Pet Care Centers
-
అందుబాటులో పెట్ కేర్ సేవలు
దేశంలోనే ప్రప్రథమంగా టెక్ ఆధారిత ఓమ్నిచానెల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ సికింద్రాబాద్‌లో తన ఎక్సీ్పరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసింది. పెట్ కేర్ సర్వీస్ ప్రారంభించిన సందర్భంగా గురువారం ఎక్సీ్పరియన్స్ సెంటర్లోని వెటర్నరీ కన్సల్టెంట్ డాక్టర్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. పెట్స్ 24/7 సురక్షితంగా ఉండేందుకు పెట్ కేర్ సేవలు చాలా కీలకమన్నారు. ఒకే చోట సంపూర్ణ సంరక్షణ (పోషకాహారం, వస్త్రధారణ, వైద్య మద్దతు) తాము అందిస్తామని, దీని ద్వారా పెట్ లవర్స్ ఆదరణ పొందగలమని, తమ సేవలు వారికి ఉపకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వచ్చే రెండేళ్లలో పెంపుడు శునకాల మార్కెట్ ఎంతంటే..
ఇంటికి వెళ్లగానే బుజ్జి అడుగులతో ప్రేమగా మీదకు దూకే చిన్న కుక్కపిల్లని చూడగానే అప్పటివరకూ పడిన శ్రమ అంతా మర్చిపోతాం. అందుకే వాటికి అచ్చం మనుషుల్లానే చూసుకుంటాం. ఎంత టెన్షన్లో ఉన్నా వాటిని చూడగానే ఆంతా ఆవిరైపోతుంది. అయితే పెట్‌డాగ్స్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్, వాటికి వేసే బట్టలు, వాటికి వాడే క్యాస్టుమ్స్, వైద్యం..ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతుంది. వచ్చే రెండేళ్లలో పెట్‌డాగ్స్ ద్వారా దేశంలో దాదాపు రూ.6వేల కోట్లు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్ సర్వీస్ కిందకు వస్తాయి. పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి. కొందరు ఆన్లైన్లో లేదా స్టోర్‌లో పెట్ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు. స్టూడియోలో లేదా మంచి లొకేషన్లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు. యజమానులు, ఇంటికి వచ్చేవారితో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్‌కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదీ చదవండి: 25 ఏళ్లలో తొలిసారి.. చైనాలో ఏం జరుగుతుందంటే దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా 6లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.2వేలకోట్లు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 13.9% వృద్ధి చెందుతోంది. 2025 నాటికి దాదాపు రూ.6వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పెట్‌డాగ్స్ సంఖ్య ఈ కింది విధంగా ఉంది. Top 10 countries with the most pet dogs#PetDogs #DogLovers #CanineCompanions pic.twitter.com/YNicdDGUx7 — Global Ranking (@Top1Rating) October 13, 2023 -
ఖరీదైనా పెంచుకుంటున్నారు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుక్క, పిల్లి, పక్షి.. పెంపుడు జంతువు ఏదైనా వీటి మీద మనుషులకు ఉన్న ప్రేమ పెట్ కేర్ రంగ కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. భారత్‌లో పెంపుడు జంతువుల సంరక్షణ (పెట్ కేర్) విపణి రూ.8,000 కోట్లుంది. ఇందులో సగం వాటా పెట్ ఫుడ్ కైవసం చేసుకుంది. మిగిలిన వాటా భద్రత, పోషణ, వ్యాయామం, వైద్య సంరక్షణ వంటి సేవలు దక్కించుకున్నాయి. కోవిడ్–19 మహమ్మారి పుణ్యమా అని ఒత్తిడి, నిరాశ నుంచి బయటపడేందుకు పెంపుడు జంతువులను పెంచుకునే ట్రెండ్ అధికం అయింది. ఈ నేపథ్యంలో 2025 నాటికి పరిశ్రమ రూ.10,000 కోట్లను దాటుతుందని అంచనా. దేశవ్యాప్తంగా 3 కోట్ల పైచిలుకు పెంపుడు జంతువులు ఉన్నట్టు సమాచారం. వీటి సంఖ్య ఏటా 11% పెరుగుతోంది. పోటీలో దిగ్గజాలు.. పెట్ ఫుడ్ విభాగం ఏటా 20 శాతం వృద్ధి చెందుతోందని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెబుతోంది. పెట్ కేర్ రంగంలో మార్స్ పెట్‌కేర్, హిమాలయ వెల్నెస్ కంపెనీలు అగ్ర స్థానంలో ఉన్నాయి. ప్యూరినా పెట్‌కేర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా నెస్లే ఈ రంగంలోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. క్యానిస్ లుపస్ సర్వీసెస్ ఇండియాలో పెట్టుబడి చేస్తున్నట్టు ఇమామీ ప్రకటించింది. వేగంగా వృద్ధి చెందుతున్న పెట్ కేర్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని మార్స్ పెట్‌కేర్ ఎండీ సలీల్ మూర్తి తెలిపారు. పెడిగ్రీ, విస్కాస్ వంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న మార్స్ పెట్‌కేర్ హైదరాబాద్ ప్లాంటు విస్తరణకు రూ.500 కోట్ల పెట్టుబడి చేస్తోంది. కాస్మోస్ ఫిల్మ్స్ జిగ్లీ బ్రాండ్‌తో ఈ రంగంలో అడుగుపెట్టింది. లక్షలు వెచ్చిస్తున్నారు.. పెంపుడు జంతువుల కొనుగోళ్ల విషయంలో భారత్‌లో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. పెట్స్‌లో కుక్కల వాటా అత్యధికంగా 75 శాతం ఉంది. పిల్లులు 15 శాతం, పక్షులు 10 శాతం వాటా కైవసం చేసుకున్నాయని సమాచారం. షిడ్జూ కుక్క పిల్ల, ఆస్ట్రేలియన్ కాకటియెల్ పక్షులకు డిమాండ్ ఎక్కువ. రంగు రంగుల్లో లభించే పక్షుల అమ్మకాలే అధికం. బ్లూ–గోల్డ్ మకావ్ చిలుకలు రూ.2 లక్షల నుంచి, స్కార్లెట్ మకావ్ రూ.18 లక్షల వరకు లభిస్తాయి. ఒక మీటర్ దాకా పొడవు ఉండే హయసింత్ మకావ్ ఖరీదు రూ.40 లక్షల వరకు ఉంది. సవన్నా పిల్లుల జతకు బెంగళూరులో ఓ కస్టమర్ రూ.50 లక్షలు, మరో కస్టమర్ కొరియన్ మాస్టిఫ్ కుక్కకు రూ.1 కోటి వెచ్చించారని అమ్మూస్ పెట్స్, కెన్నెల్స్ ఫౌండర్ మహమ్మద్ మొయినుద్దీన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘విదేశాల నుంచి పెట్స్ దిగుమతిపై నిషేధం ఉంది. దేశీయంగానే వీటిని పెంచుతున్నారు. కోవిడ్ సమయంలో డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడి వీటి ధరలు రెండింతలయ్యాయి. రంగు, ఆకారం, ఆరోగ్య స్థితినిబట్టి ధర నిర్ణయం అవుతోంది’ అని తెలిపారు. సెలబ్రిటీల్లో క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సినీ నటుడు రామ్‌చరణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెట్స్ ప్రేమికుల జాబితా పెద్దదే. -
ఈ తోడు అవసరమే!
వాయనం పెంపుడు జంతువుల పేరు చెబితేనే ముఖాలు చిట్లిస్తారు కొందరు. వాటికి చాకిరీ చేయలేం అంటారు. బోలెడంత ఖర్చు అని ఫీలవుతుంటారు. అయితే వీటితో నష్టం కంటే లాభమే ఎక్కువ. భర్త ఆఫీసుకు వెళ్లిపోయాక, పిల్లలు స్కూలుకెళ్లిపోయాక... ఇంట్లో ఉండే మహిళలకు మంచి తోడు ఎవరైనా ఉంటారు అంటే, అవి పెంపుడు జంతువులే. ఇంట్లో ఓ కుక్కో, పిల్లో ఉంటే ఆ సందడే వేరు. ఇంట్లో ఓ కుక్క ఉంటే అంతకంటే పెద్ద రక్షణ మరొకటి ఉండదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు, భర్త ఏ క్యాంపుకో వెళ్లి ఒంటరిగా పిల్లలతో ఉండాల్సి వచ్చినప్పుడు అదే పెద్ద సెక్యూరిటీ. నిజానికి పిల్లి కూడా బాగా మచ్చికవుతుంది, యజమాని పట్ల ప్రేమగా ఉంటుంది. కుక్కయితేనేమి, పిల్లి అయితేనేమి... ఏదో ఒక తోడును ఉంచుకోవడం మంచిదే. పెట్ని పెంచమంటే... ఇన్ని పనుల్లో ఇదో పనా అని కొందరు మహిళలు విసుక్కుంటారు. నిజానికది పెద్ద పనేమీ కాదు. నేర్పిస్తే అవి కూడా క్రమశిక్షణ నేర్చుకుంటాయి. ఎక్కడ తినాలి, ఎక్కడ పడుకోవాలి, విసర్జన చేయాలనిపించినప్పుడు తమకు ఎలా తెలియజేయాలి వంటివన్నీ వాటికి నేర్పించవచ్చు. వ్యాక్సిన్లకు తప్ప పెద్ద ఖర్చూ ఉండదు. వాటికి పడనివి ఏమున్నాయో డాక్టర్ని అడిగి తెలుసుకుని, అవి తప్ప మిగతావన్నీ తినడం అలవాటు చేయవచ్చు. ఏ ఊరో వెళ్తే, పెట్ కేర్ సెంటర్లు ఉన్నాయి... పిల్లలకు క్రష్‌లు ఉన్నట్టుగా. నిర్ణీత రుసుము చెల్లించి, అక్కడ వదిలి వెళ్లవచ్చు. ఆ మధ్య కెనడాలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోతే, పెంపుడు పిల్లి నీళ్ల బాటిల్ తెచ్చి ఆమె ముఖమ్మీద ఒంపి లేపింది. ఆస్ట్రేలియాలో ఓ అమ్మాయి వీల్ చెయిర్లోంచి జారి కొలనులో పడిపోతే, పెంపుడు కుక్క రోడ్డు మీద పోతున్న వ్యక్తిని తీసుకొచ్చింది. మన దేశంలోనే ఓ చిలుక ఇంటి నుంచి నగలు దోచుకుపోయిన దొంగలను పట్టించింది. ముంబైలో ఓ ఒంటరి మహిళ మీద ఎవరో అఘాయిత్యం చేయబోతే, పెంపుడు కుక్క అతడిని చీల్చి చెండాడింది. ఇంత ఉపయోగం ఉన్నప్పుడు... కాసింత ఖర్చు, కొద్దిపాటి శ్రద్ధ పెట్టడానికి ఇబ్బంది పడితే ఎలా! ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఓ ‘పెట్’ తోడు ఎంతైనా అవసరం. ఓసారి ఆలోచించండి!