స్వచ్ఛభారత్‌కు సాహిత్య ప్రచారం
కోట: విద్యానగర్ ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమంపై జాతీయ స్థాయి కవిసమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, కవి పెరుగు రామక్రిష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛభారత్‌కు ప్రచారం కల్పించడంలో తమవంతు పాత్ర పోషించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు కవులు తెలిపారు. ఈ సందర్భంగా పెరుగు రామక్రిష్ణ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ద్వారా సామాజిక సమైక్యత సాధించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నుంచి మోహన్, కర్ణాటక నుంచి రమేష్, తమిళనాడు నుంచి షణ్ముఖం, ఏపీ నుంచి సరోజినీదేవి, పలువురు ఎన్‌బీకేఆర్ విద్యార్థులు తమ రచనలను తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ విజయకుమార్‌రెడ్డి, స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ సుస్మితారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.