Petition court
-
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
-
ఎన్ఎస్ఓపై యాపిల్ కేసు
రిచ్మండ్: దిగ్గజ కంపెనీ యాపిల్ వివాదాస్పద స్పైవేర్ పెగాసస్‌ను రూపొందించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూపును కోర్టుకు లాగింది. ఐఫోన్ లాంటి తమ ఉత్పత్తుల్లోకి పెగాసస్‌ను జొ ప్పించకుండా నిరోధించాలని కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేసింది. ‘అత్యంత అధునాతన సైబర్ నిఘా సాంకేతికత సహాయంతో ఎన్ఎస్ఓ ఉద్యోగులు అనైతిక చర్యలకు పాల్పడే కిరాయి సైనికులుగా మారారని ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా కొద్దిసంఖ్యలో ఐఫోన్లపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారని పేర్కొంది. ప్రభుత్వాల అండతో పనిచేసే ఎన్ఎస్ఓ లాంటి గ్రూపులు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా... మిలియన్ల కొద్ది డాలర్లను అత్యాధునిక నిఘా వ్యవస్థ అభివృద్ధికి వెచ్చిస్తాయి. ఇది మారాలి’ అని యాపిల్ సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడెరిఘి కోర్టుకు విన్నవించారు. తాము ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం లేదని, కేవలం ప్రభుత్వాలకు మా త్రమే తమ ఉత్పత్తులను అమ్ముతున్నామని ఎన్ఎస్ఓ వాదిస్తోంది. విపక్షనాయకులు, మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు తదితరులపై పెగాసస్ ద్వారా భారత ప్రభుత్వం నిఘా పెట్టిందనే ఆరోపణలు రావడంతో తీవ్ర దుమారం రేగడంతో దీనిపై సుప్రీంకోర్టు ముగ్గురు సాంకేతిక నిపుణులతో దర్యాప్తు కమిటీని వేయడం తెలిసిందే. -
సుప్రీంకోర్టులో సజ్జన్ కుమార్ పిటిషన్
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవశిక్ష ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సజ్జన్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో సిక్కుల తరఫు న్యాయవాది హెచ్.ఎస్.ఫూల్కా మీడియాతో మాట్లాడుతూ.. సిక్కుల ఊచకోత వ్యవహారంలో తాము గతంలోనే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. దీంతో సజ్జన్ కుమార్ పిటిషన్‌పై కోర్టు రిజిస్ట్రీ ద్వారా తమకు సమాచారం అందిందన్నారు. -
ఓటరు జాబితాలో లోపాలున్నాయి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో దాదాపు 70 లక్షల ఓటర్లకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయని, అందువల్ల కుదించిన ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసి, ముందుగా జారీచేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో జనవరి 1, 2019వ తేదీ ప్రామాణికంగా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా, దానిని రద్దు చేస్తూ 2018 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా స్వల్పకాలిక ఓటరు నమోదు షెడ్యూలును జారీచేసిందని, 4 నెలల కాలంలో సరిదిద్దాల్సిన ఓటరు జాబితాను నాలుగు వారాలకు కుదించిందని, ఈ సమయం సరిపోదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మొద టి ప్రతివాదిగా చేర్చారు. 70 లక్షల ఓటర్లకు సం బంధించి అవకతవకలున్నాయని, తాము బలమైన సాక్ష్యాధారాలను ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించామని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనం దాల్చిందన్నారు. వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. -
రాష్ట్రపతి పాలనకు ఆదేశించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో శాసనసభ ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరిగేందుకు వీలుగా రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. తాము 18 ఏళ్లు నిండినప్పటికీ 2018 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకోవడం వల్ల ఓటు హక్కు కోల్పోతున్నామని పోతుగంటి శశాంక్‌రెడ్డి, ఆర్.అభిలాష్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాతావరణం ఉండాలంటే రాష్ట్రపతి పాలనే శరణ్యమని పిటిషన్లో తెలిపారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ను చేర్చారు. న్యాయవాది ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీకి అనుకూలమని.. తెలంగాణ శాసనసభ ఎన్నికలు సాధారణ షెడ్యూలు ప్రకారం జరిగితే 20 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు పొంది వినియోగించుకునేవారని, కానీ కేంద్ర ఎన్నికల సంఘం అర్ధంతరంగా ఓటర్ల నమోదు షెడ్యూలును కుదించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ‘శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా ముందస్తుగా సభ రద్దు చేస్తూ మంత్రిమండలి సిఫారసు చేయగలదా? ఏ అత్యవసర పరిస్థితి లేకున్నా సభ అభిప్రాయాన్ని తెలుసుకోకుం డానే ఇలా రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అధికార పార్టీకి సానుకూల సమయమని చెప్పి ఓటర్ల నమోదుకు 2018 జనవరి 1ని అర్హత తేదీగా ప్రకటించడం స్వేచ్ఛ గా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడమవుతుం దా?ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి పాలనకు ఎందుకు సిఫారసు చేయదు?’ వంటి ప్రశ్నలను పిటిషన్లో లేవనెత్తారు. ‘రద్దు’పై న్యాయ సమీక్ష జరపాలి తెలంగాణ ఎన్నికలు 4 రాష్ట్రాలతో పాటే వస్తాయని, తాను ఎన్నికల సంఘంతో మాట్లాడానని సీఎం ప్రకటన చేశారని పిటిషనర్లు ఆక్షేపించారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను ఏపీలో విలీనం చేయగా సం బంధిత ఓటరు జాబితాను ఇప్పటికీ సవరించలేదని వివరించారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబి తాలో చేర్చేలా ఆదేశాలివ్వాలని, కొత్తగా 20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేని రీతిలో అసాధారణంగా అసెంబ్లీని రద్దు చేయడంపై న్యాయ సమీక్ష జరపాలని.. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిం చేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. -
వాగా చిత్రానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్
తమిళసినిమా: వాగా చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. వివరాల్లోకె ళితే విక్రమ్‌ప్రభు హీరోగా నటించిన చిత్రం వాగా. విజయ భార్గవి ఎంటర్టైన్మెంట్ పతాకంపై మన్నన్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 12న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా నాగర్‌కోయిల్‌కు చె ంది న రూపన్ అనే వ్యక్తి వాగా చిత్ర నిర్మాతపై చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందు లో ఆయన పేర్కొంటూ వాగా చిత్ర నిర్మాణం కోసం విజయ భార్గవి ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత మన్నన్ తన వద్ద రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. అందుకు 15 నెల లుగా అసలు గానీ వడ్డీ గానీ తిరిగి చెల్లించలేదని పేర్కొన్నా రు. ఇటీవల అప్పు చెల్లించ మని కోరగా ఆగస్టు 5వ తేదీన ఇ స్తానని చెప్పి అన్న మాట ప్రకారం డబ్బు తిరిగి ఇవ్వలేద ని తెలిపారు. వాగా చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదలైందని.. చిత్రం విడుదలైతే తనకు రావలసిన డబ్బు తిరిగి వచ్చే వీలు లేకపోవడంతో అప్పు చెల్లించాల్సిందిగా ఆదేశించాలని లేదా తన డబ్బు తిరిగి ఇచ్చే వరకూ వాగా చిత్ర విడుదలపై నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ మంగళవారం విచారణకు రానుంది.