రాజీవ్‌నగర్ అని పేరుపెట్టారు. ఇక్కడ 100 పక్కా గృహాలున్నాయి. అధికారులు ప్రభుత్వ నిధులతో మౌలిక వసతులు కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఓ మహిళ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)తో అసలు విషయం బయటపడింది. ఆ భూములు నాగేశ్వరస్వామి దేవస్థానానికి చెందినవని, మొత్తం 6 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని నిరూపితమైంది. పిల్‌పై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ‘దేవుడి మాన్యంలో అనుమతి లేకుండా నిర్మించుకున్న గృహాలను ఈ నెల 24వ తేదీలోగా తొలగించండి’ అని దేవాదాయశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలవరపడ్డ కాలనీ వాసులు స్టే కోసం సుప్రీం కోర్టు మెట్లెక్కారు. స్టే కోసం టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. దేవాదాయ శాఖ మాత్రం రాజీవ్‌నగర్‌ను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. పోతుల వెస్ట్ కాలనీలో అనర్హులకు నోటీసులు సిద్ధం టంగుటూరులో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అధికారులు 50 ఎకరాల దేవాదాయ భూమిని సేకరించారు. 2009లో పోతులవెస్ట్ కాలనీ పేరుతో సుమారు 1,250 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ స్థలాల్లో ఇప్పటికే చాలా మంది పక్కా గృహాలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం పలు ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ స్థలాల్లో అనర్హులకు పట్టాలు కట్టబెట్టారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గత ఏడాది మార్చిలో విచారణకు ఆదేశించించింది. విచారణ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. స్థలాలు పొందిన వారిలో 600 మందిని అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారికి నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. నోటీసులిస్తే ఏం సమాధానం చెప్పాలో అంతుబట్టక పలువురు లబ్ధిదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న ఆర్ఓబీ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ).. ఈ మాట టంగుటూరు గ్రామస్తుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. టంగుటూరు మెయిన్‌రోడ్డులో ఆర్ఓబీ నిర్మిస్తుండటమే ఇందుకు కారణం. పంచాయతీ కార్యాలయం నుంచి రైల్వే గేటు మీదుగా కొండపి రోడ్డులో కామనివారికుంట వరకు ఉన్న మెయిన్‌రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు పంచాయతీ మార్కెట్ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్ మార్కెట్ కాంప్లెక్స్‌లు, వ్యాపార సంస్థలు, ఇళ్లు.. ఇలా ఆదాయాన్ని సమకూర్చే వనరులన్నీ మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. ఆర్ఓబీ నిర్మాణంతో ఇవన్నీ కూలే అవకాశముంది. నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని రైల్వే ఉన్నతాధికారులను కలిసి టంగుటూరు వాసులు విన్నవించారు. సమస్యను ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జనం మాటలు వారు వినకపోగా.. ఆర్ఓబీ నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మార్గంలో మట్టి శాంపిల్స్ కూడా సేకరించడంతో గ్రామస్తుల్లో ఆందోళన ఎక్కువైంది. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘కుమ్మరి ఈనాం భూములు మావే’ టంగుటూరులో సుమారు పది ఎకరాల కుమ్మరి ఈనాం భూములకు అసలైన వారసులం తామేనంటూ కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఐదేళ్ల క్రితం హైకోర్టులో కేసు వేశారు. తమ పూర్వీకుల పేరున ఉన్న కుమ్మరి ఈనాం భూములను తమకు స్వాధీనం చేయాలని వారు పోరాడుతున్నారు. అత్యంత ఖరీదైన ఈ 10 ఎకరాల భూములు గ్రామంలో ఆర్థికంగా బలవంతులైన వారి చేతిలో ఉన్నాయి. ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద భవనాలు, పొగాకు కంపెనీలు, సినిమా హాల్‌ను ఈ భూముల్లో నిర్మించారు. ఈ విషయంపైనా గ్రామంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.