PG semister exams
-
ఇప్పుడు వద్దు
పీజీ పరీక్షలు వాయిదాక విద్యార్థుల డిమాండ్ రెండు రోజులుగా ఆందోళన రాస్తారోకో: అరెస్టు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 14 నుంచి నిర్వహించనున్న పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని రెండు రోజులుగా విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం రాత్రి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆందోళన చేసిన విద్యార్థులు శనివారం ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి... ధర్నాకు పూనుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీజీవీపీకి చెందిన 10 మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పీజీ సెమిస్టర్ పరీక్షల విషయంలో రిజిస్ట్రార్ ప్రొ.సురేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఓయూ క్యాంపస్‌తో పాటు అనుబంధ, ప్రైవేటు కళాశాలల్లో సిలబస్ పూర్తి కాలేదని తెలిపారు. అధికారులు పరీక్షలను వాయిదా వేయక పోతే తామే బహిష్కరించి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. క్యాలెండర్ ప్రకామే: రిజిస్ట్రార్ ఓయూ పీజీ విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరు కావాలని రిజిస్ట్రార్ ప్రొ.సురేష్ కుమార్ కోరారు. పరీక్షలను అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 14 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. వాయిదాలతో విద్యార్థులు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. గైర్హాజరైన విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించబోమని తేల్చి చెప్పారు. -
పోలీసు పహారాలో ఓయూ క్యాంపస్..
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పోటాపోటీగా నిర్వహించ తలపెట్టిన వివిధ రకాల జంతువుల మాంసం పండుగల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు ఈ నెల 10న నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌కు, ఇతర విద్యార్థి సంఘాలు నిర్వహించనున్న పంది మాంసం పండుగలకు అనుమతి లేదని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుండా తూర్పు మండల పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఓయూకు అదనపు బలగాలను రప్పించి కీలక ప్రాంతాలలో పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 14 నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజా పరిస్థితులతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.