ఇప్పుడు వద్దు | exams not now | Sakshi
Sakshi News home page

ఇప్పుడు వద్దు

Published Sun, Dec 13 2015 3:12 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

ఇప్పుడు  వద్దు - Sakshi

ఇప్పుడు వద్దు

పీజీ పరీక్షలు వాయిదాక విద్యార్థుల డిమాండ్
రెండు రోజులుగా ఆందోళన రాస్తారోకో: అరెస్టు
ఉస్మానియా యూనివర్సిటీ:
  ఓయూ పరిధిలో ఈ నెల 14 నుంచి నిర్వహించనున్న పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని రెండు రోజులుగా విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం రాత్రి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆందోళన చేసిన విద్యార్థులు శనివారం ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి... ధర్నాకు పూనుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీజీవీపీకి చెందిన 10 మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పీజీ సెమిస్టర్ పరీక్షల విషయంలో రిజిస్ట్రార్ ప్రొ.సురేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఓయూ క్యాంపస్‌తో పాటు అనుబంధ, ప్రైవేటు కళాశాలల్లో సిలబస్ పూర్తి కాలేదని తెలిపారు. అధికారులు పరీక్షలను వాయిదా వేయక పోతే తామే బహిష్కరించి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
 
 క్యాలెండర్ ప్రకామే: రిజిస్ట్రార్
 ఓయూ పీజీ విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరు కావాలని రిజిస్ట్రార్ ప్రొ.సురేష్ కుమార్ కోరారు. పరీక్షలను అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 14 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. వాయిదాలతో విద్యార్థులు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. గైర్హాజరైన విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించబోమని తేల్చి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement