perugu ramakrishna
-
అంతర్జాతీయ స్థాయిలో తెలుగుకవులకు స్థానం
సాక్షి, నెల్లూరు(వీఆర్సీసెంటర్): అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు కవులకు స్థానం లభించడం తెలుగు వారందరికీ గర్వకారణమని సుప్రసిద్ధకవి, జిల్లా వాసి డాక్టర్ పెరుగు రామకృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన దక్షిణాసియా కవిత సంకలనంలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల్లో ఒకరైన శివారెడ్డికి సోమవారం నెల్లూరు నగరంలో పెరుగు రామకృష్ణ సంపాదకీయం వహించి, వెలరించిన ‘దిపొయెట్రి ఆఫ్ సౌత్ ఏసియా’ పుస్తకాన్ని శివారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పెరుగు మాట్లాడుతూ తొమ్మిది దేశాల కవుల సరసన ఇద్దరు తెలుగు కవులు శివారెడ్డి, పాపినేని శిశంకర్ నిలవడం అభినందనీయమన్నారు. సార్క్ దేశాల కవులు రాసిన 53 కవితల్లో వీరి కవితలు కూడా ఉండడం తెలుగువారందరికీ గర్వకారణమ న్నారు. తెలుగుభాష కన్వీనర్ కూడా అయిన శివారెడ్డి రాసి ప్రచురించిన కవితలతో వారికి తెలుగుకవుల ప్రతిభాపాటవాలు ఇతర భాషా కవులకు తెలియవచ్చిందని పేర్కొన్నారు. -
స్వచ్ఛభారత్‌కు సాహిత్య ప్రచారం
కోట: విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమంపై జాతీయ స్థాయి కవిసమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, కవి పెరుగు రామక్రిష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛభారత్‌కు ప్రచారం కల్పించడంలో తమవంతు పాత్ర పోషించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు కవులు తెలిపారు. ఈ సందర్భంగా పెరుగు రామక్రిష్ణ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ద్వారా సామాజిక సమైక్యత సాధించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నుంచి మోహన్, కర్ణాటక నుంచి రమేష్, తమిళనాడు నుంచి షణ్ముఖం, ఏపీ నుంచి సరోజినీదేవి, పలువురు ఎన్బీకేఆర్ విద్యార్థులు తమ రచనలను తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ విజయకుమార్‌రెడ్డి, స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ సుస్మితారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పెరుగు రామకృష్ణకు సత్కారం
నెల్లూరు(బారకాసు): స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన స్వాతంత్ర సప్తతి కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన కవి పెరుగు రామకృష్ణ సత్కారం పొందారు. స్వాతంత్య్ర సమరయోధులకు కన్నీటి అభిషేకం చేస్తూ ఆయన రెండు కవితలు చదివి అందరి మన్ననలు పొందారు. కవితల పఠనంతో పాటు గజల్స్, గానంతో అందరినీ అలరించారు. అనంతరం ఆయనను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఘనంగా సత్కరించారు.