personal problems
-
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
తెలకపల్లి (నాగర్‌కర్నూల్) : మండల పరిధిలోని గడ్డంపల్లికి చెందిన ఎస్.శ్రీనివాస్‌రెడ్డి (42) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఇటీవలే సమస్య అధికం కావడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్క డికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య రజిత, కుమారుడు, కూతురు ఉన్నా రు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు. -
మనోల్లాస యోగం
వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, వృత్తి నిర్వహణలో వచ్చే సమస్యలు, విద్యార్థుల సమస్యలు – ఇవన్నీ మానసిక ఒత్తిడికి కారణం అని అందరికీ తెలుసు. కానీ, ఈ ఒత్తిడి వల్ల మనసు, శరీరంపై ఎటువంటి దుష్ప్రభావం ఉంటుందో ముందుగా తెలుసుకుంటే ఈ సమస్యను నివారించడం లేదా పరిష్కరించడం ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలోని ఎడ్రినల్ గ్రంధులు కార్టిజోన్, ఎడ్రినలిన్, నార్ ఎపినెఫ్రైన్ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఎడ్రినలిన్ వలన గుండె వేగం పెరిగి తద్వారా రక్తపోటు పెరుగుతుంది. కార్టిజోన్ వలన రక్తనాడుల లోపల లైనింగ్ పనితీరు క్రమం దెబ్బతింటుంది. ఇది గుండెపోటుకు దారి తీయవచ్చు. కార్టిజోన్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఆకలికి సంబంధించి మార్పులు రావడం, బరువు పెరగడం, జీర్ణాశయ సమస్యలు, ఆస్టియోపొరోసిస్, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులకు కారణమవుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్‌ని ఉత్పత్తి చేసి, ఉన్న బ్రెయిన్ సెల్స్ చనిపోవడానికి, కొత్త బ్రెయిన్ సెల్స్ పుట్టకుండా చేస్తుంది. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, స్కీజోఫ్రేనియా, డిమిన్షియా, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. యోగ ఆసనాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. దీనికి చేయవలసిన కొన్ని ముఖ్యమైన ఆసనాలు –ఒత్తిడిలో ఉన్నప్పుడు ముందుగా తలలోని భాగాలు, మెడ, భుజాలు బాగా ప్రభావితమవుతాయి. కనుక వీటికి సంబంధించిన యోగాసనాలు చేయాలి. వీటిలో బ్రహ్మముద్రలు, చాలన తాలాసన, ఉత్థాన హస్తపాదాసన. మార్జాలాసన, అర్ధ అధోముఖ, అధోముఖ శ్వానాసన, నిరాలంబాసన, ఉదరాకర్షణాసన, మకరాసన, శశాంకాసన.. వంటి తేలికపాటి ఆసనాలు రెగ్యులర్‌గా సాధన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. యోగనిద్ర, సరైన ధ్యాన మార్గాలను కూడా సాధన చేసినట్లయితే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. ఆసనాలు చేసే విధానం... 1.చాలన తాలాసన కుడి ఎడమలకు ముందు సమస్థితిలో నిలబడి, కుడికాలు ముందుకు ఎడమకాలు వెనుకకు ఉంచి శ్వాసతీసుకుంటూ చేతులు రెండూ పైకి లేపి, శ్వాస వదులుతూ చేతులు రెండూ ముందు నుండి డయాగ్నల్‌గా కిందకు తీసుకురావాలి. కాలి మడమను తిప్పుతూ వెనుకకు తిరుగుతూ చేతులు రెండూ డయాగ్నల్‌గా క్రిందనుంచి పైకి తీసుకువెళ్ళి చేతులు విశ్రాంతిగా భుజాల వెనుక ఉన్న ట్రెపీజియస్ కండరాల మీద ఉంచాలి. ఈ విధంగా ముందునుండి వెనుకకు, వెనుక నుండి ముందుకు 5 నుండి 10 సార్లు చేయాలి. ఇదేవిధంగా రెండవవైపు కూడా చేయాలి. నెమ్మదిగా, సౌకర్యవంతంగా శ్వాస తీసుకుని వదులుతూ చేయాలి. 2. ఉత్థాన హస్తపాదాసన సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందు నుండి పైకి తీసుకువెళ్ళి, శ్వాస వదులుతూ మోకాళ్లు ముందుకు వంచి క్రిందకు వంగి, చేతులు రెండూ ఫొటోలో చూపినట్లుగా వెనుకకు, పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందు నుంచి పైకి తీసుకువెళ్లాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయవచ్చు. 3. అధోముఖ శ్వానాసన చేతులు రెండూ క్రిందకు ఉంచిన తరువాత (పై పొజిషన్లో) కుడికాలు వెనుకకు తరువాత ఎడమకాలు వెనుకకు తీసుకువెళ్లి శ్వాస వదులుతూ నడుమును పైకి తీసుకువెళ్లి పొట్టని బాగా లోపలకు లాగుతూ 3 లేదా 5 శ్వాసలు ఉండాలి. ఈ స్థితిలో తలవైపునకు రక్తప్రసరణ పెరిగి మెదడు తదితర భాగాలు చురుకుగా పనిచేస్తాయి. 4. నిరాలంబాసన పై స్థితిలో నుండి శ్వాస తీసుకుంటూ కుడి మోకాలు క్రిందకు, తరువాత ఎడమ మోకాలు క్రిందకి తీసుకువచ్చి మార్జాలాసనంలో రిలాక్స్ అవ్వాలి. తరువాత రెండు కాళ్ళు వెనుకకు స్ట్రెచ్ చేస్తూ పొట్ట భాగాలు పూర్తిగా నేలకు తాకే విధంగా చెక్ చేసుకుంటూ మోచేతులు రెండూ నేలమీద ఉంచి, చేతులు గడ్డం కింద ఉంచి 3 నిమిషాలు రిలాక్స్ అవ్వచ్చు. 5. ఉదరాకర్షణాసన భూమి మీద బోర్లాపడుకుని కుడి చేయి నడుముకి పక్కన, ఎడమ చేయి తలకు సమాంతరంగా ఎడమ మోకాలు మడచి ఎడమపాదం కుడి తొడకు దగ్గరగా తీసుకువచ్చి శరీరంలో వీలైనన్ని భాగాలు భూమి మీద ఆనిస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా కనీసం 3 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇది హై బీపీని తగ్గించడంలో మెటబాలిక్ రేట్‌ని రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. 6. యోగనిద్ర పైన చెప్పిన ఆసనాలు అన్నీ పూర్తయిన తరువాత కొన్ని తేలికపాటి ప్రాణాయామాలు (సూర్య భేది, అనులోమ విలోమ, చంద్రభేది, భ్రామరి) చేయాలి. తర్వాత యోగనిద్రలోకి వెళ్లి, 5 నుండి 10 నిమిషాల పాటు శరీరంలోని భాగాలన్నిటిమీద, మాడుపై భాగం నుండి కాలి వేళ్ళ వరకు మనో నేత్రంతో చూస్తూ రిలాక్స్ అవ్వాలి. దీని వలన ఆయా అవయవాలకు సాంత్వన, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ ,యోగా ఫౌండేషన్ -
యువకుడి ఆత్మహత్య
పిఠాపురం టౌన్ : బతుకు పోరాటంలో అలసిపోయాడు. జీవితంలో స్థిరపడాలనుకున్న అతడికి అడుగడుగునా ఎదురుదెబ్బలే తగిలాయి. ఇక ఎవరినీ నిందించడం ఇష్టంలేక తనువు చాలించాడు. జీవితంలో నిలదొక్కుకుంటానన్న నమ్మకం లేక, మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పాలపర్తి వెంకట సత్యనారాయణ(27) కొంతకాలంగా స్థానిక ఈశ్వరనగర్లో అద్దెకు ఉన్నాడు. ఉప్పాడ రైల్వేగేటు సమీపంలో పాలు అమ్ముతూ జీవితం గడిపేవాడు. అంతకుముందు చాలాచోట్ల పనిచేసినప్పటికీ, ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాడు. దాంతో షాపులో ఉన్న ఇనుపగొట్టానికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీవితంపై ఏ ఆశ లేకుండా ఇంతకాలం బతికానని, వ్యాపారంలో స్థిరపడదామనుకున్నా.. అది కూడా చేజారిపోయిందని అందులో సత్యనారాయణ పేర్కొన్నాడు. ఎవరినీ నిందించలేని పరిస్థితిలో, తన చేతకానితనం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. -
సర్జరీ చేస్తే... బరువు పెరుగుతారా?
నా వయసు 37. పెళ్లయ్యింది. ఓ పాప కూడా ఉంది. రెండేళ్ల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. పీరియడ్స్ సమస్యలు కూడా తలెత్తడంతో డాక్టర్‌ను సంప్రదించాను. గర్భసంచిలో పెద్ద కణితి ఉందని అన్నారు. ప్రమాదకర పరిస్థితి అని చెప్పి గర్భసంచిని తొలగించారు. ఆ తర్వాత నాకు ఆరోగ్య సమస్యలైతే పెద్దగా ఏమీ లేవు. కానీ బాగా లావైపోతున్నాను. 67 కిలోలు ఉండేదాన్ని, ఇప్పుడు 79 కిలోలకు చేరుకున్నాను. డైట్ కంట్రోల్ చేసినా పెద్దగా తగ్గడం లేదు. ఆపరేషన్ చేస్తే అలాగే లావవుతారు అంటున్నారు మావాళ్లు. నిజమేనా? ఇలా బరువు పెరగడం ప్రమాదకరం కాదా? ఇప్పుడు నేనేం చేయాలి? - వి.పూర్ణిమ, కరీంనగర్ గర్భాశయం తొలగించడం వల్లనే బరువు పెరగడం ఉండదు. పెద్ద ఆపరేషన్ అయ్యిందని చాలామంది చాన్నాళ్లపాటు పని చెయ్యకుండా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, బలహీనపడకుండా ఉండాలని ఆహారం ఎక్కువగా తీసుకోవడం వంటివి చేయడం వల్ల లావు పెరగ వచ్చు. లేదా మీ విషయంలో థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత లేదా ఇంకా వేరే ఏమైనా సమస్యలున్నాయేమో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకొని, కారణాన్ని బట్టి మందులు వాడి చూడొచ్చు. కేవలం డైటింగ్ చేయడం వల్ల లావు తగ్గరు. మూడు పూటలా పరిమితమైన ఆహారం... అంటే ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు తీసుకుంటూ, అన్నం, చపాతీలు తక్కువగా తీసుకోవడం, నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం అన్నమాట. మొత్తంగా తిండి బాగా తగ్గించేసి కూర్చుంటే నీరసం తప్పితే, లావు తగ్గడం కష్టం. ఎక్కువగా నడక, యోగా, వ్యాయామాలు చెయ్యడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి క్యాలరీలు ఖర్చయ్యి బరువు తగ్గుతారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, బీపీ, షుగర్ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. నా వయసు 23. పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. వాడు పుట్టిన తర్వాత కాపర్-టి వేయించుకున్నాను. మొదట బానేవుంది. కానీ తర్వాత ఏదో అసౌకర్యంగా అనిపించసాగింది. ఒక్కోసారి చురుక్కు చురుక్కుమంటోంది. డాక్టర్‌కు చూపిస్తే చెకప్ చేసి అంతా బాగానే ఉందన్నారు. కానీ ఇప్పటికీ అదే ఇబ్బంది. ఎప్పుడూ అలా ఉండటం లేదు కానీ ఒక్కోసారి ఉన్నట్టుండి అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? నేనేం చేయాలి? ఇది తీయించేసుకుంటే కుటుంబ నియంత్రణకు మరో మంచి మార్గమేదైనా ఉందా? - సావిత్రి, యానాం కాపర్-టి లేదా లూప్... టీ ఆకారంలో ఉండే సన్నని ప్లాస్టిక్ ముక్క మీద కాపర్ తీగలు చుట్టబడి ఉండే ఒక కుటుంబ నియంత్రణ సాధనం. దానికి చివర్లో తోకలాగా సన్నటి వెంట్రుక పోగు వంటి దారాలు వేళాడుతుంటాయి. దీన్ని గర్భాశయంలోకి పంపించడం జరుగుతుంది. దానికి వేళాడే సన్నటి దారాలను కొద్దిగా ఉంచి కత్తిరించడం జరుగుతుంది. ఆ దారాలు గర్భాశయ ముఖద్వారం నుంచి యోని లోపల భాగంలోకి వేళాడుతుంటాయి. వీటి ద్వారా కాపర్-టి వేసిన తర్వాత, చెకప్‌లతో కాపర్-టి గర్భాశయంలో ఉందా లేదా అనేది పరీక్షించి నిర్ధారణ చెయ్యడం జరుగుతుంది. ఇది కరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు... లోపల ఏదో ఉందనే భావన లేదా గుచ్చుకోవడం ఉండదు. బాగా లోపలికి వేళ్లు పెడితే, ఆ దారాలు కొద్దిగా చేతికి తగులుతాయి తప్ప, ఇంక వేరే ఫీలింగ్ ఏమీ ఉండదు. అలా నెలకొకసారి సొంతంగా చూసుకోవడం వల్ల కూడా కాపర్-టి లోపల ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కలయికలో కూడా గుచ్చుకోవడం వంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కొన్నిసార్లు కాపర్-టి కిందికి జరిగినప్పుడు ఆ దారాలు కూడా జారి కలయిక సమయంలో యోని లోపల గుచ్చుకున్నట్లు అనిపించవచ్చు. మీకు చెకప్‌లో అంతా సరిగానే ఉందని చెప్పారు కాబట్టి, ఇబ్బంది కూడా ఎప్పుడో ఒకసారి కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కాపర్-టి కాకుండా తాత్కాలికంగా పిల్లలు పుట్టకుండా ఉండటం కోసం, నెలనెలా కుటుంబ నియంత్రణ మాత్రలు (oral contraceptive pills) ఉంటాయి. పీరియడ్ మొదలైన మూడో రోజు నుంచి 21 రోజుల పాటు రోజుకొకటి చొప్పున, మర్చిపోకుండా రాత్రిపూట... అదే సమయంలో వేసుకోవాలి. లేదా మీవారు కండోమ్స్ వాడొచ్చు. ఇవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. లేదా మూడు నెలలకోసారి మెడ్రాక్సి ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్ (medroxyprogesterone injection) తీసుకోవచ్చు. ఇవి ఎక్కువ డోసులు తీసుకుంటే, చాలామందిలో బ్లీడింగ్ క్రమం తప్పడం, మధ్యమధ్యలో స్పాటింగ్ కనిపించడం, తర్వాత కాలంలో పీరియడ్స్ చాలాకాలం రాకుండా ఆగిపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ఏ పద్ధతి అయినా... వారి వారి శరీరతత్వాన్ని బట్టి వాటి పనితీరు ఉంటుంది.