న్యూఢిల్లీ: ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో సహా మొత్తం ఏడు బ్యాంకులు అవాం ఛిత కాల్స్ చేస్తున్నాయని ఫిర్యాదులొచ్చాయని టెలికాం నియంత్రణ సంస్థ, ట్రాయ్ సోమవారం తెలిపింది. ఈ విషయమై వారం రోజుల్లో సరైన వివరణ ఇవ్వకుంటే ఆయా బ్యాంకుల టెలిఫోన్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిటీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా ఈ జాబితాలో ఉన్నాయని వివరించింది. ఈ బ్యాంకులన్నీ నమోదు కాని టెలిమార్కెటీర్స్ నంబర్ల ద్వారా తమ సర్వీసులు, స్కీమ్‌ల గురించి ప్రచారం చేస్తున్నాయని వివరించింది. అవాంఛిత కాల్స్‌పై గత నెలలో కఠిన నిబంధనలను ట్రాయ్ జారీ చేసింది.