Physical problem
-
‘అమ్మో’రికా!
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే ఏకైక సూపర్ పవర్.. ఏకధ్రువ ప్రపంచంలో ఒకే ఒక్క అగ్రరాజ్యం.. ఆ దేశ పౌరులంటే ఇంటా బయటా గౌరవం, ఆకాశహర్మ్యాల్లాంటి భవంతులు.. బహుళజాతి సంస్థలు.. వాటిలో మంచి ఉద్యోగాలు.. భారీ వేతనాలు.. అద్భుతమైన కెరీర్.. మనకు తెలిసిన, ఊహించుకునే అమెరికా ఇది. అయితే వాస్తవాలు వేరుగా ఉన్నాయి.. అక్కడా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో అమెరికన్లను తీవ్ర ‘ఆర్థిక’ ఒత్తిడి చుట్టుముడుతోంది. దీంతో వారిలో మానసిక, శారీరక సమస్యలు పెరుగుతున్నాయి.బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోవడానికి కూడా.. అమెరికాలో మాంద్యం ప్రభావంతో ‘ఆర్థిక’ ఒత్తిడులు పెరుగుతున్నాయి. సగం మంది అమెరికన్లు తమ జీవితంలో అత్యంత ఆర్థిక భయాన్ని అనుభవిస్తున్నారు. డబ్బులు లేని స్థితిని పదేపదే గుర్తు చేసుకోలేక బ్యాంకు ఖాతాలను కూడా తనిఖీ చేసుకోవడానికి వెనుకాడుతున్నారు. తమ జీవన వ్యయంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులకు సర్దుబాటు కాలేక తీవ్ర మానసిక సమస్యల బారినపడుతున్నారు. ఈ మేరకు మార్కెట్ వాచ్ గైడ్స్ చేపట్టిన సర్వేలో నిత్యావసరాల కోసం అవుతున్న అధిక ఖర్చులు తమ బడ్జెట్‌ను తారుమారు చేస్తున్నట్టు అమెరికన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల తొలగింపు (లేఆఫ్స్), కొత్త ఉద్యోగాలు రాకపోవడం వంటి కారణాలతో చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. కొంతమంది ఉన్న కొద్ది మొత్తాన్నే జాగ్రత్తగా ఖర్చు చేయాలనే ఆలోచనతో కుటుంబ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండిపోతున్నట్టు తేలింది. ఇలా మానసిక ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెట్టాల్సి వస్తోంది. అమెరికన్లలో ‘ఆర్థిక’ ఒత్తిడికి ప్రధాన కారణాలు..⇒ నిత్యావసరాల ధరల పెరుగుదల ⇒ పొదుపు లేకపోవడం ⇒ తగినంత ఆదాయం లేకపోవడం ⇒ దేశ ఆర్థిక వ్యవస్థ బాగోకపోవడం ⇒ ఇంటి అద్దె ఖర్చు 8 అధిక వడ్డీలు ⇒ పదవీ విరమణకు సంబంధించిన అనిశ్చితి‘ఆర్థిక’ ఒత్తిడి ఇలా..⇒ కొంత స్థాయిలో ఆర్థిక ఒత్తిడిని అనుభవిస్తున్నవారి 88%⇒ ఆర్థికాంశాలే తమ ఒత్తిడికి అతిపెద్ద కారణమని చెప్పినవారు 65%⇒కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ఒత్తిడిని దాచిపెట్టిన వారు 58%⇒ ఆర్థిక సమస్యను సంక్షోభంలా మారే వరకు విస్మరిస్తున్నవారు 44%⇒ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం తమ మానసిక ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నవారు 94%⇒ ఆర్థిక సమస్యను సంక్షోభంలా మారే వరకు విస్మరిస్తున్నవారు 44%⇒ ఆర్థిక ఒత్తిడితో ప్రతికూల శారీరక ప్రభావాలను ఎదుర్కొంటున్నవారు 92%ఒత్తిడికి మూలకారణం ఇదే.. అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు ఆర్థికాంశాలే ఒత్తిడికి ప్రధాన కారణమని చెప్పారు. ముఖ్యంగా యువ అమెరికన్లలో ఒత్తిడి తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ముందు తరాలతో పోలిస్తే 1981–1996 మధ్య జన్మించిన వారిలో ఆర్థిక ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో నివసించేవారు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తక్కువ వేతనాలు ఉండటంతో నిత్యం ఆర్థిక సమస్యల బారినపడుతున్నారు. మరోవైపు కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టడం కూడా ప్రతికూలంగా మారుతోంది.ప్రభుత్వ, సాంకేతిక రంగాల్లో 14 నెలల గరిష్ట స్థాయికి ఉద్యోగుల తొలగింపు చేరుకుంది. చాలా మంది ఆర్థిక సమస్యలు సంక్షోభంగా మారేవరకు జాగ్రత్త పడకపోవడంతో తీవ్ర కష్టాల్లో కూరుకుపోతున్నారు. అతిగా ఖర్చు చేసే అలవాటు ఉన్నవారు ఇంకా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్న వారి కంటే.. తిరిగి తీర్చే ప్రణాళిక లేకుండానే అప్పులు చేస్తున్న వారు ఎక్కువగా ఉంటున్నారు.మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..సర్వేలో దాదాపు 41 శాతం మంది ఆర్థిక పరిస్థితులు తమ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్టు అంగీకరించారు. మరో 57 శాతం మంది ఆర్థిక/మానసిక ఆరోగ్యానికి మధ్య ప్రాధాన్యతను తేల్చుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో పురుషులు నిర్ణీత పని గంటలకు మించి వర్క్ చేస్తుంటే.. మహిళలు సమయానికి తిండిలేక, సెలవులు కూడా తీసుకోకుండా పని చేయడంతో శారీరక సమస్యల బారిన పడుతున్నారు. సర్వేలో సగం కంటే ఎక్కువ మంది ఆర్థిక సమస్యల ఒత్తిడితో నిద్రను కోల్పోతున్నామని, తలనొప్పితోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.భయపెడుతున్న నిత్యావసరాల ఖర్చు..అమెరికాలో వ్యవసాయ విభాగం నివేదికల ప్రకారం.. 2022తో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు 11 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. కొన్ని వస్తువుల ధరలు ఇప్పటికీ పెరుగుదలలోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది గుడ్డు ధరలు మరో 4.8 శాతం, బీఫ్ మాంసం ధరలు 3 శాతం కంటే ఎక్కువగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఓవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం.. మరోవైపు అందుకు తగ్గట్టు ఆదాయం లేకపోవడంతో అమెరికన్లు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
చింతల చిరునవ్వులు
ఇప్పటి వరకు స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలు మాట్లాడకుండానే శతాబ్దాలు గడిచిపోయాయి. అలా మాట్లాడకుండా, చర్చించకుండా గుట్టుగా, రహస్యంగా ఉండిపోయిన విషయాల్లో స్త్రీలకు నడివయస్సుతోపాటే నడిచొచ్చే మెనోపాజ్ దశ కూడా ఒకటి. తెల్లవారగానే కుండీల్లో బీర పాదుకి పూచిన పూలను లెక్కేయడం, అరటి చెట్టు మొదళ్లలో పిలకలను ప్రతిరోజూ కొత్తగా తడిమి చూడటం, కిటికీ పక్కన పెద్దకుండీలో మల్లెతీగకి వేసిన చిన్ని మొగ్గలను చూసి కూడా చిన్నపిల్లలా గంతులేయడం, నేను చూడాలనుకుని పెట్టుకున్న ఇంగ్లిష్ సినిమాని ఓ చేత్తో గరిట తిప్పుతూనే, నాతోపాటు హాల్లోకొచ్చి ఏ సీన్‌నీ మిస్ అవకుండా ఆసాంతం చూసిందాకా వదలకపోవడం.. అమ్మను చూసినప్పుడల్లా చిన్నపిల్ల తనా? నేనా? అనే అనుమానం కలిగేది. ఓ రోజు అడిగాను! అమ్మ ప్రతి ఆనందాన్ని ఆస్వాదిస్తూ పెరిగిన నేను ఇప్పుడు హఠాత్తుగా ఆమెలో కనిపిస్తున్న మార్పుని జీర్ణించుకోలేకపోతున్నాను. రెహ్మాన్ సంగీతం, చలం పుస్తకం, బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏదీ ఆమె దృష్టిని కట్టిపడేయలేకపోతోంది. ఏదో తెలియని చిరాకు, ఉన్నట్టుండి ఒళ్లంతా మంటలు అంటుంది, అమ్మ మొహం పైన చిరుచెమటని కూడా చూసి ఎరుగను నేను. అలాంటిది శీతాకాలంలో సైతం తను నిలువెల్లా చెమటతో తడిసిపోవడం నాకాశ్చర్యంగా అనిపించింది. నిద్రలేని రాత్రులతో కళ్ల కింద చారలు అమ్మలో జీవకళనే మాయం చేశాయి. ఓ రోజు మెల్లిగా అడిగాను అమ్మని! అలా చిరాగ్గా ఉంటున్నావేంటమ్మా అని. ఆఫీసులో ఏదైనా ఇబ్బందా? అని కూడా అడిగాను. తల అడ్డంగా ఊపింది అమ్మ. చూసి చూసి ఓ రోజు కాలేజీ నుంచి రాగానే డాక్టరు దగ్గరికెళదామని ఒత్తిడి చేశాను. నా గోల భరించలేక ఆసుపత్రికి వచ్చింది. అప్పుడు బయటపడింది.. అమ్మ ఆందోళనకి మెడికల్ నేమ్ ‘మెనోపాజ్’!! అంత సింపులేం కాదు అదంత పట్టించుకోవాల్సిందేమీ కాదనీ, 45 ఏళ్లు దాటిన అమ్మ ప్రస్తుతం మోనోపాజ్ దశలో ఉందనీ, పీరియడ్స్ ఆగిపోయే దశలో శరీరంలో వచ్చే ఈ మార్పులనే మోనోపాజ్ అంటారనీ డాక్టర్‌గారు చాలా సింపుల్‌గా తేల్చేశారు. కానీ అసలు సమస్య అది కాదు. ఇప్పటి వరకు స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలు మాట్లాడకుండానే శతాబ్దాలు గడిచిపోయాయి. అలా మాట్లాడకుండా, చర్చించకుండా గుట్టుగా, రహస్యంగా ఉండిపోయిన విషయాల్లో స్త్రీలకు నడివయస్సుతోపాటే నడిచొచ్చే మెనోపాజ్ దశ ఒకటి. నిజానికి అది కొంత శారీరక సమస్యే అయినప్పటికీ అంతకన్నా ఎక్కువగా మనస్సుకి సంబంధించిన విషయం. అది ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన శారీరక మార్పులకు కారణం అవుతుంది. ఎంతో మానసిక అశాంతికీ గురిచేస్తుంది. అయితే ఎవరికి వారు దీన్ని చర్చకు అనర్హమైన విషయంగా భావించడం బాధాకరమైన విషయం అని అంటున్నారు రేచల్ వియస్. ‘డెత్ కేఫ్’లా మెనోపాజ్ కేఫ్ మెనోపాజ్‌పై ఇటీవల కొంత చర్చ జరుగుతున్నా యేడాది క్రితం మొదటిసారి బ్రిటన్‌లో స్త్రీల మెనోపాజ్‌ని అర్థం చేసుకొనేందుకు సరికొత్త విధానాన్ని అవలంబించారు. ఒంటరిగా కాకుండా సామూహికంగా ఎదుర్కొనేందుకు ఓ వేదికను ఏర్పాటు చేశారు. అదే మెనోపాజ్ కేఫ్. ఒక్కొక్కరుగా కాక, తనలాంటి ఎంతో మందితో కలిసి ఒక సమూహంగా సమస్యని అధిగమించాలనుకున్నారు. అందులో భాగంగానే 2017లో స్కాట్లాండ్లోని పెర్త్ అనే ప్రాంతంలో రేచెల్ వియస్ అనే మహిళ ఈ మెనోపాజ్ కేఫ్‌ని ప్రారంభించారు. డెత్ కేఫ్ (మరణాన్ని గురించి నిర్భయంగా మాట్లాడుకునే కేఫ్) మోడల్ క్రిస్టీవార్క్స్ తీసిన ‘మెనోపాజ్ అండ్ మి’ అనే బీబీసీ డాక్యుమెంటరీతో స్ఫూర్తి పొందిన రేచల్తో పాటు గెయిల్ జాక్, లోర్నా ఫాథరింఘమ్ తదితరులు స్కాట్లాండ్లోని పెర్త్‌లో తొలిసారిగా మెనోపాజ్ కేఫ్‌ని ఏర్పాటు చేశారు. సాయంసంధ్యలో సెలబ్రేషన్ ఓ మంచి కాఫీని సిప్ చేస్తూనో, ఇష్టమైన చాక్లెట్ కేక్‌ని తింటూనో నడివయస్సులో కలిగే ఈ మార్పులను గురించి మెనోపాజ్ కేఫ్‌లో చర్చించొచ్చు. అక్కడికొచ్చేవాళ్లంతా ఆ విషయాన్ని గురించే మాట్లాడ్డానికి వస్తారు. మధ్య వయస్సులో వచ్చే మతిమరుపుకి కూడా కారణమయ్యే ఈ మెనోపాజ్ ఎన్నెన్ని రకాలో, వాటి పర్యవసానాలేమిటో, వాటిని ఎట్లా అధిగమించవచ్చో అక్కడ చర్చిస్తారు. కానీ ఈ కేఫ్‌కి వచ్చేవాళ్లంతా ఒక్క నిబంధన మాత్రం తప్పనిసరిగా పాటించాలి. అదే... వ్యక్తిగత సమాచార గోప్యత. ఆ గోప్యతని పాటిస్తూనే తమ సమస్యని బహిరంగంగా చర్చించి అధిగమిస్తోన్న యూకే స్త్రీలంతా ఇప్పుడు మేం ఒంటరి వాళ్లం కాదని సగర్వంగా ప్రకటించుకొంటున్నారు. శనివారం సాయంసంధ్యని మెనోపాజ్‌పై లెక్చర్లతో ఫ్లష్ ఫెస్ట్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. – అత్తలూరి అరుణ -
రోల్డ్‌గోల్డ్ నగలతో ర్యాష్ వస్తుంటే...
హోమియో కౌన్సెలింగ్స్ నేను అప్పుడప్పుడూ రోల్డ్‌గోల్డ్ నగలు వేసుకుంటుంటాను. ఈ మధ్య వాటిని వేసుకున్న తర్వాత మెడ భాగంలో, చేతులకు దురద, పొక్కులు వస్తున్నాయి. అదే గోల్డ్ నగలు వేసుకుంటే ఏమీ కాదు. దీనికి కారణం ఏమిటి? హోమియోలో పరిష్కారం చెప్పండి. – సునీత, హైదరాబాద్ మీరు చెప్పిన కారణాలతో చర్మ శోధ రావడం వల్ల కలిగే ఈ పరిణామాన్ని డర్మటైటిస్గా చెప్పవచ్చు. ఇలా జరిగినప్పుడు చర్మం ఎర్రబారి దురద, మంట వస్తాయి. ఇది శారీరకంగా సమస్యగా పరిణమించడంతో పాటు మానసికంగానూ కుంగదీస్తుంది. డర్మటైటిస్‌ను వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి... కాంటాక్ట్ డర్మటైటిస్ : దీన్ని స్పర్శ చర్మశోధగా చెప్పవచ్చు. ఇందులో చర్మంపై సాధారణంగా గులాబి లేదా ఎరుపు దద్దుర్లు వస్తాయి. దురద కూడా ఉంటుంది. ఇది చికాకు, అలర్జీని కలిగిస్తుంది. మీరు చెప్పినట్లుగా ఆభరణాలు, రబ్బరు తొడుగులు దీనికి కారణమవుతాయి. అలాగే కొన్ని రకాల పరిమళ ద్రవ్యాలు, జుట్టు రంగులు(హెయిర్‌డై), చర్మ సంబంధిత ఉత్పత్తుల వల్ల కూడా ఇది సంభవించవచ్చు. నుమ్యులార్ డర్మటైటిస్ : ఇందులో మచ్చలు నాణెం ఆకృతిలో ఎరుపు ఫలకాల్లా ఉంటాయి. ఇది సాధారణంగా కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై కనిపిస్తుంది. ఇది స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది 55 నుంచి 65 ఏళ్ల మధ్య వారిలో ఎక్కువ. ఎగ్జిమా : ఇది కూడా ఒక రకమైన డర్మటైటిస్. క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ని ఎగ్జిమా అంటారు. ఎగ్జిమాలో చర్మం ఎరుపుదనంతో కమిలినట్లుగా కనిపించడం, కొద్దిగా పొరలుగా తయారవ్వడం, వాపు, దురద దీనిలో ప్రధాన లక్షణాలు. ఎగ్జిమా బయటపడేప్పుడు మొదట చర్మం కమిలినట్లగా ఎరుపురంగుకి మారుతుంది. తర్వాత పొక్కుల్లా వచ్చి, అవి క్రమంగా నీటిపొక్కుల ఆకృతిని సంతరించుకుంటాయి. సెబోరిక్ డర్మటైటిస్ : ఇది పిల్లల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖం, తల మీది చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా కనిపిస్తుంది. ఇంకా కనుబొమల సమీపంలో, ముక్కుకు ఇరుపక్కలా వ్యాపిస్తుంది. ఇది అధిక ఒత్తిడి వల్ల రావచ్చు. కారణాలు : ∙రోల్డ్‌గోల్డ్ నగలు ∙కొన్ని రకాల మందులు వాడటం వల్ల ∙జుట్టు కోసం వాడే రంగులతో ∙ఇక బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో కూడా డర్మటైటిస్ రావచ్చు. చికిత్స : డర్మటైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. యాంటీమోనియమ్ క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ముక్కులు బిగదీసుకుపోయి వాసనలు తెలియడం లేదు నా వయసు 28 ఏళ్లు. నాకు గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారవడంతోపాటు ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. వాసనలు తెలియడం లేదు. చాలా మంది డాక్టర్లను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. – రవికిరణ్, కోదాడ మీరు ‘అలర్జిక్ రైనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటు వాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. లక్షణాలు : ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నివారణ : ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ∙ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ∙చల్లిని వాతావరణానికి దూరంగా ఉండటం, ∙పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. చికిత్స : హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది నా వయసు 58 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఫణీంద్ర, కాకినాడ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తి తన పట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి. ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్