నెలలోపే పరిశ్రమలకు అనుమతులు!
మీరు ఏదైనా పరిశ్రమ పెట్టాలనుకుంటున్నారా? అందుకు అనుమతుల కోసం చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. ఇక ఎలాంటి పరిశ్రమకైనా నెల రోజుల్లోనే అనుమతులు వచ్చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇంతకుముందున్న ఏపీ సింగిల్ విండో క్లియరెన్స్ యాక్ట్ 2002కు మార్పులు చేసి కొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీనికింద నెల రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనున్నారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఈ విధానం ఉండబోతోంది. అనుమతలు కోసం కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి, కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. నోడల్ ఏజెన్సీలు కూడా ఏర్పాటవుతున్నాయి. అనుమతుల జాప్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటుచేస్తారు.