pesky calls
-
విసిగిస్తున్న కాల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో టెలికం శాఖ, ఆర్థిక సర్వీసుల విభాగం, గృహ .. పట్టణ వ్యవహారాల శాఖ, రిజర్వ్ బ్యాంక్, బీమా రంగ నియంత్రణ .. అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ), టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సహా పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మరోవైపు, అవాంఛిత కాల్స్ అనేవి యూజర్ల గోప్యతకు మాత్రమే కాకుండా వారి హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల సంస్థలు.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించినట్లు తెలిపింది. అంతే కాకుండా కస్టమర్లను పోంజీ స్కీములు, క్రిప్టో పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు స్పామ్ కాలర్లు ఇప్పుడు వాట్సాప్ మొదలైన యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తున్నట్లు వివరించింది. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల నుంచి స్పామ్ మెసేజీలు, అవాంఛిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు టెలికం శాఖ, ట్రాయ్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. -
ఇబ్బంది పెట్టే కాల్స్, సందేశాలకు చెక్!
న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించేందుకు పలు టెక్నాలజీపై పనిచేస్తున్నట్టు టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ ప్రకటించింది. ఆర్థిక మోసాల నివారణకు ఇతర నియంత్రణ సంస్థలతో కలసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపింది. ‘‘అనుచిత వాణిజ్య సంప్రదింపులు లేదా ఇబ్బంది పెట్టే సంప్రదింపులు అన్నవి ప్రజలను ఎక్కువగా అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. నమోదు కాని టెలీ మార్కెటర్ల (యూటీఎం)కు వ్యతిరేకంగా అధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పలు అనుచిత సందేశాలు కూడా పెరిగాయి. వీటితో పాటు ఇబ్బంది పెట్టే కాల్స్‌ను కూడా ఒకే రీతిలో చూడడమే కాకుండా, పరిష్కారం కనుగొనాల్సి ఉంది’’అని ట్రాయ్ పేర్కొంది. అనుమతి లేని వాణిజ్య సంప్రదింపులకు చెక్ పెట్టేందుకు పలు భాగస్వామ్య సంస్థలో కలసి చర్యలు తీసుకోనున్నట్టు ట్రాయ్ తెలిపింది. -
ఆర్థిక మోసాలపై డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్‌తో పాటు టెలికం వనరుల ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేయడంపై టెలికం శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ యూనిట్‌ను, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ‘అనవసర కాల్స్, మెసేజీలతో టెలికం యూజర్లను వేధిస్తూ, నిబంధనలను ఉల్లంఘిస్తున్న టెలీమార్కెటర్లు, ఇతరత్రా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. టెలికం వనరులను ఉపయోగించుకుని సామాన్యుడి కష్టార్జితాన్ని దోచేసే ఆర్థిక మోసాలు కూడా జరుగుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు‘ అని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాల కట్టడి కోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) ఏర్పాటవుతుంది. -
టెలికం ఆపరేటర్లతో ట్రాయ్ చర్చలు
న్యూఢిల్లీ: త్వరలోనే ఆపరేటర్లతో సమావేశంకానున్నట్లు టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) వెల్లడించింది. వినియోగదారులకు ఇబ్బందికరంగా మారిన అనుచిత వాణిజ్య కాల్స్ (పెస్కీ కాల్స్), మెసేజ్‌లకు సంబంధించి తాము రూపొందించిన నిబంధనలపై సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) లేవనెత్తిన పలు అభ్యంతరాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. నూతన నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థల ఏర్పాటు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగానికి టెలికం ఆపరేటర్స్ అసోసియేషన్ చెబుతున్న ప్రతికూల అంశాలపై చర్చిండం కోసం వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తమ అధికారును కోరినట్లు వెల్లడించారు. ‘రెగ్యులేటర్లు చెబుతున్న దానికి, ఆపరేటర్లు అర్థం చేసుకుంటున్న వాటికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఉండవచ్చు. నిబంధనల అమలుకు బహుశా కొన్ని సమస్యలు ఉండవచ్చు. అనుచిత వాణిజ్య కాల్స్, మెసేజ్‌ల అంశాన్ని తీవ్రమైనదిగానే పరిగణించాలే తప్ప నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఆపరేట్లతో చర్చించి సమస్యలు ఎక్కడ ఉన్నయో చూడాలి. కంపెనీలపై అనవసరపు భారం లేకుండా సమస్యను అధిగమించాల్సి ఉంది.’ అని అన్నారు. ట్రాయ్ నూతన నిబంధనల కారణంగా సుమారు రూ.200–400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, పూర్తి వ్యవస్థ ఏర్పాటుకు కనీసం ఏడాదిన్నర సమయం అవసరమని సీఓఏఐ వివరించిన విషయం తెలిసిందే. -
ఏడు పెద్ద బ్యాంకుల నుంచి అవాంఛిత కాల్స్
న్యూఢిల్లీ: ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో సహా మొత్తం ఏడు బ్యాంకులు అవాం ఛిత కాల్స్ చేస్తున్నాయని ఫిర్యాదులొచ్చాయని టెలికాం నియంత్రణ సంస్థ, ట్రాయ్ సోమవారం తెలిపింది. ఈ విషయమై వారం రోజుల్లో సరైన వివరణ ఇవ్వకుంటే ఆయా బ్యాంకుల టెలిఫోన్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిటీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా ఈ జాబితాలో ఉన్నాయని వివరించింది. ఈ బ్యాంకులన్నీ నమోదు కాని టెలిమార్కెటీర్స్ నంబర్ల ద్వారా తమ సర్వీసులు, స్కీమ్‌ల గురించి ప్రచారం చేస్తున్నాయని వివరించింది. అవాంఛిత కాల్స్‌పై గత నెలలో కఠిన నిబంధనలను ట్రాయ్ జారీ చేసింది.