పోలీసు పహారాలో ఓయూ క్యాంపస్.. | police security tighten in OU campus | Sakshi
Sakshi News home page

పోలీసు పహారాలో ఓయూ క్యాంపస్..

Published Fri, Dec 4 2015 9:37 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

పోలీసు పహారాలో ఓయూ క్యాంపస్.. - Sakshi

పోలీసు పహారాలో ఓయూ క్యాంపస్..

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పోటాపోటీగా నిర్వహించ తలపెట్టిన వివిధ రకాల జంతువుల మాంసం పండుగల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు ఈ నెల 10న నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌కు, ఇతర విద్యార్థి సంఘాలు నిర్వహించనున్న పంది మాంసం పండుగలకు అనుమతి లేదని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుండా తూర్పు మండల పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఓయూకు అదనపు బలగాలను రప్పించి కీలక ప్రాంతాలలో పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 14 నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజా పరిస్థితులతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement