personal things
-
లవ్ స్టోరీ చెప్పిన భార్య: తొలి బిడ్డను కోల్పోయాం.. వివేక్‌రామస్వామి భావోద్వేగం
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన, పారిశ్రామికవేత్త,భారతీయ సంతతికి చెందిన వివేక్ గణపతి రామస్వామి తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ఈక్రమంలో అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో భార్య అపూర్వ, కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తి త జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను వివేక్‌ను ట్విటర్లో షేర్ చేశారు. తన భార్యకు గర్భం దాల్చి మూడున్నర నెలలకే గర్భస్రావం జరిగిందని ఇది తమకు చాలా బాధకరమైన క్షణమని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలి బిడ్డను కోల్పోవడతో రెండోసారి కూడా ఆ భయం వెంటాడిందన్నారు. కానీ ఆ భగవంతుడిమీద విశ్వాసంతోనే ధైర్యాన్ని తెచ్చు కున్నామని, అలా కార్తీక్ , అర్జున్ వచ్చారని తమ జీవితాల్లోరావడంతో సంతోషం నిండిందంటూ అయోవాలోని ఫ్యామిలీ లీడర్ థాంక్స్ గివింగ్ ఫ్యామిలీ ఫోరమ్‌లో రామస్వామి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. I haven’t spoken publicly about the loss of Apoorva and my first child—it’s difficult for us to talk about it. Apoorva and I draw strength from our faith in God and are so blessed to be the parents to our two sons Karthik and Arjun. pic.twitter.com/x2qzWqrxS5 — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 17, 2023 తన విశ్వాసమే తన స్వేచ్ఛ ను ఇచ్చిందనీ అదే ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నడిపించిందని చెప్పుకొచ్చాడు. దేవుడు ఒక్కడే అని తాను విశ్వసిస్తానన్నారు. అలాగే తల్లితండ్రుల పెంపకం, వారి పట్ల గౌరవం వివాహం, ఇతర సాంప్రదాయ విలువల్ని వారి నుంచి నేర్చుకున్నానన్నారు. హిందూ విశ్వాసం, సిద్ధాంతాలు, క్రైస్తవ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నేర్చుకున్న క్రైస్తవ విలువల మధ్య సారూప్యాన్ని ప్రస్తావించారు. ఇవి మతపరమైన సరిహద్దులను అధిగమించి ఉన్నతమైన దైవిక శక్తికి చెందినవని పేర్కొన్నారు. అటు రామస్వామి భార్య అపూర్వ కూడా తమ ప్రేమ ఎలా మొదలైందీ పంచుకున్నారు. తొలుత ఒక కాలేజీ పార్టీలో కలుసుకున్నామని తెలిపారు. మెడ్ స్కూల్లో ఉండగా, వివేక్ అక్కడ న్యాయ విద్యార్థిగా ఉన్నారు. అక్కడ వివేక్‌ను చూశాను...చాలా ఆసక్తికరమైన వ్యక్తిగా అనిపించాడు. వెంటనే వెళ్లి వివేక్‌ను పరిచయం చేసుకున్నానని కానీ అపుడు వివేక్ పెద్ద ఆసక్తి చూపించలేదన్నారు. కానీ అప్పటినుంచి తరచు కలుసుకుంటూ, తాము పరస్పరం ఎంత దగ్గరి వారిమో గుర్తించాం. అప్పటినుంచీ కలిసే ఉన్నామని తెలిపారు. కాగా వివేక్ రామస్వామి తండ్రి వీజీ రామస్వామి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి గీతా రామస్వామి వృద్ధులకు సంబంధించిన జీరియాట్రిక్ సైకియాట్రిస్టు. భార్య అపూర్వ సర్జన్. యేల్ విశ్వవిద్యాలయంలో పరిచయం వీరి పెళ్లికి దారితీసింది. 2015లో అపూర్వ తివారీని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2023 ఆగస్టు నాటి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం వివేక్ రామస్వామి సంపద విలువ 95 కోట్ల అమెరికన్ డాలర్లకు పైమాటే. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024 మంగళవారం జరగనున్నాయి. Voters in Iowa want to know the story how Apoorva and I met. Here’s how. 😉 📍 Osceola, IA pic.twitter.com/N7duPToNlO — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 19, 2023 -
నేను రాజకీయాల్లోకి రాకూడదా?
కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే గుజరాతీ భామ నమిత. అభిమానులను మచ్చాన్స్(బావలు) అంటూ ముద్దుగా పిలుస్తూ కవ్వించే ఆమె ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ సందడి చేస్తుంది. ఈ సుందరి కొంతకాలంగా తమిళసినిమాలకు దూరం కావడంతో అభిమానులు కలత చెందారు. అందుకు కారణం ఆమె స్థూలకాయమే. చాలా ఒత్తిడికి గురైన నమిత ఇప్పుడు మళ్లీ చిక్కి చక్కగా తయారైంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. సినీ, వ్యక్తిగత విషయాల గురించి నమితతో ‘సాక్షి’ భేటీ.. - తమిళ సినిమా ప్ర : రీఎంట్రీ మలయాళంలో అయినట్లున్నారే? జ : నేనెక్కడికి వెళ్లినా, ఏ సినిమాతో రీఎంట్రీ అయినా తమిళనాడు బావల మనసుల్లో పదిలంగా ఉండిపోతాను. శరీరం లావెక్కడంతో నటించడానికి ఎవరూ పిలవలేదు. కొంచెం పరిచయం ఉన్నవాళ్లు కూడా ఎక్కడ అవకాశాలు అడుగుతానో అని తప్పించుకుతిరుగుతున్నారు. అప్పుడే ఇక విషయం అర్థమైంది. నేను చాలా చాలా బరువెక్కాను. నాలో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుందిగా అని ఆలోచించాను. ఎక్సర్సైజ్ ద్వారా 94 కిలోల బరువున్న నేను 76కు తగ్గాను. స్లిమ్‌గా తయారవడంతో మలయాళంలో పులిమురుగన్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్ర : భోజనం ఫుల్‌గా లాగించేవాళ్లా? జ : అవును. తమిళంలో నేను నటించిన చివరి చిత్రం ఇళంజన్. అది విడుదలై సుమారు ఐదున్నరేళ్లు అవుతోంది. ఈ మధ్యలో అవకాశాలు లేకుండా ఖాళీగా కూర్చోలేదు. తెలుగు, కన్నడ భాషలలో నటిస్తూనే ఉన్నాను. నాకు నచ్చిన తమిళంలో సక్సెస్ కాలేకపోయాననే చింత వెంటాడుతూనే ఉండేది. అలా ఒత్తిడికి లోనై ఆహార నియమాలను పక్కన పెట్టి బిరియాని, పిజ్జా, ఐస్‌క్రీమ్, అన్నం అంటూ ఏదిపడితే అది లాగించేశాను. ఆ తర్వాత చూసుకుంటే బరువు సరాసరిగా పెరిగిపోయింది. చాలా భయపడిపోయాను. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రయత్నంతోనే ఇదిగో ఇలా స్లిమ్‌గా తయారయ్యాను. ప్ర : నిర్మాతగా మారనున్నారట? జ : ఇది నిజంగా జోకే. ఎవరు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి వదంతులను. నాకు చిత్ర నిర్మాణ ఆలోచనే లేదు. సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎలా చెయ్యాలో తెలియదు. నాకు తెలిసిందల్లా నటన ఒక్కటే. అది సరిగా చేస్తే చాలని భావిస్తాను. ప్ర : బాక్సింగ్ నేర్చుకున్నారట? జ : ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అలాంటి సమయాల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాను. అలా స్టంట్ క్లాస్‌కు వెళ్లి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాతే నాకు తెలియకుండానే నాలో ధైర్యం పెరిగింది. అంతేకాదు యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలనే కోరిక పెరిగింది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ప్ర : తమిళనాడు నచ్చిందా? జ : చాలా బాగా నచ్చేసింది. అందుకేగా గుజరాత్ నుంచి వచ్చేసి చెన్నైలో సెటిల్ అయిపోయాను. ఇకపై ఇదే నా పుట్టినిల్లు. ఇప్పుడు గుజరాత్లో ఏయే పండుగలు చేసుకుంటున్నారన్నది కూడా మరచిపోయాను. తమిళనాడులో జరుపుకునే పండుగలన్నీ నాకు తెలుసు. నాకు బాగా నచ్చిన పండుగ పొంగల్. ఈ పొంగల్‌ను ఏదైనా పల్లెటూరుకెళ్లి జరుపుకోవాలనుకుంటున్నాను. ప్ర : రాజకీయరంగ ప్రవేశం ఆలోచనలో ఉన్నారట? జ: ఏం నేను రాజకీయాల్లోకి రాకూడదా? భారత దేశంలో ఇప్పుడున్న రెండు పెద్ద రాజకీయ పార్టీల వారు నన్ను తమ పార్టీలో చేరమని రాయబారం పంపుతున్నారు. వారికి నేనింకా ఏమీ చెప్పలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తా. ఏ పార్టీలో చేరతానన్నది మీకు అప్పుడే తెలుస్తుంది. ప్ర : సరే పెళ్లి సంగతేమిటి? జ : దాంతో ఇప్పుడు అవసరం లేదు. ఇప్పటివరకూ నేనెవరినీ ప్రేమించలేదు. ఇకపై ఏమి జరుగుతుందో తెలియదు.