PG medical admissions
-
పీజీ మెడికల్ ప్రవేశాలకు ‘స్థానికత’ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై విద్యార్థులు కోర్టుకు ఎక్కడంతో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. కోర్టు కేసు తేలాకే ప్రవేశాలుంటాయని కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే వారు తెలంగాణలో జరిగే పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికేతరులు అవుతుండటంతో వివాదం నెలకొంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించిన పీజీ మెడికల్ నోటిఫికేషన్ ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే వరుసగా నాలుగు సంవత్సరాలకు తక్కువ కాకుండా తెలంగాణలో చదివి ఉండాలి. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదివిన రాష్ట్ర విద్యార్థులు కూడా స్థానికులే అవుతారని వర్సిటీ పేర్కొంది. ఈ విధానం వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. వారు ఎక్కడా స్థానికులు కాని పరిస్థితి నెలకొంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల్లో టాప్ ర్యాంకర్లు ఎక్కువగా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. అలా జాతీయ విద్యాసంస్థల్లో చదివిన వారు రాష్ట్రంలో పీజీ మెడికల్ అడ్మిషన్లలో అన్యాయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు. ఇక కౌన్సెలింగ్ తరువాయి అనగా.. ఈ ఏడాది పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ బాగా ఆలస్యమైంది. ఎట్టకేలకు గత నెలాఖరున 2024–25 సంవత్సరానికి కనీ్వనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాళోజీ వర్సిటీకి, నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. నీట్ పీజీ–2024లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి గత నెల 31 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ‘స్థానికత’నిబంధనపై అభ్యర్థులు కోర్టుకు ఎక్కడంతో నిలిచిపోయింది. కోర్టు కేసు తేలాకే తదుపరి ప్రక్రియ జరుగుతుందని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాప్యం కేవలం ప్రవేశాలు పొందే విద్యార్థులకే కాకుండా... ప్రస్తుతం మొదటి సంవత్సరం కోర్సు పూర్తి చేసిన పీజీ విద్యార్థులకు సైతం ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. జూనియర్లు ప్రవేశాలు పొందితే తప్ప వారు అక్కడ్నుంచి రిలీవ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. 50% జాతీయ కోటాతోనూ అన్యాయం! స్థానిక కోటాతోపాటు తెలంగాణ విద్యార్థులకు నేషనల్ పూల్ కింద జాతీయ స్థాయికి వెళ్లే సీట్లలోనూ అన్యాయం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో 26 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,800 పీజీ మెడికల్ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 50 శాతం జాతీయ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని తెలంగాణ వాసులకు కేటాయిస్తారు. ఈ క్రమంలో జాతీయ కోటా కిందకు దాదాపు 600 సీట్లు వెళ్తాయి. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లను జాతీయ కోటా నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ ఎక్కువగా అవకాశం పొందుతున్నారని వారంటున్నారు. ఎంబీబీఎస్‌లో నేషనల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో మాత్రం ఏకంగా సగం కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ కోటాలో నింపే మన రాష్ట్రంలోని 600 పీజీ మెడికల్ సీట్లలో దాదాపు 300 ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ వర్గాలు సైతం చెబుతున్నాయి. -
వైద్య పీజీ సీట్ల భర్తీకి గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీ కోసం ఆగస్టు 31 వరకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్త ర్వులు జారీ చేసింది. కనీస అర్హత నిబంధనల సడలింపులపై భారత వైద్య మండలి (ఎంసీఐ), నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎన్ఈబీ)కి నివేదించుకోవాలని పేర్కొంది. కరోనా కారణంగా వైద్య విద్య పీజీ కోర్సుల్లో సీట్లు భర్తీ కాకపోవడంతో అర్హత నిబంధనలు సడలించి మిగిలిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని, భర్తీకి గడువు పొడిగించాలని కోరుతూ తెలంగాణ ప్రైవేటు మెడికల్ అండ్ డెంటల్ కళాశాల యాజమాన్యాల సంఘం తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం జస్టిస్ రోహింటన్ ఫాలీనారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె.వి.విశ్వనాథన్, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. 2020–21 విద్యా సంవత్సరానికి వైద్య విద్యకు సంబంధించి పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు కనీస అర్హత నిబంధనలు సడలించాలని, నీట్ పీజీ కటాఫ్ మార్కులు తగ్గించడంగానీ, కనీస మార్కుల అర్హత నిబంధన తొలగించడంగానీ చేయా లని కోరారు. కాంపిటెంట్ అథారిటీ, మేనేజ్మెంట్ కోటాల్లో సీట్లు భర్తీ కానందున గడువు పొడిగించాలని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ప్రస్తుత విద్యాసంవత్సరం సీట్ల భర్తీ గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కనీస అర్హత నిబంధనలైన నీట్ ఉత్తీర్ణత వంటి నిబంధనలను సడలించేందుకు అధీకృత సంస్థలైన ఎంసీఐ, ఎన్‌ఈబీకి అధికారం ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది చేసి న వ్యాఖ్యలతో ఏకీభవించిన ధర్మాసనం.. తగిన ఉత్తర్వుల కోసం ఆయా సంస్థలను సంప్రదించొచ్చని ఉత్తర్వులు జారీచేసింది. అన్ని రాష్ట్రాలకు ఆగస్టు 31 వరకు.. ఇదే రకమైన అభ్యర్థనతో బిహార్ కళాశాలలు, రాజస్తాన్ ప్రభుత్వం కూడా అభ్యర్థన దాఖలు చేశాయి. ఆయా కేసుల్లో వెలువడిన ఉత్తర్వులు, తెలంగాణ కేసులో వెలువడిన ఉత్తర్వుల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో భర్తీకి గడువును ఆగస్టు నెలాఖరుకు పొడిగిస్తూ ఎంసీఐ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆర్.కె.వత్స్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కీలక నిర్ణయం..!
సాక్షి, వరంగల్ : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ ప్రవేశాలకు నీట్ అర్హత మార్కులు తగ్గించింది. నీట్ కటాఫ్ మార్కులను కేంద్రం 6 పర్సెంటైల్ తగ్గించిన నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు. పీజీ వైద్య ప్రవేశాలకు కటాఫ్ మార్కులు తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో సీట్లభర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు గురువారంనోటిఫికేషన్ విడుదల చేసింది. మే 10 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మే13న ధృవపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, పీ.జీ.ఆర్.ఆర్.సీ.డి.ఈ లో ఏర్పాటు చేసిన సెంటర్‌కు హాజరు కావాలని వెల్లడించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in ను సంప్రదించాలని సూచించింది. పర్సంటైల్ తగ్గించిన కేంద్రం.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ 2019-20 ఏడాదికిగాను పీజీ కటాఫ్ మార్కులను 6 పర్సెంటైల్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనరల్ అభ్యర్థులు 44 పర్సంటైల్ 313 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి 34 పర్సెంటైల్ 270 మార్కులు, దివ్యాంగులకు 39 పర్సెంటైల్ 291 మార్కులుగా కటాఫ్ నిర్ణయించింది. -
విద్యార్థులను మేం చేర్చుకోం
- తిప్పి పంపిన కాలేజీలు - ప్రహసనంగా మారిన ‘ప్రైవేటు’ వైద్య అడ్మిషన్లు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య అడ్మిషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులను చేర్చుకునేందుకు మంగళవారం ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తిరస్కరించాయి. ప్రవేశాలకు బుధవారమే చివరి తేదీ కావడం, కళ్ల ముందే సీటు పోయే పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు కన్నీరుమున్నీ రవుతున్నారు. యాజమాన్యాలేమో ఫీజులను పెంచకపోతే పీజీ కోర్సులను నడ పలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఫీజుల పెంపుపై స్టేను ఉపసంహరించాలంటూ హైకోర్టులో అవి వేసిన పిటిషన్‌పై గురువారం తీర్పు వచ్చే అవకాశముంది. సుప్రీంకోర్టులో ఓ కాలేజీ యాజమాన్యం వేసిన పిటిషన్‌పై బుధవారమే తీర్పు రావచ్చంటున్నారు. ఫీజులు పెంచకుంటే పీజీ కోర్సులను కొనసాగించలేమని ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు అన్నారు. ‘‘హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. అక్కడా అదే జరిగితే ఈ ఏడాది పీజీ వైద్య కోర్సులను నిలిపేస్తాం. మరో గత్యంతరం లేదు మాకు’’ అని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. కాలేజీలు విద్యార్థులను చేర్చుకోక పోతే ఏం చేయాలో ఆలోచిస్తున్నామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. గడువు పెంచబోమన్న ఎంసీఐ తొలి విడత కౌన్సిలింగ్ తర్వాత మిగిలి పోయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు, ప్రైవేటులో కన్వీనర్ కోటా సీట్లకు ఇటీవల రెండో విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడం తెలిసిందే. సీట్లు దక్కిన విద్యార్థులకు చేరేందుకు మంగళ, బుధ వారాలు సమయమిచ్చారు. ప్రైవేటులో కన్వీనర్ కోటా కింద ఉన్న 368 పీజీ సీట్లల్లో చేరేందుకు మంగళవారం కాలేజీల కు వచ్చిన విద్యార్థులను యాజమాన్యాలు చేర్చుకోలేదు. వివరాలు నమోదు చేసుకుని పంపించారు. పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా ముగించాల్సి ఉంది. ఆ గడువును పొడిగించబోమని ఎంసీఐ తాజాగా స్పష్టం చేసింది. కానీ ఇప్పటికి రెండో విడత కౌన్సిలింగే అయియింది. సీట్లు మిగిలితే మూడు, నాలుగు విడతల కౌన్సిలింగ్ కూడా జరగాల్సి ఉంటుంది. పైగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషన్ కోటా సీట్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించి సర్టిఫికేట్లు తనిఖీ చేసి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. ఇదంతా ఎప్పటికి జరుగుతుందన్నది అంతుబట్టడం లేదు. -
7 నుంచి పీజీ మెడికల్ ప్రవేశ దరఖాస్తులు
విజయవాడ : 2015-16 విద్యా సంవత్సరంలో పీజీ మెడికల్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 7 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రిజిస్ట్రార్ చెప్పారు. మెడికల్ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా), పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు కలిపి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలకు 7 నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వర్సిటీ రిజిస్ట్రార్ చెప్పారు. దరఖాస్తు చేసుకునే విధానం, ప్రవేశ పరీక్ష ఫీజు వివరాలతో హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈసారి డెబిట్/క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రవేశ పరీక్ష ఫీజును చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లించిన వారికి సెల్‌ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా గుర్తింపు నంబరు వస్తుంది. దీనిద్వారా ఆన్లైన్లో దరఖాస్తు పూర్తిచేసిన ప్రింటును, సంబంధిత సర్టిఫికెట్లను గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి 'ది కన్వీనర్, పోస్టుగ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కమిటీ, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్, ఏపీ విజయవాడ' చిరునామాకు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పోస్టు ద్వారా లేదా స్వయంగా అందజేయాలి. వివరాలను http://ntruhs.ap.nic.in వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు. -
తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయండి
జీవో 89ను రద్దు చేయాల్సిందే.. మూడో రోజుకు చేరిన ప్రవీణ దీక్ష హైదరాబాద్ : విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్(ఎండీఎస్) పీజీ మెడికల్ అడ్మిషన్లలో తెలంగాణ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ ప్రవీణానాయక్ చేపట్టిన నిరాహార దీక్ష సోమవారానికి మూడో రోజుకు చేరింది. దీక్షకు గిరిజన ఉద్యోగ సంఘం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గిరిజన సంఘం, ఏఐఎస్ఎఫ్లు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా జీవో నంబరు 89ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రవీణ్‌నాయక్ మాట్లాడుతూ పీజీ మెడికల్ ఎంట్రెన్స్‌లో తనకు ఎస్టీ కోటాలో రాష్ర్టంలో ప్రథమ ర్యాంకు, ఓపెన్ కేటగిరిలో 216వ ర్యాంకు వచ్చినా.. సీమాం ధ్ర అధికారులు తనకు సీటు ఇవ్వలేదని ఆరోపించారు.