700 ‘జీవీకే’ ఔషధాలపై ఈయూ నిషేధం
బెర్లిన్ : ఫార్మా రీసెర్చ్ సంస్థ జీవీకే బయోసెన్సైస్ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై 700 జనరిక్ ఔషధాల విక్రయాలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిషేధించింది. ఆగస్టు 21 నుంచి ఇది అమల్లోకి వస్తుందని జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసిన్స్ అండ్ మెడికల్ ప్రోడక్ట్స్ తెలిపింది. నిర్దేశిత తేదీ తర్వాత వీటిని ఫార్మా కంపెనీలు, డీలర్లు, మెడికల్ హాల్స్, అవుట్‌లెట్స్‌లో విక్రయించకూడదని పేర్కొంది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జీవీకే బయోసెన్సైస్ 2004-2014 మధ్య నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో అవకతవకలు జరిగాయని ఫ్రెంచ్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఏఎన్ఎస్ఎం) తనిఖీల్లో తేల్చింది. దీంతో ఆ ట్రయల్స్ ఆధారంగా మార్కెటింగ్ అనుమతులు లభించిన 1,000 జనరిక్ ఔషధాలను ఈయూ కమిటీ పరిశీలించిన మీదట నిషేధం నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలను జీవీకే బయోసెన్సైస్ ఖండించింది.