petrolium and diesel
-
ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!
పెట్రోలియం, జెమ్‌స్టోన్ (రత్నాలు), చక్కెర, ఆగ్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతం అవుతోంది. గడిచిన ఐదేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల వాటా పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 నుంచి 2023 మధ్య కాలంలో వీటితోపాటు ఎలక్ట్రికల్ గూడ్స్, న్యూమాటిక్ టైర్లు, ట్యాప్‌లు, వాల్వ్‌లు, సెమీకండక్టర్ పరికరాల ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం..2023లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 85 బిలియన్ డాలర్ల(రూ.7.09 లక్షల కోట్లు)కు పెరిగాయి. ఈ రంగంలో అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి 6.45 శాతంగా ఉంటే, 2023 నాటికి 12.59 శాతానికి పెరిగింది. 2018లో పెట్రోలియం ఉత్పత్తుల పరంగా ఐదో అతిపెద్ద దేశంగా ఉండగా, 2023 నాటికి మూడో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.విలువైన రాళ్లుప్రీషియస్, సెమీ ప్రీషియష్ (విలువైన రాళ్లు) స్టోన్స్ ఎగుమతుల పరంగా 2018 నాటికి భారత్ వాటా 16.27 శాతం కాగా, 2023 చివరికి 36.53 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ నంబర్1 స్థానానికి చేరింది. 2023లో 1.52 బిలియన్ డాలర్ల విలువైన తర్నాలను భారత్ ఎగుమతి చేసింది. 2018లో ఎగుమతులు కేవలం 0.26 బిలియన్ డాలర్లుగానే (అంతర్జాతీయంగా రెండో స్థానం) ఉన్నాయి.చక్కెర ఎగుమతులుచెరకు లేదా చక్కెర ఎగుమతుల పరంగా అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి ఉన్న 4.17 శాతం నుంచి 2023లో 12.21 శాతానికి చేరింది. చక్కెర ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఆగ్రోకెమికల్, పురుగు మందులుఆగ్రోకెమికల్, పురుగు మందుల ఉత్పత్తుల ఎగుమతులతో అంతర్జాతీయంగా భారత్ వాటా 8.52 శాతం నుంచి 10.85 శాతానికి పెరిగింది. 2023 చివరికి ఎగుమతులు 4.32 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలు భారత్‌కు కలిసొస్తున్నాయి. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?రబ్బర్ టైర్ల ఎగుమతులురబ్బర్ న్యూమాటిక్ టైర్ల ఎగుమతులు 2018లో 1.82 బిలియన్ డాలర్లుగా ఉంటే 2023 చివరికి 2.66 బిలియన్ డారల్లకు పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్ వాటా 2.34 శాతం నుంచి 3.31 శాతానికి చేరింది.సెమీకండక్టర్లుసెమీకండక్టర్, ఫొటోసెన్సిటివ్ పరికరాల ఎగుమతులు 2018లో కేవలం 0.16 బిలియన్ డాలర్లుగానే ఉండగా, 2023 నాటికి 1.91 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి..
రియాద్: వచ్చే ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకున్న భారత్‌లో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ సౌదీ అరేబియా కంపెనీలను ఆహ్వానించారు. ఈ రంగంలో 100 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్ పెట్టుబడుల సదస్సు(ఎఫ్ఐఐ) 2019లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. మౌలిక రంగంపై రూ. 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రా రంగంలో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులను కల్పించే క్రమంలో పన్ను రేట్లను, మేధోహక్కుల విధానాలను సంస్కరించినట్లు చెప్పారు. నైపుణ్యాలను మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని.. వచ్చే 3–4 ఏళ్లలో 40 కోట్ల మందిని వివిధ రంగాల్లో సుశిక్షితులుగా తీర్చిదిద్దనున్నామని ఆయన పేర్కొన్నారు. విధానాల్లో అసమానతలతోనే అనిశ్చితి.. భారత్, సౌదీ అరేబియా వంటి భారీ వర్ధమాన దేశాల దిశపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆధారపడి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. బహుళపక్ష వాణిజ్య విధానాల్లో అసమానతల వల్లే ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ వంటి పెద్ద వర్ధమాన దేశాల బాటపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎక్కువగా ఆధారపడి ఉంది. గత నెల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కూడా చెప్పినట్లు.. సమష్టిగా వృద్ధి సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నాం. జీ20 కూటమిలో.. అసమానతలు తగ్గించేందుకు, నిలకడగా అభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భారత్, సౌదీ అరేబియా కలిసి పనిచేస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక మందగమన ప్రభావాలను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. భారత్, సౌదీ అరేబియా ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టాయని చెప్పారు. ‘వ్యాపారాలకు అనువైన పరిస్థితులు నెలకొల్పేందుకు, ప్రపంచ వృద్ధికి .. స్థిరత్వానికి చోదకంగా నిల్చేందుకు భారత్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సౌదీ అరేబియా కూడా తమ విజన్ 2030 సాధనలో భాగంగా సంస్కరణల ఎజెండాను అమలు చేస్తుండటం సంతోషించదగ్గ విషయం‘ అని ప్రధాని చెప్పారు. 15 బిలియన్ డాలర్ల డీల్స్ మూడు రోజుల ఎఫ్ఐఐ సదస్సులో భాగంగా తొలిరోజున సుమారు 15 బిలియన్ డాలర్ల విలువ చేసే 23 పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్లు సౌదీ అరేబియన్ జనరల్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఎస్‌ఏజీఏఐ) వెల్లడించింది. తమ దేశంలో పెట్టుబడులకు గల భారీ అవకాశాలకు ఇది నిదర్శనమని పేర్కొంది. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా భారీ స్థాయిలో ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తోందని ఎస్‌ఏజీఐఏ గవర్నర్ ఇబ్రహీం అల్–ఒమర్ తెలిపారు. మందగమనం తాత్కాలికం: ముకేశ్ అంబానీ భారత్‌లో మందగమనం తాత్కాలికమని, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంస్కరణలతో రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడగలవని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ‘భారత ఎకానమీ స్వల్పంగా మందగించింది. కానీ, ఇది తాత్కాలికమే. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్రమంగా ఫలితాలనిస్తాయి. వచ్చే క్వార్టర్ నుంచి మందగమన ధోరణి కచ్చితంగా మారుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ, యువ జనాభా, నాయకత్వం వంటి అంశాల్లో రెండు దేశాలకు చాలా సారూప్యతలు ఉన్నాయని .. వృద్ధి సాధనకు ఇవి దోహదపడగలవని పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా అంబానీ తెలిపారు. -
భారత్ నేపాల్ మధ్య పెట్రొలియం పైప్‌లైన్ ప్రారంభం
-
పోలీసులకే దిమ్మతిరిగే దొంగతనం
సాక్షి, న్యూఢిల్లీ : అతి తెలివి తేటలతో దొంగలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డట్లు వారి పనైంది. సాధారణంగా దొంగలు పెట్రోల్ చోరికి పాల్పడటం అరుదు. అలాంటివి జరిగినా ఏ బైక్‌ల నుంచో లేదంటే ఎవరూ లేని సమయంలో బంక్‌ల నుంచో దొంగతనం చేసిన సందర్బాలుంటాయి. కానీ, ఢిల్లీలో మాత్రం కొందరు దొంగలు ఏకంగా భూగర్భాన వెళుతున్న అతిపెద్ద పెట్రోల్ పైపు నుంచి పెట్రోల్ తోడేద్దామనుకున్నారు. చిన్నసొరంగంలాంటిదాన్ని తవ్వి పైపుకు కన్నం చేసి ఆయిల్ తీసే క్రమంలో కాస్త బాంబు పేలుడిలాంటి శబ్దంతో బద్దలైంది. వారి గుట్టుచప్పుడుకాకుండా చేద్దామనుకున్న పనికాస్త రట్టయింది. వివరాల్లోకి వెళితే.. నైరుతి ఢిల్లీలోని కక్రోలాలో జూబీర్ అనే వ్యక్తి అయిల్ దొంగతరం చేయడానికి కొంతమందితో కలిసి ప్లాన్ చేసుకున్నాడు. ఇండియన్ అయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) కు చెందిన అండర్ గ్రౌండ్ పైపు లైన్‌ను తమ దొంగతనానికి ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలోనే ఓ గది తీసుకొని అందులో నుంచి పైపులైన్‌కు సొరంగం లాంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయిల్ పైప్ లైన్‌కు గ్యాస్ కట్టర్ సహాయంతో పైప్‌లైన్‌కు రంధ్రం చేసి, పెట్రోలు దొంగిలించడం మొదలుపెట్టారు. అయితే, ఇది పెద్ద పైపులైన్ కావడం, అందులో నుంచి తీవ్ర ఘాడత గల వాయువులు బయటకు రావడంవంటివి జరుగుతున్న క్రమంలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటన జరగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం అర్థమైంది. అలాగే, దానికి దగ్గర్లో కొంత మేర ఇంధనం నింపిన ట్రక్‌ని కూడా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఆందోళన బాటలో పెట్రోలియం డీలర్లు
ఆదివారం అర్ధరాత్రి నుంచి ఒకరోజు సమ్మె విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్న పెట్రోలు, డీజిల్ డీలర్లు పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా బంకులన్నింటినీ బంద్ చేయాలని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తీర్మానించింది. ఆరు మాసాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై నాలుగు శాతం వ్యాట్ విధించింది. దీన్ని ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్లు వ్యతిరేకిస్తూ పలుమార్లు సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు శాతం వ్యాట్ విధించటం వల్ల లారీల యజమానులు పక్క రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారని ఆ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. మన రాష్ట్రంలో వ్యాట్ వల్ల పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్నాటకలకు వెళ్లి లారీ యజమానులు డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,400 బంకుల్లో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. ఏపీలో ఆరు మాసాలుగా 40 శాతం డీజిల్ అమ్మకాలు తగ్గిపోయి పక్క రాష్ట్రాలకు పెరిగాయని వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి మొదటి హెచ్చరికగా రాష్ట్రంలో ఒకరోజు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చుంచు నరసింహారావు హెచ్చరించారు.