ఫిరంగిపురం క్వారీ ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
గుంటూరు : ఫిరంగిపురం క్వారీ ఘటనపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాగా ఈ రోజు ఉదయం ఫిరంగిపురం కొండల్లో అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో.. కొండ చరియలు, రాళ్లు, మట్టిపెళ్లలు మీదపడి ఆరుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకు చెందినవారు.
కాగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. కాగా, క్వారీ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు... మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.